»   » చిరంజీవి ‘ఆటో జానీ’ని బ్లాక్‌బస్టర్ హిట్ చేసే దశగా...

చిరంజీవి ‘ఆటో జానీ’ని బ్లాక్‌బస్టర్ హిట్ చేసే దశగా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వం చేసే అవకాశం దక్కించుకున్న పూరి జగన్నాథ్...ఆ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేయడానికి తన శక్తినంతా కూడగడుతున్నాడు. ఆ సినిమా కోసం తన కెరీర్లోనే బెస్ట్ డైలాగ్స్ రాసే పనిలో పడ్డారు. చిరంజీవి ఇమేజ్ కు సూటయ్యే విధంగా పర్ ఫెక్టుగా సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

‘దర్శకుడిగా నా గురించి చిరంజీవిగారికి బాగా తెలుసు. అందుకే రామ్ చరణ్ ను ఇంట్రడ్యూస్ చేసే అవకాశం నాకు ఇచ్చారు. చిరంజీవి గారి కోసం ‘ఆటో జానీ' టైటిల్ రిజిస్టర్ చేయించినపుడు నా మైండ్ లో ఎలాంటి స్టోరీ లేదు. తర్వాత స్టోరీ ప్రిపేర్ చేసాను. తర్వాత దాన్ని చిరంజీవి గారికి చెప్పి ఒప్పించడం' జరిగింది అని పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చారు.

Puri Jagannath about “Auto Jaani”

చిన్నతనం నుండి చిరంజీవి అభిమాని అయిన పూరి జగన్నాథ్ ఇపుడు తన అభిమాన హీరోను డైరెక్ట్ చేసే అవకాశం రావడంపై చాలా సంతోషంగా ఉన్నాడు. చిరంజీవి కెరీర్లో ల్యాండ్ మార్క్ మూవీ అయిన ఈ చిత్రాన్ని తన కెరీర్లో బెస్ట్ చిత్రంగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఆగస్టులో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈచిత్రాన్ని చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ స్వయంగా నిర్మిస్తున్నారు. అభిమానులు ఈ సినిమాపై అంచనాలు భారీగా పెట్టుకున్నారు. అభిమానుల అంచనాలను బేరీజు వేస్తూ పూరి తన పని కానిస్తున్నాడు.

English summary
Talking on a TV show, Puri Jagannath stated how he impressed Megastar Chiru for 150th film. “I’ve no story in my mind but only registered the title “Auto Jaani” and impressed Megastar with it. Later I’ve prepared the story and got his nod”, adds Puri. Definitely Chiru has solid confidence on Jagan, which otherwise he will not be announcing 150th movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu