twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కెమెరామెన్‌ గంగతో...' నిర్మాతపై పూరీ జగన్ కంప్లైంట్.. వివాదం

    By Srikanya
    |

    హైదరాబాద్: పవన్‌ కళ్యాణ్ హీరోగా, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు'. తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం నిర్మాత డివివి దానయ్యపై పూరీ జగన్ మండిపడుతున్నారు. ఆయన తనకు రెమ్యునేషన్ ఎగ్గొట్టారని కంప్లైంట్ ఇచ్చారు. నాలుగున్నర కోట్ల రూపాయలు తనకు ఇవ్వలేదని ఆ కంప్లైంట్ లో ఆయన రాసారు. ఈ కంప్లైంట్ ని ఆంధ్రప్రదేశ్ డైరక్టర్ అశోశియేషన్ వారు ఫిల్మ్ పెడరేషన్ ఆఫ్ ఇండియా కి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి ఫార్వడ్ చేసారు. నిర్మాతల మండలిలో ఆయన కంప్లైంట్ చేసారు. ఈ విషయమై ఇంకా దానయ్య వివరణ ఇవ్వలేదు.

    ఇక ఈ చిత్రం అత్యధిక ప్రింట్స్ తో ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 18న విడుదల చేయన్నారు. దాదాపు 12 సంవత్సరాల క్రితం వచ్చిన క్రేజీ కాంబినేషన్‌ పవన్‌కళ్యాణ్‌, పూరిజగన్నాధ్‌లది. నాటి 'బద్రి' చిత్రం ఎంతటి సెన్సేషన్‌ సృష్టించిందో విదితమే. మళ్లీ ఎప్పుడెప్పుడా ఆ కాంబినేషన్‌ అని ఎదురుచూసిన అభిమానులకు 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు' చిత్రం ద్వారా కనువిందు చేయనుందీ కాంబినేషన్ .

    సూర్యదేవర రాధాకృష్ణ సమర్పణలో ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య యూనివర్సల్‌ మీడియా బ్యానర్‌పెై నిర్మిస్తున్నారు. నిర్మాత దానయ్య మాట్లాడుతూ.. 'పవన్‌కళ్యాణ్‌ ఓ పవర్‌ఫుల్‌ జర్నలిస్ట్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు. మంచి పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌తో పూరి జగన్నాధ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అభిమానులు అంతా మెచ్చేవిధంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. టాకీ పార్ట్‌ పూర్తయ్యింది. బ్యాలెన్స్‌ పాట చిత్రీకరణతో మొత్తం పూర్తవుతుంది. ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ ఎపిసోడ్స్‌ హైలెైట్‌గా ఉండబోతున్నాయి అన్నారు.

    అలాగే పూరి జగన్నాధ్‌ ప్రత్యేకంగా పవన్‌ కోసం రాసిన డెైలాగ్స్‌కు థియేటర్లో చప్పట్లు మార్మోగుతాయి. ఏకధాటిగా సింగిల్‌ షెడ్యూల్‌లో ఇంతటి భారీ చిత్రాన్ని పూర్తిచేయడానికి ప్రధాన కారణం పవన్‌కళ్యాణ్‌, పూరిల సహకారం. మా బ్యానర్‌లో పవన్‌కి బిగ్గెస్ట్‌ హిట్‌ రాబోతున్నందుకు సంతోషంగా ఉంది' అన్నారు. పూరి జగన్నాధ్‌ మాట్లాడుతూ 'బద్రితో దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చిన పవన్‌కళ్యాణ్‌తో మళ్లీ ఇన్నేళ్లకు సినిమా చేసే అవకాశం వచ్చింది. ఇది కచ్చితంగా పవన్‌కళ్యాణ్‌నుంచి ఎలాంటి సినిమా ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారో అలాంటి పవర్‌ఫుల్‌ సినిమా ఇది. పవన్‌ కెరీర్‌లోనే ఓ ల్యాండ్‌మార్క్‌ ఫిలిం అవుతుంది. ఇందులో ఓ సరికొత్త పవన్‌ కళ్యాణ్‌ను చూస్తారు' అన్నారు.

    హీరోయిన్‌ తమన్నా మాట్లాడుతూ 'పవన్‌తో తొలిసారి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పైగా లీడ్‌ క్యారెక్టర్‌ గంగ నాకు ఎంతో బాగా నచ్చి చేస్తున్న చిత్రం' అన్నారు. ప్రకాష్‌రాజ్‌, గ్యాబ్రియల్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్‌ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మ ణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: యూ నివర్సల్‌ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి. దానయ్య, కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాధ్‌.

    English summary
    Pawan Kalyan's Cameraman Gangatho Rambabu film's director Puri Jagannath has lodged a written complaint against the movie's producer Danayya citing that the producer is refusing to pay the director's remuneration. The bone of contention is said to be about the payment of Rs 4.5 Crores. Andhra Pradesh Director's Association has now forwarded the complaint to Film Federation of India and Producer's Council. Cameraman Gangatho Rambabu is slated for October 18th release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X