For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పూరీ జీవితాన్ని మార్చేశారు.. మారుతి తలరాత మార్చారు.. హాస్య నటుడు భద్రం (ఇంటర్వ్యూ)

  By Rajababu
  |

  సినిమాలపై ఆసక్తితో అలా తీసిన ఓ షార్ట్ ఫిలింతో ఏకంగా టాలీవుడ్‌లో మంచి నటుడిగా గుర్తింపుపొందుతున్నారు హాస్య నటుడు భద్రం. ఇటీవల ఆయన నటించిన జ్యోతిలక్ష్మి, భలే భలే మొగాడివోయ్, శతమానం భవతి చిత్రాల్లొ తనదైన హస్యంతో భద్రం ప్రేక్షకుడు విశేషంగా అలరిస్తున్నారు. తాజాగా దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించిన గల్ఫ్ చిత్రంలో ఓ మంచి పాత్రను పోషించారు. గల్ఫ్ చిత్రం రిలీజవుతున్న నేపథ్యంలో భద్ర తెలుగు ఫిల్మీబీట్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. భద్రం వెల్లడించిన విషయాలు ఆయన మాటల్లోనే..

  వాస్తవానికి నేను డాక్టర్‌ను

  వాస్తవానికి నేను డాక్టర్‌ను

  వాస్తవానికి నేను డాక్టర్‌ను. ఫిజియోథెరపీ నా స్పెషాలిటీ. అందులో ఎక్కువ సేపు కూర్చొని పనిచేసే వారికి వచ్చే సమస్యలకు పరిష్కారం చూపడం నా స్పెషలైజేషన్. నేను గూగుల్, ఇన్ఫోసిస్, ఇతర కంపెనీలలో పనిచేస్తున్నాను. ఒకానొక సమయంలో పెళ్లితో జరభద్రం అనే షార్ట్ ఫిలిం చేశాను.

  సినిమాల్లోకి ఎలా వచ్చారు?

  సినిమాల్లోకి ఎలా వచ్చారు?

  పెళ్లితో జరభద్రం షార్ట్ ఫిలిం నా జీవితాన్ని మార్చేసింది. ఆ షార్ట్ ఫిలింను దర్శకుడు పూరి జగన్నాథ్ చూసి దానిని ఆయన తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేశారు. దాంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. ఆ పోస్ట్‌లో భద్రం చాలా బాగా చేశావు. వీలైతే వచ్చి నన్ను కలవండి అని మెసేజ్ పెట్టారు. ఆ తర్వాత నా షార్ట్ ఫిలిం, నా గురించి 25 వెబ్‌సైట్లు గొప్పగా రాశాయి. పూరీ కొత్త టాలెంట్‌ను గుర్తించారు అని నా గురించి గొప్పగా రాశాయి.

   పూరీ జగన్నాథ్ ఆఫర్‌తో

  పూరీ జగన్నాథ్ ఆఫర్‌తో

  ఆ తర్వాత కొద్ది రోజులకు పూరిని కలిశాను. నేను తీసిన షార్ట్ ఫిలిం గురించి గొప్పగా చెప్పి నీ కోసం ఓ క్యారెక్టర్ ఇస్తాను అని ప్రామిస్ చేశారె. దాంతో జ్యోతిలక్ష్మీ చిత్రంలో బ్రోకర్ భద్రం నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమాలోని పాత్ర ఐఫాలో నామినేట్ కావడం ఉత్సాహం అందించింది.

  మారుతి కెరీర్‌ను మలుపు తిప్పారు

  మారుతి కెరీర్‌ను మలుపు తిప్పారు

  పెళ్లితో జరభద్రం షార్ట్ ఫిలిం చూసి దర్శకుడు మారుతి భలే భలే మొగాడివోయ్ చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత సతీష్ వెగ్నేశ శతమానం భవతి చిత్రంలో పాత్ర ఇచ్చారు. ఆ తర్వాత మహానుభావుడు చిత్రంలో మారుతి మరో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఆ పాత్రకు మంచి రెస్సాన్స్ వస్తున్నది.

   మహానుభావుడు చిత్రానికి మంచి రెస్పాన్స్

  మహానుభావుడు చిత్రానికి మంచి రెస్పాన్స్

  మహానుభావుడు చిత్రంలో హీరోయిన్ తండ్రి నాజర్‌ సహాయకుడిగా నటించాను. ఆ పాత్రకు మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. నటుడికి అంతకంటే కావాల్సింది ఏమున్నది. మహానుభావుడు చిత్ర రిలీజ్ తర్వాత నేను గోదావరి జిల్లాలోని నా సొంత జిల్లాకు వెళ్లాను. అక్కడ ప్రజలు నాపై చూపిస్తున్న ఆదరణకు మనసులో పొంగిపోయాను. నన్ను చూసి ప్రేమగా నవ్వుతున్నారు. అంతకంటే కమెడియన్‌కు కావాల్సింది ఏమున్నది.

   భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం

  భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం

  డాక్టర్‌గా ప్రజలకు వైద్యం, హాస్యనటుడిగా మానసిక ఉల్లాసం కలిగించే అవకాశం రావడం భగవంతుడు ఇచ్చిన వరం. నాకు స్ఫూర్తినిచ్చిన నటుల్లో హ్యాస నటుడు, మహానుభావుడు అల్లు రామలింగయ్య ప్రముఖుడు. ఆ తర్వాత హస్యబ్రహ్మ బ్రహ్మానందం, ఆలీ నాకు స్ఫూర్తి.

   నా తల్లి కళ్లలో ప్రేమనే గొప్ప ప్రశంస

  నా తల్లి కళ్లలో ప్రేమనే గొప్ప ప్రశంస

  నా నటనకు అత్యుత్తమ ప్రశంస నా తల్లి నుంచి లభించాయి. నేను నటించిన సినిమాలు చూసిన తర్వాత నా తల్లి కళ్లల్లో కనిపించే ఓ ప్రేమ, ఆనంద బాష్పాల కంటే గొప్ప ప్రశంస ఏదీ ఉండదు.

   నాది రైతు కుటుంబం

  నాది రైతు కుటుంబం

  నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. గతంలో మా నాన్న ఫిలిం డిస్ట్రిబ్యూషన్‌లో కూడా ఉన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు నాకు మామ అవుతారు. ఆయన కూతురును నేను పెళ్లి చేసుకొన్నాను.

   ప్రస్తుతం నా సినిమాలు

  ప్రస్తుతం నా సినిమాలు

  ప్రస్తుతం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న చిత్రంలో, వీవీ వినాయక్ డైరెక్షన్‌లో సాయి ధరమ్ తేజ్ సినిమాలో నటిస్తున్నాను. ఈ రెండు చిత్రాలు కూడా నిర్మాత సీ కల్యాణ్ రూపొందిస్తున్నారు. బాలకృష్ణ చిత్రంలో బ్రహ్మానందంకు అసిస్టెంట్‌గా నటిస్తున్నాను. వినాయక్ చిత్రంలో సాయిధరమ్ తేజ్‌కు స్నేహితుడిగా నటిస్తున్నాను.

  English summary
  Actor Bhadram is familiar with movies like Jyothilakshmi, Bhale Bhale Mogadivoy. Now Bhadram is doing Gulf movie, which releasing on October 13th. This movie directed by P Sunil Kumar Reddy. In this occasion, He speaks to Telugu Filmibeat exclusively.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X