»   » చూసారా...చాలా బాగుంది : పూరి జగన్నాధ్ ‘రోగ్‌' టీజర్ (వీడియో)

చూసారా...చాలా బాగుంది : పూరి జగన్నాధ్ ‘రోగ్‌' టీజర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ ఇప్పుడు మరో డిఫరెంట్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. యంగ్‌ హీరో ఇషాన్‌ను హీరోగా పరిచయం చేస్తూ జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్‌ పతాకంపై డా|| సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి నిర్మిస్తున్న 'రోగ్‌'(మరో చంటిగాడి ప్రేమకథ)తో ప్రేక్షకులకు డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వబోతున్నారు డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌.

Puri Jagannadh's Rogue's teaser released


ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌, మోషన్ పోస్టర్ కి వచ్చిన ట్రెమండస్‌ రెస్పాన్స్‌తో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగాయి. ఈ నేపధ్యంలో ఈ సినిమా టీజర్‌ను విడుద‌ల చేశారు. ఆ టీజర్ చూస్తూంటే పూరి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడని అంటున్నారు. ట్రైలర్ పై ఈ టీజర్ మరింత అంచనాలు పెంచుతోంది.

Puri Jagannadh's Rogue's teaser released

త్వ‌ర‌లోనే రోగ్ చిత్రాన్ని తెలుగు, క‌న్న‌డ‌లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు సన్నాహాలు చేస్తున్నారు. ఇషాన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మన్నారా చోప్రా, ఏంజెలా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అనూప్‌సింగ్‌, ఆజాద్‌ ఖాన్‌, పోసాని కృష్ణమురళి, అలీ, సత్యదేవ్‌, సుబ్బరాజ్‌, రాహుల్‌ సింగ్‌, తులసి, రాజేశ్వరి, సందీప్తి తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బి.రవికుమార్‌, ఆర్ట్‌: జానీ షేక్‌, ఎడిటర్‌: జునైద్‌ సిద్ధిఖీ, మ్యూజిక్‌: సునీల్‌కశ్యప్‌, సినిమాటోగ్రఫీ: ముఖేష్‌.జి, నిర్మాతలు: సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.
English summary
Puri Jagganadh launched the first look posters and teaser of his new film 'Rogue'. Puri Jagannadh is gearing up for a strong comeback with his upcoming movie, Rogue starring Ishaan in the lead role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu