»   » అసభ్యకరంగా ప్రవర్తించిన ఎస్సై...పూరి జగన్నాథ్ కంప్లైట్

అసభ్యకరంగా ప్రవర్తించిన ఎస్సై...పూరి జగన్నాథ్ కంప్లైట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పాల్వంచలో షూటింగ్‌ జరుపుకుంటున్న ఆంధ్రాపోరి చిత్ర యూనిట్‌ బృందంతో ఎస్సై షణ్ముగాచారి అసభ్యకరంగా ప్రవర్తించారు. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌ హీరోగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఎస్సైపై పూరి జగన్నాథ్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సైని ఎస్పీకి అటాచ్‌ చేస్తూ ఉత్వర్వులు జారీ చేశారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

చిత్రం విషయానికి వస్తే..

Puri Jagannadh Wife Complaint On Palwancha SI

పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి, ఉల్కా గుప్తా జంటగా నటిస్తున్న ఆంధ్రాపోరి చిత్రం కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. రాజ్ మాదిరాజు దర్శకుడు.

దర్శకుడు మాట్లాడుతూ... ఋషి చిత్రం తరువాత రమేష్‌ప్రసాద్ మరోసారి నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ విలువ ఏమిటో నాకు బాగా తెలుసు. కుటుంబ నేపథ్యంలో సాగే అందమైన టీనేజ్ ప్రేమకథాచిత్రమిదిఅన్నారు.

ప్రసాద్ ప్రొడక్షన్ ప్రయాణంలో ఈ రోజు చాలా ముఖ్యమైనది. మా సంస్థ నిర్మిస్తున్న 30వ సినిమా ఇది. మరాఠీలో మంచి విజయాన్ని సాధించిన టైమ్‌పాస్ చిత్రం ఆధారంగా ఆంధ్రాపోరి రూపొందిస్తున్నాం అని రమేష్ ప్రసాద్ తెలిపారు.

డా.శ్రీకాంత్, పూర్ణిమ, ఈశ్వర్‌రావ్, అరవింద్‌కృష్ణ,ఊర్మిళ కనిత్కర్, ఉత్తేజ్, అభినయ, శ్రీతేజ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం:ప్రవీణ్ వనమాలి, సంగీతం:డా.జె, ఆర్ట్:రాజీవ్ నాయర్, డ్యాన్స్:చంద్రకిరణ్, సాహిత్యం:సుద్దాల అశోక్‌తేజ,రామజోగయ్యశాస్త్రి, కిట్టు విస్సా ప్రగడ, కృష్ణ మదినేని, చక్రవర్తుల.

English summary
Director Puri Jagannadh's son is making a debut in Tollywood with the film Andhra Pori. The shooting of the film has started in Khammam district Palwancha. It is reported that SI of Palwancha has misbehaved with them in the hotel in the name of raids. The SI also misbehaved with the heroine of the film too.
Please Wait while comments are loading...