»   »  అమలా పాల్‌‌తో కలిసి పూరి నర్సీపట్నం షో...

అమలా పాల్‌‌తో కలిసి పూరి నర్సీపట్నం షో...

Posted By:
Subscribe to Filmibeat Telugu
నర్సీపట్నం : అల్లు అర్జున్, అమలా పాల్, కేథరిన్ హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం ఈరోజు గ్రాండ్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాథ్ తన స్వస్థలం అయిన నర్సీపట్నంలో అభిమానుల మధ్య కూర్చుని ఈ చిత్రాన్ని వీక్షించారు. ఆయనతో పాటు హీరోయిన్ అమలా పాల్ కూడా ఉన్నారు.

పూరి, అమలాపాల్ రాకతో భారీగా అభిమానులు తరలి వచ్చారు. అయితే పూరి మొహంలో మాత్రం ఊహించిన సంతోషం కనిపించలేదు. తాము ఊహించిన స్థాయిలో సినిమా రిజల్ట్ లేక పోవడం ఇందుకు కారణంగా కనిపిస్తోంది. సినిమా ఎలా ఉందనే సంగతి పక్కన పెడితే....పూరితో కలిసి సినిమా చూసే అవకాశం దక్కించుకున్న అభిమానులు మాత్రం సంబరపడిపోయారు.

కాగా...ఈ రోజు విడుదలైన 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. పూరి జగన్నాథ్, బన్నీ కాంబినేషన్లో సినిమా అని భారీ అంచనాలు పెట్టుకుని వెళ్లిన సినీ ప్రేమికులు.....దర్శకుడు సినిమాను నడిపించిన తీరు చూసి నిరాశ పడక తప్పలేదు. అయితే అల్లు అర్జున్ డాన్సులు, యాక్షన్స్ సీన్స్ బాగా చేసి తన అభిమానులకు తృప్తిపరిచాడు.

బ్రహ్మానందం, నాజర్, షావర్ అలీ, సుబ్బరాజు, శ్రీనివాసరెడ్డి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: అమూల్ రాథోడ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, కథ,మాటలు, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: పూరి జగన్నాథ్.

English summary
Puri Jagannadh Watched the Iddarammayilatho movie along with Amala Paul in Narsipatnam, near Vizag. Iddarammayilatho directed by Puri Jagannath and produced by Bandla Ganesh. The actors Allu Arjun, Amala Paul and Katherine Tresa are at their best in this movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu