»   » నితిన్ ట్వీట్... చిరు సినిమా ఏమైనట్లు?

నితిన్ ట్వీట్... చిరు సినిమా ఏమైనట్లు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :గత కొద్ది రోజులుగా ...ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ...చిరంజీవికి ఓ కథ వినిపించి ఆయన 150వ సినిమాని తెరకెక్కించే అవకాశాన్ని సొంతం చేసుకొన్నారనే వార్తలే‌. ఆ కాంబినేషన్‌ ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తూండగానే... ఇప్పుడు నితిన్ ...ఓ ట్వీట్ చేసి ఆశ్చర్యపరిచాడు. ఇంతకీ నితిన్ చేసిన ట్వీట్ చిరంజీవి సినిమా గురించేమీ కాదు...అతని సినిమా గురించే.

''పూరి జగన్నాథ్‌ చెప్పిన పూర్తి కథని విన్నా. హృదయానికి హత్తుకొనే ఓ మంచి వినోదాత్మక కథ. ఈ నెల 15 నుంచే మొదలవుతోంద''ని ట్వీట్‌ చేశారు నితిన్‌.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నితిన్ తో చిత్రం చేస్తే మరి ఎప్పుడు చిరంజీవి ఎప్పుడు ప్రారంభమవుతుందంటున్నారు అభిమానులు. ఈ లోగా.. మహేష్‌బాబుకీ ఓ కథ చెప్పి ఆయనతోనూ ఓకే అనిపించుకొన్నారు. ఈ రెండు చిత్రాలు పట్టాలపైకి వెళ్లేలోపు నితిన్‌తోనూ ఓ చిత్రం చేసేందుకు సన్నాహాలు చేసుకొన్నారు పూరి.

జూన్‌ 15 నుంచే ఆ సినిమా చిత్రీకరణ మొదలవుతోంది. దీని తర్వాతే చిరు 150వ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.'హార్ట్‌ ఎటాక్‌' తర్వాత పూరి, నితిన్‌ కలసి చేస్తున్న చిత్రమిది.

Puri Jagan’s next with Nitin

ఇక పూరి రిలీజ్ కు రెడీగా ఉన్న జ్యోతి లక్ష్మి చిత్రం విషయానికి వస్తే...

పూరి దర్శకత్వం వహించిన చిత్రం 'జ్యోతిలక్ష్మీ'. ఛార్మి ప్రధాన పాత్రధారి. వరుణ్‌ తేజ్‌, సి.వి.రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే 'జ్యోతిలక్ష్మీ' తొలి గీతాన్ని విడుదల చేశారు. 'జ్యోతిలక్ష్మీ ఐయామ్‌ కాస్ట్‌లీ టు టచ్‌ మీ..' అంటూ సాగే ఈ గీతాన్ని భాస్కరభట్ల రవికుమార్‌ రచించారు.

సునీల్‌ కశ్యప్‌ సంగీత సారథ్యంలో ఉమా నేహా గానం చేశారు. సి.కల్యాణ్‌ మాట్లాడుతూ ''జ్యోతిలక్ష్మీ స్వభావాన్ని వ్యక్తం చేసే గీతమిది. భాస్కరభట్ల చక్కగా రాశారు. ఈ నెల 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు.

పూరి మాట్లాడుతూ...జ్యోతిలక్ష్మీ అమ్మాయి కాదు. ఆటమ్‌బాంబు లెక్క! మాటలు సీమటపాకాయల్లా పేల్తూనే ఉంటాయి. ఇక పాటపాడితే.. మామూలుగా ఉంటుందా? అందుకే 'ఏయ్‌ రాసుకోరా సాంబ..' అంటూ తన గురించి తాను గొప్పగా ఆవిష్కరించుకొంది. ఆ సంగతేంటో తెలియాలంటే జ్యోతిలక్ష్మీ సినిమా చూడాల్సిందే అంటున్నారు .

English summary
Puri Jagan who directed Heart Attack with Nitin in the past is all set to direct another film. Nitin has listened to the full narration of the story today and he is going to do it. Shooting of this film will start on 15 June. Nitin termed it as heart touching entertainer. Puri Jagan has also agreed to direct 150th film of Chiranjeevi.
Please Wait while comments are loading...