»   » పూరి ‘రోగ్‌’ట్రైలర్ ఇదిగో, సౌతిండియాకు శ్రీదేవి పరిచయం చేసినట్లే అంటూ పూరి

పూరి ‘రోగ్‌’ట్రైలర్ ఇదిగో, సౌతిండియాకు శ్రీదేవి పరిచయం చేసినట్లే అంటూ పూరి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో నూతన నటుడు ఇషాన్‌ హీరోగా పరిచయమౌతున్న చిత్రం 'రోగ్‌'. మరో చంటిగాడి ప్రేమ కథ అనేది ఉపశీర్షిక. రోగ్ చిత్రాన్ని తెలుగు, క‌న్న‌డ‌లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు సన్నాహాలు చేస్తున్నారు. కన్నడంలోనూ తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మన్నారా చోప్రా, ఏంజెలా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు

ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌, మోషన్ పోస్టర్, ట్రైలర్ కి వచ్చిన ట్రెమండస్‌ రెస్పాన్స్‌తో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగాయి. ఈ నేపధ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ను విడుద‌ల చేశారు. ఆ టీజర్ చూస్తూంటే పూరి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడని అంటున్నారు. ట్రైలర్ పై ఈ ట్రైలర్ మరింత అంచనాలు పెంచుతోంది. ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

ట్రైలర్ రిలీజ్ ఘనంగా

ట్రైలర్ రిలీజ్ ఘనంగా

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఇషాన్‌ హీరోగా జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్‌ పతాకంపై డా|| సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి నిర్మిస్తున్న లవ్‌ ఎంటర్‌టైనర్‌ 'రోగ్‌'(మరో చంటిగాడి ప్రేమకథ). ఈ సినిమా ట్రైలర్ విడుద‌ల కార్య‌క్ర‌మం బుధ‌వారం హైద‌రాబాద్‌లోని నోవాటెల్ హోట‌ల్లో జ‌రిగింది.
2

హీరో తెలుగోడే

హీరో తెలుగోడే

అలీ మాట్లాడుతూ - ``ఇషాన్ వంటి కొత్త హీరోతో ఎలాంటి డిఫ‌రెంట్ సినిమా చేస్తే బావుటుందో అలాంటి సినిమా `రోగ్‌`. సునీల్ క‌శ్య‌ప్ బెస్ట్ మ్యూజిక్ అందించాడు. హీరో తెలుగు వ్య‌క్తి. ఆ సినిమా త‌ప్ప‌కుండా అంద‌రికీ నచ్చేలా ఉంటుంది`` అన్నారు.

సొంత బిడ్డలా కేర్ తీసుకున్నారు

సొంత బిడ్డలా కేర్ తీసుకున్నారు

నిర్మాత సి.ఆర్‌.మ‌నోహ‌ర్ మాట్లాడుతూ - ``ముందు ఇషాన్ ఫోటోను నేను పూరిగారికి చూపించాను. ఆయ‌న ఫోటో చూడ‌గానే, కుర్రాడు బావున్నాడ‌ని అన్నారు. అదే రోజు సాయంత్రం మ‌నం సినిమా చేస్తున్నాం..క‌థ విన‌డానికి ర‌మ్మ‌ని పిలిచారు. ఎంతో మంది స్టార్ హీరోల‌ను ఇంట్ర‌డ్యూస్ చేసిన పెద్ద డైరెక్ట‌ర్ ఇషాన్‌తో సినిమా చేస్తాన‌ని అన‌గానే ఎంతో ఎగ్జ‌యిటింగ్‌గా ఫీల‌య్యాను. ఇషాన్ చాలా చ‌క్క‌గా యాక్ట్ చేశాడు. ఇషాన్‌తో హిందీలో కూడా సినిమా చేస్తాన‌ని పూరిగారు అన్నారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌గారు కూడా మొన్న మా ఇంటికి వ‌చ్చిన‌ప్పుడు ఇషాన్‌ను చూసి ఆశీర్వ‌దించారు. త‌ప్ప‌కుండా త‌ను పెద్ద స్టార్ అవుతాడ‌ని దీవించారు. పూరిగారు ఇషాన్‌ను సొంత బిడ్డ‌లా, చాలా కేర్ తీసుకున్నారు. నా క‌ల నిజ‌మైంది`` అన్నారు.

పెద్ద స్టార్ అవుతాడు

పెద్ద స్టార్ అవుతాడు

ఎంజెలా మాట్లాడుతూ - ``పూరిగారి వంటి స్టార్ డైరెక్ట‌ర్‌తో ప‌నిచేయ‌డం క‌ల నిజ‌మైన‌ట్లు అనిపించింది. ఇషాన్ వంటి కోస్టార్‌తో వ‌ర్క్ చేయ‌డం ఆనందంగా ఉంది. ఇషాన్ డెఫ‌నెట్‌గా పెద్ద స్టార్ అవుతాడు`` అన్నారు.

మంచి పేరు తెస్తుంది

మంచి పేరు తెస్తుంది

మ‌న్నారా చోప్రా మాట్లాడుతూ - ``రోగ్ సినిమా చేయ‌డంతో ఎగ్జ‌యిటింగ్‌గా ఫీల‌వుతున్నాను. నేను ఈ సినిమాలో యాక్ట్ చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. ఇషాన్‌తో స‌హా అంద‌రికీ మంచి పేరు తెచ్చే చిత్ర‌మ‌వుతుందని భావిస్తున్నాను`` అన్నారు.

ప్యూచర్ బెస్ట్ హీరో

ప్యూచర్ బెస్ట్ హీరో

పూరి జ‌గ‌న్నాథ్ మాట్లాడుతూ - ``నేను చాలా రోజుల త‌ర్వాత చేసిన ప్రేమ‌క‌థ‌. నేను సినిమా కంటే ముందుగా ఇషాన్‌ను బాగా ప్రేమించాను. ఇషాన్‌లో హీరో ల‌క్ష‌ణాలు బాగా ఉన్నాయి. సిక్స్‌ప్యాక్‌, మంచి హైట్‌, క‌ల‌ర్ ఉన్నాయి. హీరోను హీరో చేసిన మ‌నోహ‌ర్ కూడా నాకు హీరోయే. ఇషాన్ ఫ్యూచ‌ర్ బెస్ట్ హీరో అవుతాడు. సౌతిండియాకు శ్రీదేవిని ప‌రిచ‌యం చేసిన రాఘ‌వేంద్రరావుగారు ఎంత హ్యాపీగా ఫీలవుతున్నారో, ఈరోజు నేను అంత హ్యాపీగా ఫీల‌వుతున్నాను. హండ్రెడ్ ప‌ర్సెంట్ డెఫ‌నెట్‌గా ఇషాన్ సౌతిండియా సూప‌ర్‌స్టార్ అవుతాడు. అలీ కూడా ఈ సినిమాలో చ‌క్క‌టి క్యారెక్ట‌ర్ చేశాడు`` అన్నారు.

ఇన్ పుట్ ఇచ్చారు

ఇన్ పుట్ ఇచ్చారు

ఇషాన్ మాట్లాడుతూ - `` మా పెద్ద‌నాన్న‌గారు న‌న్నెంతో ప్రేమ‌గా చూసుకుంటారు. ఆయ‌న‌కు నేనెప్పుడూ రుణ‌ప‌డి ఉంటాను. స‌త్యానంద్‌గారి ద‌గ్గ‌ర యాక్టింగ్ నేర్చుకుని ఇండ‌స్ట్రీకి రాకుండా ఉండుంటే పూరిగారి వంటి మంచి వ్య‌క్తిని కోల్పోయేవాడిని. పూరిగారు నాతో అద్భుతంగా న‌టింప చేశారు. అలీగారు కూడా కొన్ని ఇన్‌పుట్స్ ఇచ్చారు. హీరోయిన్స్ కూడా చ‌క్క‌గా న‌టించారు. డెఫ‌నెట్‌గా మా అంద‌రికీ రోగ్ మంచి పేరు తెస్తుంద‌ని ఆశిస్తున్నాను`` అన్నారు.

తెర వెనక, ముందు

తెర వెనక, ముందు

ఇషాన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అనూప్‌సింగ్‌, ఆజాద్‌ ఖాన్‌, పోసాని కృష్ణమురళి, అలీ, సత్యదేవ్‌, సుబ్బరాజ్‌, రాహుల్‌ సింగ్‌, తులసి, రాజేశ్వరి, సందీప్తి తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బి.రవికుమార్‌, ఆర్ట్‌: జానీ షేక్‌, ఎడిటర్‌: జునైద్‌ సిద్ధిఖీ, మ్యూజిక్‌: సునీల్‌కశ్యప్‌, సినిమాటోగ్రఫీ: ముఖేష్‌.జి, నిర్మాతలు: సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

English summary
Puri Jagganadh launched the trailer of his new film 'Rogue'. Puri Jagannadh is gearing up for a strong comeback with his upcoming movie, Rogue starring Ishaan in the lead role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu