twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బాహుబలి' పై పూరి చిత్రమైన కామెంట్

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'బాహుబలి' కావాలంటే వంద రూపాయలు పెట్టి చూడటం ఉత్తమం అనుకొంటా. నేను రాసుకొన్న స్క్రిప్టు రెండు నెలల తర్వాత నాకే బోర్‌ కొట్టేస్తుంది. ఇక ఒక స్క్రిప్టుని ఏళ్లపాటు తీయడం మాత్రం నా వల్ల కాదు అంటూ దర్శకుడు పూరి జగన్నాథ్ చిత్రమైన కామెంట్ చేసారు. ఆయన పుట్టిన రోజు సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ...'బాహుబలి' లాంటి భారీ సినిమాలు మీ నుంచి వూహించొచ్చా? అన్న ప్రశ్నకు ఇలా స్పందించారు.

    కాకపోతే...'బాహుబలి', 'శ్రీమంతుడు' లాంటి సినిమాలు తెలుగు పరిశ్రమకి బలాన్నిచ్చాయి. పరిశ్రమకి ఒక విజయం లభించిందంటే.. ఆ తర్వాత వచ్చే సినిమాల వ్యాపారం బాగుంటుంది. పారితోషికాలు మారుతాయి. మున్ముందు మన పరిశ్రమ ఇలా పెరుగుతూనే వెళుతుందని నా అభిప్రాయం అని అన్నారు.

    Puri Jagan reaction on Baahubali movie

    అలాగే... వేగంగా సినిమాలు చేయకుండా కాస్త నిదానంగా తీస్తే మీ నుంచి మరింత మంచి సినిమాలు వచ్చే అవకాశాలుంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయనేది నాకు తెలియదు. రెండేళ్లపాటు స్క్రిప్టు రాసుకొని, రెండేళ్లు సినిమా చేయడం నాకు ఇష్టముండదు. నేను రాసిన స్క్రిప్ట్‌ కంటే రెండు సంవత్సరాలు చాలా విలువైనవని నమ్ముతుంటా. అందుకే సమయం వృథా చేసుకోను అని చెప్పారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఇక స్టార్‌ హీరోలు ఫోన్లు తీయని రోజులూ ఉన్నాయి. అందుకే ఎవరు అందుబాటులో ఉంటే వాళ్లతోనే సినిమాలు చేయాలి. పనిచేయడం మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపకూడదు. పెద్ద సినిమానే చేయాలి, ఎవరికోసమో ఎదురు చూడాలి అని మాత్రం అనుకోను అని తేల్చి చెప్పారు.

    English summary
    Director Puri Jagan talked abotu Baahubali movie. He said that he want to see that movie and not want to make that kind of stuff.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X