»   » అభిమానిని బాలయ్య కొట్టడంపై .... పూరి సంచలన కామెంట్!

అభిమానిని బాలయ్య కొట్టడంపై .... పూరి సంచలన కామెంట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలయ్య హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పైసా వసూల్' మూవీ ఆడియో రిలీజ్ వేడుక ఖమ్మంలో గురువారం గ్రాండ్ గా జరిగింది. హైదరాబాద్ నుండి చిత్ర యూనిట్ హెలికాప్టర్లో ఖమ్మం వెళ్లారు.

ఆడియో వేడుక మొదలవ్వగానే వర్షం మొదలైంది. అయితే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అభిమానులు వేల సంఖ్యలో బాలయ్యను చూసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాథ్ స్పీచ్ ఆకట్టుకుంది. సినిమాకు సంబంధించిన అంశాలతో పాటు బాలయ్య ఓ అభిమానిని కొట్టడంపై కూడా ఆయన స్పందించారు.

మీ కాళ్లు దండం పెట్టుకోవాలని ఉంది

మీ కాళ్లు దండం పెట్టుకోవాలని ఉంది

బాలయ్య బాబుపై అభిమానంతో వచ్చారు. వర్షాన్ని సైతం లెక్క చేయలేదు. బాలయ్య బాబు ఎంత మొండోడో మీరూ అంతే మొండి నిరూపించారు. మీ అందరూ కాళ్లు ముందుకు పెడితే దండం పెట్టుకోవాలని ఉంది... అంటూ బాలయ్య అభిమానులను ఉద్దేశించి దర్శకుడు పూరి జగన్నాథ్ వ్యాఖ్యానించారు.

Nandyal By Polls : Balakrishna Money Distributing To Voters Viral In Social Media | Oneindia Telugu
బాలయ్య తీరే అంత

బాలయ్య తీరే అంత

బాలయ్య బాబుతో వర్క్ చేసిన తర్వాత ఇంత లేటు ఎందుకయిందని బాధ పడ్డాను. అంత మంచి మనిషి బాలకృష్ణ గారు. ఆయన వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, ప్రేమ వచ్చినా మొహం మీదే, కోపం వచ్చినా మొహం మీదే చెప్పేస్తారు అని పూరి వ్యాఖ్యానించారు.

సూపర్ ఎనర్జీ

సూపర్ ఎనర్జీ

బాలయ్య నాకు 101వ సినిమా అని చెప్పారు. ఆయన స్పీడు, దూకుడుకు చూస్తుంటే నాకు ఒకటో సినిమాలాగా అనిపించింది. ఆయనకు ఫైటర్లు కనిపిస్తే మీద పడిపోతారు, కారు ఇస్తే 360 డిగ్రీ రౌండ్ కొట్టేస్తారు, హీరోయిన్లను అమాంతం ఎత్తుకుని పరుగెడతారు. ఎన్నోసార్లు చెప్పాలనిపించింది మీ వయసు మోక్షజ్ఞ వయసు కాదు, కొంచెం ఎక్కువే అని. ఆయనతో పని చేయడం అమేజింగ్ అంటూ...బాలయ్యను పొగడ్తలతో ముంచెత్తారు పూరి.

ఆయన ధ్యాస ఎప్పుడూ అదే

ఆయన ధ్యాస ఎప్పుడూ అదే

ఆయన నాతో ఎప్పుడు మాట్లాడినా రెండు విషయాలే మాట్లాడతారు. ఒకటి నాన్నగారు, రెండోది సినిమా. ఈ రెండు తప్ప ఏమీ మాట్లాడరు. తల్లి దండ్రులంటే ఇంత గౌరవం ఉన్న కొడుకును ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు. అలాగే ఫోన్లో ఎప్పుడైనా మాట్లాడితే ఒకటి హిందూపూర్, రెండు కేన్సర్ హాస్పటల్ ఈ రెండిటి గురించే మాట్లాడతారు అని పూరి చెప్పుకొచ్చారు.

బాలయ్యకు బౌన్సర్లు అక్కర్లేదు

బాలయ్యకు బౌన్సర్లు అక్కర్లేదు

వేరే హీరోలు బయటకు వెళితే బౌన్సర్లు కావాలేమో? బాలయ్యకు అక్కర్లేదు. ఆయన ఫ్యాన్స్‌ను ఆయనే కంట్రోల్ చేసుకోగలరు. ఒక్కొక్కళ్లు మీద పడుతుంటే ఆయన కొడుతుంటారు. ఆలా కొట్టడం వాళ్లకు కూడా ఎంతో ఇష్టం. హ్యాపీగా ఫీలవుతుంటారు..... అని బాలయ్య అభిమానిపై చేసిన ఘటనను ఉద్దేశించి పూరి వ్యాఖ్యానించారు.

ఏదైనా తేడా వస్తేనే అలా

ఏదైనా తేడా వస్తేనే అలా

ఇవాళ మీడియాలో బాలయ్య బాబు ఎవరినో కొట్టాడని అంటున్నారు. అసలు మీడియా వారికి ఏం తెలుసు బాలయ్య కొట్టడాన్ని వాళ్లు ఎంత ఎంజాయ్ చేస్తారో? ఆయన ఎప్పుడైనా కొడితే కామన్ సెన్స్ అనే ఏరియా తేడా వస్తేనే కొడతారు. బాలయ్య బాబు ఎవరినైనా కొడితే గుర్తు పెట్టుకోండి అదో లవ్ స్టోరీ. డోంట్ టేక్ సీరియస్. పైసా వసూల్ సినిమాకు పని చేయడం ఆనందంగా ఉంది....అని పూరి జగన్నాధ్ చెప్పుకొచ్చారు.

కోకా కోలా పెప్సీ..... బాలయ్య బాబు సెక్సీ

కోకా కోలా పెప్సీ..... బాలయ్య బాబు సెక్సీ

ఆయన ఎప్పుడు పిలిస్తే వెంటనే ఎగురు కుంటూ వెళ్లాలని ఉంటుంది. షూటింగ్ అయిపోయినప్పటి నుండి ఆయన లేక అందరికీ బోర్ కొడుతోందని పూరి వ్యాఖ్యానించారు. చివర్లో ‘కోకా కోలా పెప్సీ..... బాలయ్య బాబు సెక్సీ' అనే నినాదంతో పూరి తన ప్రసంగాన్ని ముగించారు.

English summary
Puri Jagannadh Speech at Paisa Vasool Audio Launch. Starring Nandamuri Balakrishna & Shreya Saran, Movie Directed By Puri Jagannadh & Music Composed By Anup Rubens And Produced By V. Ananda Prasad Under The Banner Bhavya Creations.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu