»   » పూరి వదిలిన ఈ వీడియో అదిరిందిగా, ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో

పూరి వదిలిన ఈ వీడియో అదిరిందిగా, ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో 'రోగ్‌' అనే చిత్రం రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే. ఇషాన్‌ ఈ చిత్రంతో హీరోగా ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను పూరీ జగన్నాథ్‌ అర్ధరాత్రి 12 గంటలకు విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఆయన రెట్టించిన ఉత్సాహంతో మోషన్ పో స్టర్ ని రిలీజ్ చేసారు. ఈ చిత్రం తనకు చాలా ప్రత్యేకమని పేర్కొన్నారు.

ఇషాన్‌ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.
ప్రేమికుల రోజు సందర్భంగా హీరో తలకిందులుగా వేలాడుతూ కనిపించిన పోస్టర్‌ను విడుదల చేయగా, ఇప్పుడు హీరోను హీరోయిన్‌ కౌగిలించుకోగా, హీరో చెట్టుకు వేలాడుతూ ఉన్న మోషన్‌ పోస్టర్‌ సరికొత్తగా ఆకట్టుకుంటోంది.


సాధారణంగా పూరి జగన్నాథ్‌ చిత్రాల్లో హీరోలకు ఓ ప్రత్యేకమైన యాటిట్యూడ్‌ ఉంటుంది. 'ఇడియట్‌', 'పోకిరి', 'దేశముదురు'లాంటి చిత్రాలే ఇందుకు ఉదాహరణ. ప్రస్తుతం అదే తరహాలో పూరి 'రోగ్‌' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. 'మరో చంటిగాడి ప్రేమకథ' అనేది ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం..ఖచ్చితంగా అప్పట్లో వచ్చిన . 'ఇడియట్‌' తరహాలో పెద్ద హిట్ అవుతుందని బావిస్తున్నారు.


ఇడియట్ చిత్రంలో రవితేజ చంటిగాడి పాత్ర జనాల్లోకి ఎంతలా వెళ్లిపోయిందో అదే తరహాలో ఇప్పుడు కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రం కూడా అలాగే ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంటుందని సమాచారం. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు అనూహ్యమైన స్పందన వచ్చిందనీ, త్వరలోనే తెలుగుతో పాటు కన్నడంలోనూ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామనీ నిర్మాతలు తెలిపారు.


ఇషాన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మన్నారా చోప్రా, ఏంజెలా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అనూప్‌సింగ్‌, ఆజాద్‌ ఖాన్‌, పోసాని కృష్ణమురళి, అలీ, సత్యదేవ్‌, సుబ్బరాజ్‌, రాహుల్‌ సింగ్‌, తులసి, రాజేశ్వరి, సందీప్తి తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బి.రవికుమార్‌, ఆర్ట్‌: జానీ షేక్‌, ఎడిటర్‌: జునైద్‌ సిద్ధిఖీ, మ్యూజిక్‌: సునీల్‌కశ్యప్‌, సినిమాటోగ్రఫీ: ముఖేష్‌.జి, నిర్మాతలు: సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

English summary
Puri Jagannadh is gearing up for a strong comeback with his upcoming movie, Rogue starring Ishaan in the lead role.Here is the official motion poster of Puri Jagannadh’s Rogue!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu