»   » మహా చిరాకు! పవన్ కళ్యాణ్ గారే ఫ్యాన్స్‌ని కంట్రోల్‌ చేయాలి: పూరి

మహా చిరాకు! పవన్ కళ్యాణ్ గారే ఫ్యాన్స్‌ని కంట్రోల్‌ చేయాలి: పూరి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వరుణ్ తేజ్, దిశా పటాని హీరో హీరోయిన్లుగా పూరి జ‌గ‌న్నాథ్ తెరకెక్కిన చిత్రం ‘లోఫర్'. సి.కళ్యాణ్ నిర్మించిన ఈచిత్రం డిసెంబర్ 17న విడుద‌లవుతోంది. ఈ నేపథ్యంలో పూరి జగన్నాధ్ శనివారం ప్రెస్ మీట్ పెట్టి సినిమాకు సంబంధించిన విషయాలు వెల్లడించారు.

మీడియా ప్రతినిధులు చేసిన ఇంటర్వ్యూలో... ఇటీవల లోఫర్ ఆడియో ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ అభిమానులు చేసిన గొడవ విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. లోఫర్ ఆడియో ఫంక్షన్ జరుగకుండా కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లరి చిల్లరగా వ్యవహరించడంపై పూరి స్పందించారు.

‘అలాంటి పనులు చేస్తే.... ఎవ‌రికైనా చిరాగ్గానే ఉంటుంది. ఎంతో ఖ‌ర్చుపెట్టి ఫంక్ష‌న్ చేసి, మా సినిమా గురించి నాలుగు మాట‌లు చెప్పాల‌ని అనుకున్నాం. వారు అరవడం మూలంగా ఎవ‌రూ మాట్లాడాల‌నుకున్న‌ది మాట్లాడ‌లేక‌పోయాం. ఫ్యాన్స్ కి క‌ల్యాణ్ గారు చెప్పాలి, ఆయనైతేనే వారిని కంట్రోల్ చేయగలరు. ఇలాగే వదిలేస్తే పవ‌న్‌గారి ఫ్యాన్స్ కి కామ‌న్ సెన్స్ లేద‌ని అంతా అనుకుంటారు. అరిచి ప‌రువు తీయ‌కండ్రా అని క‌ల్యాణ్ గారు చెప్పాలి. ఏ ట్విట్ట‌ర్‌లోనో ఆయ‌న దీని గురించి రాస్తే బావుంటుంది' అని పూరి జగన్నాధ్ వ్యాఖ్యానించారు.

లోఫర్ మూవీ, చిరంజీవి తో సినిమా గురించి, మెగా ఫ్యాన్స్ హర్టవడంపై పూరి జగన్నాధ్ చెప్పిన వివరాలు స్లైడ్ షోలో....

లోఫర్

లోఫర్

టైటిల్ కు తగిన విధంగా సినిమా ఉంటుంది. గ‌తంలోనూ ఇడియ‌ట్‌, పోకిరి, దేశ‌ముదురు అని సినిమాలు చేశాను. అయినా అందులో హీరోలు మంచి వారే క‌దా. అలాగే లోఫ‌ర్‌ను కూడా మంచి వాడిగా చూపించే ప్ర‌య‌త్నం చేశాం.

మదర్ సెంటిమెంట్

మదర్ సెంటిమెంట్

గతంలో నేను తీసిన అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి త‌ర‌హాలో ఉంటుంది. కాక‌పోతే ఆ సినిమాలో త‌ల్లీ కొడుకులు క‌లిసి ఉంటారు. ఈ సినిమాలో క‌లిసి ఉండ‌రు. పైగా కొడుకును అస‌హ్యించుకుంటుంది త‌ల్లి.

మంచి తండ్రి, చెడ్డ తండ్రి మధ్యలో కొడుకు

మంచి తండ్రి, చెడ్డ తండ్రి మధ్యలో కొడుకు

మంచి త‌ల్లి, చెడ్డ తండ్రి మ‌ధ్య‌లో కొడుకు. ముగ్గురూ బ‌తికే ఉంటారు. కానీ చ‌నిపోయార‌ని ఒక‌రికొక‌రు అనుకుంటుంటారు. రేవ‌తి ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి పాత్ర‌ను చేయ‌లేదు. న‌న్ను న‌మ్మి చేస్తున్నాన‌ని చెప్పింది. పోసాని ఇప్ప‌టిదాకా చేయ‌ని పాత్ర‌లో క‌నిపిస్తారు. వారిద్ద‌రూ సినిమాకు లెఫ్ట్ హ్యాండ్ ఒక‌రైతే, రైట్ హ్యాండ్ మ‌రొక‌రు.

చిరంజీవి 150వ సినిమాపై మీ వ్యాఖ్యలు ఫ్యాన్స్ హ‌ర్ట్ చేసాయి

చిరంజీవి 150వ సినిమాపై మీ వ్యాఖ్యలు ఫ్యాన్స్ హ‌ర్ట్ చేసాయి

ఫ్యాన్స్ ప్ర‌తిదానికీ రియాక్ట్ అవుతారులెండి. చిరంజీవిగారితో నాకున్న సాన్నిహిత్యం వారికి తెలీదు క‌దా. ఈ మ‌ధ్య కూడా ఆయ‌న్ని క‌లిశాను. ఆయ‌న 150వ సినిమా కాక‌పోతే, 151, 152 ఏదో ఒక సినిమా చేస్తాను.

వరుణ్ తేజ్ గురించి

వరుణ్ తేజ్ గురించి

వరుణ్ తేజ్ చాలా బాగా చేసాడు. భవిష్యత్తులో పెద్ద స్టార్ అవుతాడు. చిరంజీవి గారు కూడా ఇటీవల వరుణ్ టాలెంట్ గురించి ఎంతో బాగా చెప్పారు అన్నారు.

English summary
"Even I got irritated when such slogans were shouted during other hero’s function. I feel that it is high time Pawan kalyan tell his fans to change this as it is spoiling his name only" Puri Jagannadh said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu