»   » మా జీవితాలు నాశనం చేస్తున్నారు : విచారణ తర్వాత పూరీ చెప్పిన సంగతులివే (వీడియో)

మా జీవితాలు నాశనం చేస్తున్నారు : విచారణ తర్వాత పూరీ చెప్పిన సంగతులివే (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

గత మూడు రోజులుగా టాలీవుడ్ పత్రికల్లో పతాక శీర్శికల్లో ఉంది. సినిమా పేజీలని దాటి పేజ్ 3 జీవితాల చీకటి కోణాలు మెయిన్ హెడ్డింగులకెక్కాయి. ఒకరిని మించి ఒకళ్ళు కొత్త కొత్త వార్తాకథనాలను వండి వార్చారు. టీవీ టీఆర్పీల్లో కూడా బిగ్ బాస్ కంటే డ్రగ్ బాస్ మీదే ఎక్కువ ఉత్కంఠ. సిట్ విచారణ అనంతరం తన ట్విట్టర్ వాల్ మీద ఆయన భాదని వెల్ల బోసుకున్నాడు పూరీ జగన్నాధ్.

పూరీ జగన్నాథ్

పూరీ జగన్నాథ్

నిన్న టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ని విచారించింది "సిట్" ఆ విచారణ జరుగుతున్నంతసేపూ కూడా ఒక్కో చానెల్ ఒక్కో ఊహా జనిత ప్రోగ్రాం ని తయారు చేసిందంటూ విమర్శలూ వచ్చాయ్.... కానీ ఎక్కువమంది అవే కార్యక్రమాలు చూసారన్నది నిజం...

విచారణ ముగియకుండానే

విచారణ ముగియకుండానే

అయితే అసలు విచారణ కూడా ముగియకుండానే ఆరోపణల ఆధారంగా నిందితుడు కూడా కాదు ఏకంగా దోషి అన్నత రేంజ్ లో తనని దుయ్య బట్టిన వార్తా చానెళ్ళమీద చిరాకు పడ్డాడు పూరీ...రెండు రోజుల క్రితం పూరీ కూతురు "పవిత్ర" కూడా ఇదే విషయం మీద మీడియా పై ఫైర్ అయిన సంగతి తెలిసిందే ఇంతకీ పూరీ ఏం చెప్పాడో ఈ వీడియో లో చూడండి...

తన ఆవేదన

తన ఆవేదన

పూరీ నిన్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆఫీసు కి వెళ్ళి విచారణకు హాజరు అయిన తరువాత.. తన పై ఇంత ఏకపక్షంగా ప్రవర్తించిన మీడియా పై తన ఆవేదనను సోషల్ మీడియా ద్వారా చెప్పుకున్నాడు. "నేను ఈ రోజే SIT ఆఫీసు కి విచారణ కోసం వెళ్ళాను. వాళ్ళు అడిగిన అన్నీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను. కెల్విన్ తో సంబందాలు లేవని.. నేను డ్రగ్స్ తీసుకోనని చెప్పాను.

సిద్దంగా ఉన్నాను

సిద్దంగా ఉన్నాను

ఇక ముందు కూడ వాళ్ళు పిలిచినప్పుడు నేను వెళ్లడానికి సిద్దంగా ఉన్నాను. నేను చాలా రెస్పాన్సిబుల్ పర్సన్. పోలీస్ డిపార్ట్ మెంట్ అంటే చాలా ఇష్టం.. పోలీసులు మీద ఇప్పుడు రెస్పెక్ట్ ఇంకా పెరిగింది. నేను మీడియా మీద కూడా ప్రేమతో ఇజం అనే సినిమా తీశాను..

చాలా డిస్ర్టబ్ చేశారు.

చాలా డిస్ర్టబ్ చేశారు.

కాకపోతే ఇక్కడ నాకు భాద కలిగే విషయం ఏంటంటే నా మీడియా మిత్రులు నా పై లేనిపోని కట్టుకథలు చూపించి నానా రబస చేశారు. నాతో ఎంతో ఫ్రెండ్లీ ఉన్న ఈ మీడియావాళ్ళు కట్టుకథలు అల్లేసి ఏవేవో ప్రోగ్రామ్ లు వేసేసి.. జీవితాలు నాశనం చేశారండీ. చాలా డిస్ర్టబ్ చేశారు.

సరైన పని కాదు

సరైన పని కాదు

నాకు మీడియా అన్నా, పోలీస్ డిపార్ట్ మెంట్ అన్నా అమితమైన గౌరవం ఉంది నేను వాళ్ళ పై చాల సినిమాలు తీశాను. ఇప్పుడు ఏదో నేను ఈ కేస్ లో ఉన్నాను అని ఇలా చేయడం సరైన పని కాదు, మళ్ళీ నేను ఆ మీడియా మిత్రులు తో కలిసి పని చేయవలిసి ఉంది.

ఇలా చేయడం భావ్యం కాదు

వాళ్ళు చేసిన ఈ పని వలన ఆల్రెడీ నాలుగు రోజుల నుండి నిద్ర లేకుండా తిండి తినకుండా ఏడుస్తూ కూర్చున్న మా అమ్మ భార్య నా పిల్లలు ఇంకా బాధపడుతున్నారు. నాలాంటి కుటుంభాలే ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. ఏదన్నా ఉంటే రేపు సిట్ ఆఫీసర్స్ డిసైడ్ చేస్తారు. మీడియా ఇలా చేయడం భావ్యం కాదు" అని అభిప్రాయపడ్డ జగన్, ఈ కేసు విషయం లో తాను నిర్దోషిగా బయటకు వస్తాను అన్న నమ్మకం తోనే కనిపించాడు

English summary
Tollywood Director Puri jagannadh shared a video in His Twitter wall after SIT interrogation yesterday
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu