»   » బాలయ్య లవ్ స్టోరీ వ్యాఖ్యలు: పూరీకి వెక్కిరింతల మీద వెక్కిరింతలు

బాలయ్య లవ్ స్టోరీ వ్యాఖ్యలు: పూరీకి వెక్కిరింతల మీద వెక్కిరింతలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ అభిమానిపై చేయి చేసుకోవడాన్ని సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను నెటిజన్లు వెక్కిరిస్తున్నారు. అభిమానులను బాలయ్య కొట్టడాన్ని సమర్థిస్తూ, దాన్ని ప్రశంసిస్తూ పూరీ వ్యాఖ్యలు చేశారు.

Paisa Vasool Music Launch Photos

తాను దర్శకత్వం వహించిన పైసా వసూల్ ఆడియో విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అభిమానులను బాలయ్య కొట్టడాన్ని లవ్ స్టోరీగా అభివర్ణించారు. ఆ కార్యక్రమం ఇటీవల ఖమ్మంలో జరిగిన విషయం తెలిసిందే.

నంద్యాలలో అభిమాని చెంప చెళ్లు..(వీడియో)

అప్పటి నుంచి ఆయనపై, బాలయ్యపై సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు విసురుతూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. వారిద్దరిదీ లవ్ స్టోరీ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

వాళ్లకు బౌన్సర్లు కావాలి.

వాళ్లకు బౌన్సర్లు కావాలి.

ఇతర హీరోలు బయటకు వెళ్లినప్పుడు వారందరికీ బౌన్సర్లు కావాలని, కానీ బాలయ్యగారికి బౌన్సర్ల అవసరం లేదని పూరీ జగన్నాథ్ అన్నారు. అభిమానులను ఆయన స్వయంగా కంట్రోల్ చేయగలరని అన్నారు. వారు తన మీద పడితే బాలయ్య కొట్టేస్తారని చెప్పారు.

Balakrishna Slapping his fan in election campaign at Nandyala : Video
వారు ప్రేమిస్తారు....

వారు ప్రేమిస్తారు....

బాలయ్య కొట్టడాన్ని అభిమానులు ఇష్టపడుతారని, దాన్ని ప్రేమిస్తారని పూరీ జగన్నాథ్ చెప్పారు. ఆనందిస్తారని కూడా అన్నారు. తమను బాలయ్య కొడితే అభిమానులు ఎంతగా ఆనందిస్తారనే విషయం మీడియాకు తెలియదని ఆయన అన్నారు.

ఆ సంబంధం ఉంది...

ఆ సంబంధం ఉంది...

కామన్స్ సెన్స్ లేకుండా ప్రవర్తించినప్పుడు బాలయ్య చేయి చేసుకుంటారని, బాలయ్యకూ ఆయన అభిమానులకూ మధ్య ఉన్న ఆ అనుబంధాన్ని గుర్తుంచుకోవాలని పూరీ జగన్నాథ్ అన్నారు. బాలయ్య ఫ్యాన్‌ను కొడితే అదో లవ్ స్టోరీ అని ఆయన అన్నారు. దాన్ని సీరియస్‌గా తీసుకోవద్దని ఆయన అన్నారు.

అప్పటి నుంచి...

అప్పటి నుంచి...

పూరీ జగన్నాథ్ ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు విసురుతూ వస్తున్నారు. భౌతికమైన దాడి ప్రేమగా ఎలా మారుతుందని వారు అడుగుతుననారు. తన్నించుకుంటే మహాప్రసాందం. కొట్టించుకుంటే ఆశీర్వాదం. ఏకంగా చంపేస్తే కుంభాభిషేకం. ఇది కొత్త దేవుళ్ల వ్యవహారం అని వ్యాఖ్యానిస్తున్నారు..

 పూరీ ఎందుకు...

పూరీ ఎందుకు...

బాలయ్య అభిమానులపై చేయి చేసుకోవడంపై పూరీ జగన్నాథ్ వ్యాఖ్యలు ఏ సందర్భంలో చేశారనేది ఆసక్తికరమైన విషయం. నంద్యాల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాలయ్య ఓ అభిమానిపై చేయి చేసుకోవడం మీద తీవ్ర దుమారం చెలరేగింది. ఆ తర్వాత పైసా వసూల్ ఆడియో లాంచ్ కార్యక్రమం జరిగింది. దాంతో పూరీ బాలయ్యపై చెలరేగిన దుమారాన్ని దృష్టి ఉంచుకుని ఆ వ్యాఖ్యలు చేశారు.

English summary
Actor Balakrishna’s friend and director of his upcoming film Paisa Vasool, Puri Jagannadh, seems to think that the former’s habit of bashing up fans is a good thing!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu