»   »  నితిన్ ట్వీట్ కు ఘాటుగా పూరి జగన్ రిప్లై

నితిన్ ట్వీట్ కు ఘాటుగా పూరి జగన్ రిప్లై

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కొన్ని అనివార్య కారణాల వల్ల పూరి జగన్నాధ్ గారితో నేను చేయాల్సిన సినిమాను ఆపేస్తున్నాం. ప్యూచర్ లో ఆయనతో పనిచేస్తానని ఆశిస్తున్నాను అని నితిన్ ట్విట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కాస్త ఘాటుగానే పూరి స్పందించారని ఆయన తాజా ట్వీట్ చూస్తే అర్దమవుతుంది.

పూరీ ట్వీట్ చేస్తూ..." నేను నితిన్ తో చేద్దామనుకున్న ప్రాజెక్టుని వేరే హీరోతో చేస్తున్నాను. అదే రోజున షూటింగ్ ప్రారంభమవుతుంది..మిగతా వివరాలు త్వరలో తెలియచేస్తాను " అన్నారు. అదే రోజున వేరే హీరోతో ఇదే కథతో ప్రాజెక్టు స్టార్ట్ చేస్తానని పూరి వెంటనే అనటం అంతటా చర్చనీయాంశంగా మారింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అసలు నితిన్ మొదట చేసిన ట్వీట్ మీరూ చూడండి.

గతంలో పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ‘ గతంలో నితిన్ నాకు ఒక మంచి వ్యక్తిగా తెలుసు. ఎప్పటి నుంచి అయితే అతనితో పనిచేసానో అప్పటి నుంచి అతనితో ప్రేమలో పడిపోయాను. అతను ఎంతో కష్టపడి పనిచేస్తాడు, అలాగే అతని ఎనర్జీ లెవల్స్ బాగా హై రేంజ్ లో ఉంటాయి. ఎప్పటి నుంచో సినిమా చెయ్యాలనుకుంటున్నాం అది ఇప్పటికి కుదిరింది.' అని అన్నాడు. మరి ఈ లోగా ఏం తేడాలో వచ్చాయో ఏంటో ఇలా కాన్సిల్ అయ్యింది ఈ ప్రాజెక్టు.

 Puri Jagan on Nitin's tweet

ఇక పూరి రిలీజ్ కు రెడీగా ఉన్న జ్యోతి లక్ష్మి చిత్రం విషయానికి వస్తే...

పూరి దర్శకత్వం వహించిన చిత్రం 'జ్యోతిలక్ష్మీ'. ఛార్మి ప్రధాన పాత్రధారి. వరుణ్‌ తేజ్‌, సి.వి.రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే 'జ్యోతిలక్ష్మీ' తొలి గీతాన్ని విడుదల చేశారు. 'జ్యోతిలక్ష్మీ ఐయామ్‌ కాస్ట్‌లీ టు టచ్‌ మీ..' అంటూ సాగే ఈ గీతాన్ని భాస్కరభట్ల రవికుమార్‌ రచించారు.

సునీల్‌ కశ్యప్‌ సంగీత సారథ్యంలో ఉమా నేహా గానం చేశారు. సి.కల్యాణ్‌ మాట్లాడుతూ ''జ్యోతిలక్ష్మీ స్వభావాన్ని వ్యక్తం చేసే గీతమిది. భాస్కరభట్ల చక్కగా రాశారు. ఈ నెల 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు.

పూరి మాట్లాడుతూ...జ్యోతిలక్ష్మీ అమ్మాయి కాదు. ఆటమ్‌బాంబు లెక్క! మాటలు సీమటపాకాయల్లా పేల్తూనే ఉంటాయి. ఇక పాటపాడితే.. మామూలుగా ఉంటుందా? అందుకే 'ఏయ్‌ రాసుకోరా సాంబ..' అంటూ తన గురించి తాను గొప్పగా ఆవిష్కరించుకొంది. ఆ సంగతేంటో తెలియాలంటే జ్యోతిలక్ష్మీ సినిమా చూడాల్సిందే అంటున్నారు .

English summary
puri jagan ‏tweeted: " The film I planned with Nitin am doing now with another hero ..shooting starts on same date ..will share details soon"
Please Wait while comments are loading...