twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆకాశ్ టార్చర్ పెట్టాడు.. మహేష్ కోసం కథ.. రాజమౌళి కాళ్లకు దండం.. పూరీ జగన్నాథ్

    By Rajababu
    |

    Recommended Video

    Mehabooba Director Puri Jagannadh Speech

    బద్రి, పోకిరి, చిరుత, బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై, బిజినెస్ మెన్ లాంటి చిత్రాలతో సెన్సేషనల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకొన్న పూరీ జగన్నాథ్‌కు ఈ మధ్యకాలంలో సరైన హిట్టు కరువైంది. ఆ నేపథ్యంలో పూరీ రూపొందించిన చిత్రం మెహబూబా. తన కుమారుడు ఆకాశ్‌ను హీరోగా చేసి ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కించారు. ఈ చిత్రానికి నటి చార్మీ ఓ నిర్మాతగా వ్యవహరించింది. ఈ చిత్రం మే 11న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆకాశ్‌పై పూరీ పంచులు విసిరాడు. ఆయన ఏమన్నారంటే..

     హీరో ఆకాశ్ గురించి

    హీరో ఆకాశ్ గురించి

    నా కెరీర్‌లో ఇప్పటి వరకు 35 సినిమాలు చేశాను. కానీ ఫస్ట్‌టైం ఓ నిజాయితీతో కూడిన సినిమా తీశాననిపిస్తున్నది. ఈ సినిమా హీరో ఆకాష్ గురించి చెప్పాలి. చిన్నప్పటి నుంచి అతడు మా ఇంట్లోనే ఉండేవాడు. 5 ఏళ్ల వయసులో ఆకాష్ నేను ఉదయం లేవగానే నా ముందు ఉండేవాడు. చిరంజీవి, బాలకృష్ణ డైలాగ్స్ చెప్పి వేషం ఇవ్వమన వేధించాడు.

    ఆకాశ్ టార్చర్ తట్టుకోలేక

    ఆకాశ్ టార్చర్ తట్టుకోలేక

    ఆకాశ్ టార్చర్ తట్టుకోలేక చిరుత సినిమాలో వేషం ఇచ్చాను. ఆ తర్వాత పోకిరి సమయంలో నా వద్దకు వచ్చి మహేష్‌బాబు కోసం కథ రాశాను అని చెప్పాడు. దాంతో వీడి దగ్గర ఏం కథ ఉందో అని విన్నాను.

    ఆకాశ్ చెప్పిన కథ ఇదే..

    ఆకాశ్ చెప్పిన కథ ఇదే..

    మహేష్‌బాబుకు ఓ పదేళ్ల ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్ వీడే. వీడిని చూడకుండా మహేష్‌బాబు ఉండలేదు. కానీ విలన్లు ఓ దశలో మహేష్‌ను చంపేస్తారు. ఆ తర్వాత ఆ విలన్లను పదేళ్ల కుర్రాడు చంపి పగతీర్చుకుంటాడు అని ఆకాశ్ నాకు కథ చెప్పాడు. అనంతరం మహేష్‌కు చెప్పమని అడిగాడు.

    మహేష్‌బాబు తన్నడం ఖాయమని..

    మహేష్‌బాబు తన్నడం ఖాయమని..

    అప్పుడే నేను ఆకాశ్‌తో నేను ఏమన్నాన్నంటే.. నీవు చెప్పిన కథ మహేష్‌కు చెబితే నిన్ను, నన్ను తన్నేస్తాడు అని అన్నాను. ఆ కథలో వీడు హీరో వేషం వేసి మహేష్‌కు వేషం ఇచ్చాడు అని ఆకాశ్ సెటైర్ వేశాడు.

    నా దగ్గర డబ్బులుంటే హీరో చేస్తా

    నా దగ్గర డబ్బులుంటే హీరో చేస్తా

    అప్పడు నేను ఆకాశ్‌కు మాట చెప్పాను. నీవు హీరో కావాలంటే కనీసం పదేళ్లు పడుతుంది. అప్పటికీ నా కెపాసిటీ ఉంటే, నా పరిస్థితి బాగుంటే.. నా దగ్గర డబ్బులు ఉంటే నీతో సినిమా చేస్తాను. అప్పటి వరకు నీ ప్రయత్నాలు ఏవో నీవు చూసుకో అని చెప్పాను.

     రాజమౌళి కాళ్లకు మొక్కేవాడు

    రాజమౌళి కాళ్లకు మొక్కేవాడు

    అప్పటి నుంచి రాజమౌళి, వినాయక్, సుకుమార్ దృష్టిలో పడేందుకు ట్రై చేసేవాడు. వాళ్లు మా ఇంటికి వస్తే కాళ్లకు దండం పెట్టుకొనే వాడు. కానీ ఇప్పుడు నా పరిస్థితి బాగుంది. అందుకే మెహబాబా సినిమా ఆకాశ్‌తో తీశాను అని పూరి జగన్నాథ్ అన్నారు.

    English summary
    Tollywood's popular director Puri Jagannadh launching his son Akash Puri with Mehabooba movie. This movie is set to release on May 11. This made under banner of Puri Connect. In this occassion, Movie Unit organised a press meet in Hyderabad. In this event Puri revealed interesting facts about Hero Akash.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X