twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ మాట పూరి విన్లేదు.. అందుకే ఇంత పెద్ద డైరెక్టరయ్యాడు!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అవను నిజమే... ఆ రోజు పూరి జగన్నాధ్ పవన్ కళ్యాణ్ మాట విని ఉంటే అతనికి 'బద్రి' సినిమా అవకాశమే వచ్చేది కాదు. ఆ సినిమా వచ్చి పెద్ద హిట్టయింది కాబట్టే పూరి అనతి కాలంలోనే ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యాడు.... ఆ సినిమా లేకుంటే పరిస్థితి ఎలా ఉండేదో?... ఈ పాయింటకు సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

    అప్పటి సంగతులు ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఏముందంటే... ఈ రోజు పూరి జగన్నాథ్ పుట్టినరోజు. సెప్టెంబర్ 28, 1966లో జన్మించిన ఆయన నేటితో 50 వసంతాలు పూర్తి చేసుకుని 51వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని విషయలు గుర్తు చేసుకుందాం.

    పూరి ప్రత్యేకత

    పూరి ప్రత్యేకత

    సాధారంగా ఏ దర్శకుడైనా తన సినిమాల్లో హీరోను బుద్దిమంతుడిగా, గొప్పవాడిగా చూపిస్తాడు. కానీ పూరి మాత్రం అందుకు పూర్తి భిన్నం. తన సినిమా హీరోను పోకిరి, ఇడియట్, లోపర్, దేశముదురులా చూపిస్తాడు. సాధారణంగా అయితే ఇవి వాడుక బాషలో తిట్లలాంటివి. కానీ పూరి అవే టైటిల్స్ సినిమా పేర్లుగా పెట్టి వాటి అర్థమే మార్చేసాడు.

    చిన్నప్పటి నుండే సినిమా పిచ్చి

    చిన్నప్పటి నుండే సినిమా పిచ్చి

    నర్సీపట్నం సమీపంలోని బాపిరాజు కొత్తపల్లి పూరి జగన్నాథ్ స్వస్థలం. వ్యవసాయం కుటుంబం. వాళ్ల ఇంట్లో పుస్తకాలు చదివే అలవాటు ఎవరికుందో తెలియదుకానీ బోలెడు పుస్తకాలుండేవట. ఆ పుస్తకాలన్నీ చదివేసేవాడట. అలా తక్కువ వయసులోనే ఎక్కువ జ్ఞానం పొందాడు. తండ్రి టూరింగ్‌ టాకీస్‌ కూడా నడుపుతుండటంతో సినిమాలు చూసి చూసి చిన్న వయసులోనే సినిమా పిచ్చిపట్టుకుంది మనోడికి.

    ఆడుకోవాల్సిన వయసులో రచనలు

    ఆడుకోవాల్సిన వయసులో రచనలు

    సాధారణంగా ఆరో తరగతి ఏజ్ అంటే ఆటలాడుకునే వయసు. కానీ పూరి ఆ వయసులోనే చిన్న చిన్న కథలు రాసేవాడట. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పూరి జగన్నాథ్ స్వయంగా వెల్లడించారు.

    ఇంట్లో ప్రోత్సాహం

    ఇంట్లో ప్రోత్సాహం

    సినిమా రంగంలోకి రావాలని పూరి చిన్నతనం నుండి అనుకునే వారు. ఓసారి నాటకం రాసి వాళ్ల వూళ్లొ డైరెక్ట్‌ చేసి చూపించాడట. పూరి లోని టాలెంట్ గమనించిన తల్లిదండ్రులు రూ.20వేలు ఇచ్చి మరీ హైదరాబాద్ పంపారట. హైదరాబాద్ వచ్చి మధు ఇనిస్టిట్యూట్‌లో దర్శకత్వం శిక్షణ తీసుకున్నారు.

    కృష్ణ వంశీ, వర్మతో పరిచయం

    కృష్ణ వంశీ, వర్మతో పరిచయం

    వర్మకు హైదరాబాద్ వచ్చిన సమయంలో శివ మూవీ బాగా నచ్చింది. ఆ సినిమాకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. వర్మ వద్ద అసిస్టెంటుగా చేసిన కృష్ణవంశీతో స్నేహం పూరికి ప్లస్సయింది. తర్వాత కృష్ణవంశీ తనని వర్మ కంపెనీలో చేర్చడమే కాకుండా, ఆయన డైరెక్టర్‌ అయ్యాక కూడా అసిస్టెంట్‌గా పనిచేసే అవకాశం ఇచ్చారని గతంలో ఓ ఇంటర్వ్యూలో పూరి చెప్పుకొచ్చారు.

    పవన్ కళ్యాణ్ తో తొలి సినిమా

    పవన్ కళ్యాణ్ తో తొలి సినిమా

    పూరి తన తొలి సినిమా పవన్ కళ్యాణ్ తో చేసే అవకాశం దక్కించుకున్నాడు. అసలు పవన్ కళ్యాణ్ కి కథ వినిపించే అవకాశం దక్కించుకోవడం కోసం వర్మ ఏం చేసాడో తెలిస్తే ఆశ్చర్య పోక తప్పదు. ఛోటా కె.నాయుడు సోదరుడు శ్యామ్‌ కె.నాయుడు పూరికి మంచి ఫ్రెండ్. శ్యామ్ ద్వారా ఛోటాను కలిసి పవన్‌తో సినిమా చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారట.

    చోటాను బోల్తా కొట్టింది

    చోటాను బోల్తా కొట్టింది

    పవన్‌తో తనకు మంచి పరిచయం ఉందని, తన సిఫారసుతో వెళ్లి సరైన కథ చెప్పకపోతే పరువుపోతుందని, ముందు కథ తనకు చెప్పమని అడిగాడట చోటా. నచ్చితే పవన్‌తో మాట్లాడతానని చెప్పాడట. అయితే పూరి అతనికి పవన్ తో చేయాలనుకున్న ‘బద్రి' కథ చెప్పకుండా....ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథ చెప్పాడు, చోటాకు ఆ కథ నచ్చడంతో పవన్ తో మీటింగ్ ఏర్పాటు చేయించాడు. మొత్తానికి ఈ విషయంలో పూరి చోటాను బోల్తాకొట్టించాడని చెప్పక తప్పదు.

    పవన్ అరగంట అంటే 4 గంటలు చేసాడు

    పవన్ అరగంట అంటే 4 గంటలు చేసాడు

    పవన్ కథ వినడానికి అరగంట సమయం మాత్రమే ఇచ్చాడు.... కానీ స్టోరీ చెప్పడంలో తన టాలెంట్ ప్రదర్శించిన పూరి పవన్ కళ్యాణ్ ను 4 గంటలు తన కథ వినేలా కూర్చో పెట్టాడు. అలా పవన్ ను ఒప్పించాడు.

    ఆ విషయంలో పవన్ మాట వినలేదు

    ఆ విషయంలో పవన్ మాట వినలేదు

    పవన్ కళ్యాణ్ క్లైమాక్స్ మార్చమని అడిగారు. కానీ నేను మార్చలేదు. మళ్లీ ఆయన్ను కలిసి నాకు అదే నచ్చింది అని తేల్చి చెప్పాను. దీంతో ‘నువ్వు క్లైమాక్స్‌ మారిస్తే నీకు అవకాశం ఇచ్చేవాడిని కాదు' అంటూ షాక్‌ ఇచ్చారు. వెంటనే పవన్ సినిమా మొదలు పెడదామన్నారు.... అలా బద్రి సినిమా మొదలయింది అని పూరి ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ సినిమా తర్వాత పూరి దశ తిరిగింది. పెద్ద డైరెక్టర్ అయ్యాడు.

    పూరి ఇపుడు చేస్తున్న మూవీ

    పూరి ఇపుడు చేస్తున్న మూవీ

    ప్రస్తుతం పూరి కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా ‘ఇజం' తీస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్లో విడుదలయే అవకాశం ఉంది.

    English summary
    Tollywood director Puri Jagannadh turns 50 today. Puri Jagannath (born 28 September 1966) is an Indian film director, screenwriter and producer, who works primarily in the Telugu cinema.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X