»   » పూరి నిర్ణయంతో అంతా షాక్: బాలయ్య సినిమా విషయంలోనూ అదే పోకడ!

పూరి నిర్ణయంతో అంతా షాక్: బాలయ్య సినిమా విషయంలోనూ అదే పోకడ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణతో తొలిసారి సినిమా చేసే అవకాశం దక్కించుకున్న పూరి జగన్నాథ్‌.... ఇతర సినిమాల్లోనే ఈ సినిమా విషయంలోనూ ప్రయోగాలకు పూనుకున్నాడు. సినిమాలో ప్రధాన తారాగణం మొత్తం కూడా ఇప్పటి వరకు సినిమాల్లో నటించని కొత్తవారితో నింపేయబోతున్నారు.

పూరి తయారు చేసుకున్న కథ ప్రకారం... సినిమాలో మొత్తం ముగ్గరు హీరోయిన్లు అవసరం. వీరందరినీ కొత్తవారినే తీసుకోబోతున్నాడట. దీంతో పాటు సినిమా ప్రధాన విలన్, బాలయ్య పక్కనే సినిమా ఫుల్ లెంగ్త్ లో ఉండే ఓ కమెడియన్, ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్టులు మొత్తం 12 మంది కొత్త వారిని తీసుకోవాలని పూరి ప్లాన్ చేస్తున్నారు.

కొత్త వారిని తనదైన స్టైల్ లో ట్రైనింగ్ ఇచ్చి.... తనకు కావాల్సిన విధంగా వారిని నుండి పెర్ఫార్మెన్స్ ను పిండుకోవాలని పూరి ప్లాన్ చేస్తున్నారు.

బాలయ్య 101 వ సినిమా

బాలయ్య 101 వ సినిమా

తన 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి' భారీ విజయం సాధించడంతో మంచి ఊపుమీద ఉన్న బాలకృష్ణ 101వ బాలకృష్ణతో చేయాలని డిసైడ్ అయ్యాడు. పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించి, అగ్ర సంస్థల్లో ఒకటిగా దూసుకెళుతోన్న భవ్య క్రియేషన్స్‌ అధినేత వి. ఆనంద్‌ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు.

పూరి అంటేనే ప్రయోగాలు

పూరి అంటేనే ప్రయోగాలు

పూరి తన సినిమా సినిమాకు ఏదో ఒక కొత్తదనం చూపిస్తుంటారు. అందుకుగానూ రకరకాల ప్రయోగాలు చూపిస్తుంటారు. ఇపుడు బాలయ్యతో చేయబోతున్న సినిమా విషయంలోనూ అలాంటి అలాంటి పోకడతోనే ముందుకు సాగుతుండటం చర్చనీయాంశం అయింది.

సినిమా ఎప్పుడు ఫ్రారంభం?

సినిమా ఎప్పుడు ఫ్రారంభం?

మార్చి 9న బాలయ్య-పూరి సినిమా పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభం కానుంది. పూరి సినిమా అంటే పక్కా ప్లానింగుతో ఉంటుంది. అనుకున్న సమయానికి షూటింగ్ మొదలు పెట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

రిలీజ్ డేట్ కూడా ముందే ప్రకటన

రిలీజ్ డేట్ కూడా ముందే ప్రకటన

పూరి అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేస్తాడనే నమ్మకంతోనే నిర్మాత ఏకంగా చిత్రం రిలీజ్ డేట్ కూడా ప్రకటించేసారు. ఈఏడాది సెప్టెంబర్‌ 29న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

బాలయ్య పంచులకు థియేటర్ అదిరిపోవాల్సిందే

బాలయ్య పంచులకు థియేటర్ అదిరిపోవాల్సిందే

పూరి సినిమా అంటేనే పంచ్ డైలాగులు తప్పకుండా ఉంటాయి. మరి పవర్ ఫుల్ డైలాగులు చెప్పడంలో ఆరితేరిన బాలయ్య పంచ్ డైలాగులు పేలిస్తే ఎలా ఉంటుందో అని అందరూ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

English summary
Tollywood director Puri Jagannadh is directing the 101th film of hero Nandamuri Balakrishna and the team has decided to cast many new actors.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu