»   » పూరీ, వర్మ గెస్ట్ లుగా ఇరగదీసారు(ఫొటోలు)

పూరీ, వర్మ గెస్ట్ లుగా ఇరగదీసారు(ఫొటోలు)

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: పూరి జగన్నాధ్, తన గురువు వర్మతో కలసి గెస్ట్ లుగా ఓ ఆడియో పంక్షన్ కు హాజరయ్యారు. దాంతో ఆ పంక్షన్ మొత్తం సరదా,సరదాగా గడిచిపోయింది. ఇంతకీ వీళ్లిద్దరూ ఎవరి ఆడియో కి వెళ్ళారూ అంటే పూరీ తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా చేసిన చిత్రం రోమియో కు. ఇటీవల హైదరాబాద్‌లో పాటల విడుదల కార్యక్రమం జరిగింది.

  సాయిరామ్ శంకర్ హీరోగా టచ్‌స్టోన్ ఫిల్మ్ ప్రొడక్షన్ పతాకంపై తెరకెక్కించిన సినిమా 'రోమియో'. దొరైస్వామి నిర్మిస్తున్నారు. అదోనిక నాయిక. పూరి జగన్నాథ్ కథ, మాటలు రాశారు. గోపి గణేష్ దర్శకుడు. పూరి రాసిన ప్రేమకథ అనేది ఉపశీర్షిక. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి.

  పూరి మీద ఉన్న అభిమానంతో రవితేజ ఈ సినిమా అతిధి పాత్రలో నటించడానికి ఒప్పుకున్నాడు. 5 నిమిషాల నిడివి గల పాత్రలో రవితేజ కనిపించబోతున్నాడు. పి.జి వినడ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. సినిమాలో రవితేజ అలా వచ్చి వెళ్లిపోవటం కాదని, ఓ సర్పైజ్ గా ఉంటుందని చెప్తున్నారు. సినిమాలో కథను మలుపు తిప్పేదిగా ఈ గెస్ట్ పాత్ర ఉంటుందని చెప్తున్నారు.

  ఆడియో ఫంక్షన్ ఫొటోలు స్లైడ్ షోలో...

  ఆవిష్కరణ...

  ఆవిష్కరణ...

  తొలి సీడీని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఆవిష్కరించారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి స్వీకరించారు.

  వర్మ మాట్లాడుతూ...

  వర్మ మాట్లాడుతూ...

  ''హార్రర్‌ తరహా చిత్రాల్ని తీయడమంటే నాకు చాలా ఇష్టం. ప్రేమకథలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ విషయంలో పూరి జగన్నాథ్‌ ముందుంటాడు. ఇప్పటిదాకా వచ్చిన ప్రేమకథల్లో 'రోమియో జూలియట్‌' అంటే ఇష్టం. ఈ కథకు తగ్గట్టుగానే చిత్రానికి 'రోమియో' అనే పేరు పెట్టారు... సాయి ఎనర్జీ లెవల్స్ ట్రైలర్‌లో కనిపిస్తున్నాయి'' అన్నారు

  పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ

  పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ

  ''ఒక సినిమా చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లినప్పుడు రోమియో, జూలియట్‌ పుట్టిన ప్రాంతాన్ని చూశా. వారి విగ్రహాల దగ్గరకు రోజూ ప్రేమికులు రావడం, అక్కడ పుష్పగుచ్ఛాలుంచడం, గుర్తుగా అక్కడ ఏవేవో రాయడం చూసి ఈ కథని తీర్చిదిద్దా. సునీల్‌ కశ్యప్‌ కథకు తగ్గట్టుగా సంగీతం అందించాడు. నా సంస్థలో ఇదే బృందంతో త్వరలోనే ఓ సినిమా తీస్తాను''అని చెప్పారు.

  సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ...

  సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ...

  ''కథ అందించిన అన్నయ్యకీ, సినిమాలో అతిథి పాత్రలో నటించిన రవితేజకి నా కృతజ్ఞతలు. గోపీ గణేష్‌ చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది''అన్నారు సాయిరామ్‌ శంకర్‌.

  నిర్మాత మాట్లాడుతూ...

  నిర్మాత మాట్లాడుతూ...

  "జెమిని కిరణ్‌గారు నిర్మాణ పరంగా ఎన్నో సలహాలిచ్చారు. దర్శకుడు బాగా కష్టపడ్డారు. కథనిచ్చిన పూరికి థాంక్స్. సినిమా పట్ల నమ్మకంగా ఉన్నాం'' అని నిర్మాత అన్నారు.

  గోపిగణేశ్ మాట్లాడుతూ.....

  గోపిగణేశ్ మాట్లాడుతూ.....

  "చరిత్రలో నిలిచిపోయిన ప్రేమజంట రోమియో, జూలియట్. వీరు యూరప్‌లో కలిసే ప్రదేశం వెరోనా. దీని నేపథ్యంలో జరిగే ప్రేమకథాచిత్రమే 'రోమియో'. యువతరాన్ని ఆకట్టుకునే అన్ని అంశాలూ ఇందులో ఉంటాయి'' అని చెప్పారు.

  వీరు కూడా...

  వీరు కూడా...

  ఈ కార్యక్రమంలో భాస్కరభట్ల, విశ్వ, రెహమాన్‌, జెమిని కిరణ్‌, విందా, నవీన్‌, నిరంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

  రెండో సారి...

  రెండో సారి...

  గతంలో పూరీ తన సోదరుడు సాయిరామ్ శంకర్ కోసం బంపర్ ఆఫర్ స్క్రిప్టుని ఇచ్చి తన శిష్యుడుతో డైరక్ట్ చేయించారు. మళ్లీ ఈ సారి అదే ప్రయత్నం చేస్తున్నాడు.

  ఎవరెవరు

  ఎవరెవరు

  ఈ చిత్రంలో సుబ్బరాజు, అలీ, ప్రగతి తారాగణమైన ఈ చిత్రానికి పాటలు: భాస్కరభట్ల, విశ్వ, రెహమాన్, సంగీతం: సునీల్ కాశ్యప్, ఛాయాగ్రహణం: పి.జి. విందా, కూర్పు: ఎస్.ఆర్. శేఖర్, కళ: చిన్నా, ఫైట్స్: వెంకట్, కొరియోగ్రఫీ: రఘు, కథ, మాటలు: పూరి జగన్నాథ్, స్కీన్‌ప్లే, దర్శకత్వం: గోపిగణేశ్.

  రవితేజ ప్రత్యేకం...

  రవితేజ ప్రత్యేకం...

  బలుపు హిట్ తో మంచి ఊపు మీద ఉన్న రవితేజ త్వరలో ఓ గెస్ట్ రోల్ లో కనిపించి మురిపించనున్న సంగతి తెలిసిందే. ఆయన పాత్ర సినిమా హైలెట్ లలో ఒకటిగా నిలిచిపోతుందని చెప్తున్నారు.

  English summary
  Puri Jagannadh again provided story and dialogues for his brother Sai Ram Shankar’s film. Gopi Ganesh who worked in Puri’s direction department is directing this film. Valluripalli Ramesh is producing this film. Romeo is the title and ‘Puri Raasina Prema Katha’ is the caption for it. Adonika is being introduced as heroine with this film.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more