»   » పూరినే దర్శకుడు...అవి రూమర్సే అని తేల్చాడు

పూరినే దర్శకుడు...అవి రూమర్సే అని తేల్చాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కొద్ది రోజులు క్రితం చిరంజీవి 150వ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారని అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. అయితే గత రెండు, మూడు రోజులుగా ఈ చిత్రానికి వేరే దర్శకుణ్ణి తీసుకున్నారని ఫిలిం సర్కిల్స్ లో ఓ చర్చ జరుగుతోంది. ఈ చర్చకు ఒక్క ట్వీట్‌తో పుల్‌స్టాప్ పెట్టేశారు పూరి జగన్నాథ్. ఆ ట్వీట్ మీరూ చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

''చిరంజీవిగారికి ఈ చిత్రానికి సంబంధించిన కథ తాలూకు ఫస్ట్ హాఫ్ చెప్పాను. ఆయనకు బాగా నచ్చేసింది. ఇప్పుడు సెకండ్ హాఫ్ కోసం వర్క్ చేయాలి. ఇది పది రెట్లు బాగుండేలా తయారు చేస్తా'' అని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు పూరి.

puri jagannath

మరో ప్రక్క పూరీ జగన్నాథ్, హీరో నితిన్‌తో ఓ కొత్త సినిమాను ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ‘హార్ట్ అటాక్' తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందే సినిమా కావడంతో ఈ సినిమాపై అనౌన్స్ అయిన రోజునుంచే మంచి అంచనాలున్నాయి. అయితే సడెన్‌గా ఈ సినిమా ఆగిపోవడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తై, ఈ నెల 15న సెట్స్‌పైకి వెళ్ళాల్సిన సినిమా ఇలా అకస్మాత్తుగా ఆగిపోవడం అందరికీ షాక్ ఇచ్చింది. వర్మ కు మాత్రం ఇందులో ట్వీట్స్ ద్వారా ఫన్ వెతుక్కునేలా చేసింది.

ఇక ఈ సినిమా ఆగిపోయిందన్న విషయాన్ని పూరీ జగన్నాథ్, నితిన్‌లు విడివిడిగా తమ ట్విట్టర్ ఎకౌంట్‌లలో తెలిపారు. తాను నితిన్‌తో ప్లాన్ చేసిన సినిమా క్యాన్సిల్ అయిందని, వేరొక హీరోతో ఇంతకుముందు తెలియజేసిన రోజునుంచే షూటింగ్ మొదలుకానుందని పూరీ తెలిపారు. ఇక నితిన్ సైతం తన ట్విట్టర్‌ ఎకౌంట్‌లో సినిమా ఆగిపోయిందన్న విషయాన్ని తెలియజేశారు.

"పూరీ గారితో ప్లాన్ చేసిన సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. భవిష్యత్‌లో ఆయనతో మళ్ళీ కలిసి పనిచేయాలని కోరుకుంటున్నా" అంటూ నితిన్ సినిమా ఆగిపోయిన విషయాన్ని తెలిపారు.

English summary
puri jagan tweeted: " Just narrated 1st half to Megastar nd am happy he's thrilled..I want to work very hard to make 2nd half 10times better"
Please Wait while comments are loading...