twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బిజినెస్‌ మేన్‌' కథ అలా అలా: పూరీ జగన్నాధ్

    By Srikanya
    |

    లెక్కలతో మొదలైన సినిమా కాదు 'బిజినెస్‌ మేన్‌'. ఓ రోజు అర్థరాత్రి 2 గంటలకు రాంగోపాల్‌ వర్మ నుంచి ఫోనొచ్చింది. మాటల్లో 'దావుద్‌ ఇబ్రహీం ఎక్కడున్నాడో తెలీదు, ఛోటా రాజన్‌ హల్‌చల్‌ లేదు, ఛోటా షకీల్‌ కూడా లేడు.... మైదానం ఖాళీ ఉంది. ఎవడైనా వచ్చి ఆడుకోవచ్చు...' అన్నారు. ఆ ఆలోచన నాలో నాటుకుపోయింది. వెంటనే ఈ కథ అల్లుకొన్నాను అన్నారు పూరీ జగన్నాధ్.

    తన తాజా చిత్రం 'బిజినెస్‌ మేన్‌'గురించి ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో మాట్లాడుతూ...అలాగే... ఓ భాయ్‌ని చంపడానికి ఓ పోలీసు అధికారి చేసిన ప్రయత్నం 'పోకిరి'. ఏకంగా భాయ్‌ అవుదామని రంగంలోకి వచ్చిన ఓ యువకుడి కథ 'బిజినెస్‌మేన్‌' అన్నారు. ఇక మన హీరోల స్థాయి పెరిగింది. కర్ర పట్టుకొంటే కుదర్దు. కత్తో తుపాకీనో పట్టాల్సిందే. థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకుడు కూడా ఎంతో ఊహించుకొని వస్తున్నాడు. పల్లెటూరి కథలు అక్కడ ప్రెసిడెంటుతో పోరాటాలు.. ఇవేం ఎక్కవు. ఇప్పుడు పెదరాయుడు, చినరాయుడు అనే కథలు నడవవేమో..అందుకే డాన్‌లు దిగిపోతున్నారు అని ప్రస్తుత ట్రెండ్ ని విశ్లేషించారు. ఫైనల్ గా ..బిజినెస్‌మేన్‌ తో పోకిరి ముద్ర మారుతుందని చెప్పారు.

    ఆ విషయం ప్రస్దావిస్తూ.. ఈ సినిమా కూడా 'పోకిరి' చూసిన కళ్లతోనే చూస్తారని నాకు తెలుసు. అయితే వారందరికీ మహేష్‌బాబు నటన కొత్త రకంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా మహేష్‌ కనిపిస్తాడు. తెగ మాట్లాడేస్తాడు. అయినా మళ్లీ మళ్లీ అతను మాట్లాడితే వినాలి... అనిపిస్తుంది. తెరపై ఎంతమందున్నా అందరి దృష్టీ ఆయన మీదే ఉంటుంది. 'పోకిరి' ఆలోచనల నుంచి.. ప్రభావం నుంచి బయటపడేసే బాధ్యత ఈ సినిమాలో మహేష్‌బాబు తీసుకొన్నారు అని చెప్పుకొచ్చారు.

    English summary
    Businessman is being directed by Puri Jagannath and has Mahesh Babu in the lead role along with Kajal Aggarwal. Venkat of R.R.Movie Makers is producing this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X