»   » పూరీ అంచనాలు తప్పబోతున్నాయా? వెబ్ సిరీస్ ల పై నిపుణుల అభిప్రాయం ఇదీ

పూరీ అంచనాలు తప్పబోతున్నాయా? వెబ్ సిరీస్ ల పై నిపుణుల అభిప్రాయం ఇదీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

దర్శకుడు పూరీ జగన్నాధ్ మాట్లాడుతూ.. వెబ్ సిరీస్ లు త్వరలో సినిమా రంగాన్ని మించిపోనున్నాయని.. భవిష్యత్ అంతా వాటిదేనంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇకముందు తాను కూడా సినిమాలనుంచి ఎక్కువగా దృష్టి వెబ్ సిరీస్ లమీదే అంటూ తేల్చేసాడు.

నేను ఖాళీగా ఉండలేను

నేను ఖాళీగా ఉండలేను

"మారుతున్న కాలానికి తగ్గట్లుగా మనమూ మారాలి. నేను ఖాళీగా ఉండలేను. ఒక్క రోజు ఖాళీ దొరికితే ఓ కథ రెడీ చేస్తా. నా దగ్గర మరో పదేళ్లకు సరిపడా కథలున్నాయి. వాటితో కుదిరినంత కాలం సినిమాలు చేస్తా. భవిష్యత్తులో సినిమా అనేదే ఉండదని నా అంచనా. రాబోయే కాలంలో సినిమా సిస్టమ్‌ మారుతుందనుకుంటున్నా. వెబ్‌ సిరీస్‌లే ఉంటాయని నా ఫీలింగ్‌. అందుకే నేనూ వెబ్‌ సిరీస్‌ల వైపు వెళ్లాలనుకుంటున్నా" అని పూరి తెలిపాడు.

పూరీ అంచనా తప్పని చెబుతున్నారు

పూరీ అంచనా తప్పని చెబుతున్నారు

అయితే ఈ విషయం లో పూరీ అంచనా తప్పని చెబుతున్నారు నిపుణులు. అసలు మొదటగా ఓ థియేటర్ కి వెళ్లి పెద్ద స్క్రీన్ పై లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చే సినిమాని కేవలం చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లోనో, లాప్టాప్, డెస్క్టాప్ లోనో చూడగలిగే వెబ్ సిరీస్ లు ఎప్పటికీ దెబ్బకొట్ట లేవనీ కనీసం సినిమాకి పోటీకూడా కావన్నది వారి అభిప్రాయం.

 గేమ్ ఆఫ్ థ్రోన్స్

గేమ్ ఆఫ్ థ్రోన్స్

ఇప్పటికే గేమ్ ఆఫ్ థ్రోన్స్ వంటి వెబ్ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నా.. సినిమా పై అవి చూపించిన ప్రభావం ఏమీలేదు. అలాగే ప్రముఖ నెట్వర్క్స్ కోసం నెలకు 500 చొప్పు సబ్ స్క్రిప్షన్ కట్టి మరీ వెబ్ సిరీస్ లు చూడటం అన్నది కూడా కాస్త ఆలోచించాల్సిన విషయమే.

వెబ్ సిరీస్‌లు చేస్తానంటున్నాడు

వెబ్ సిరీస్‌లు చేస్తానంటున్నాడు

మామూలుగా సినిమాల్లో అవకాశాలు అందుకోవడం కోసం ముందు షార్ట్ ఫిలిమ్స్.. వెబ్ సిరీస్‌ల ద్వారా తమ ప్రతిభను చాటుకోవడానికి ప్రయత్నిస్తుంటారు యువ దర్శకులు. ఐతే పూరి జగన్నాథ్ మాత్రం రివర్స్‌లో రాబోతున్నాడు. దర్శకుడిగా స్టార్ స్టేటస్ అందుకున్న పూరి.. భవిష్యత్తులో వెబ్ సిరీస్‌లు చేస్తానంటున్నాడు. భవిష్యత్తులో సినిమా అనేదే ఉండదని.. వెబ్ సిరీస్‌లే ఉంటాయని.. తాను కూడా త్వరలోనే వెబ్ సిరీస్‌ల వైపు వెళ్తానని పూరి చెప్పడం విశేషం.

ఇప్పట్లో కష్టం

ఇప్పట్లో కష్టం

ఎందుకంటే.. వీటిన్నిటికీ యూట్యూబ్ కంటెంట్ ఉచితంగా లభిస్తుంది. నెట్ ఫ్లిక్స్ వంటి కొన్ని సర్వీసులు పలు దేశాల్లో పాపులర్ అయినా.. ఇక్కడ మాత్రం అలాంటివి ఇప్పట్లో కష్టం. ఇప్పుడు ఇంటర్నెట్ పెనట్రేషన్ ఇంతగా ఒక్కసారిగా పెరగడానికి జియో ఉచిత ఆఫర్ హెల్ప్ చేసింది. కానీ అదికూడా కొంతకాలమే.

సరైన ఆలోచన కాదేమో

సరైన ఆలోచన కాదేమో

ఒక వేళ నెట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినా వెబ్ సిరీస్ లు సినిమా ఇచ్చిన కిక్ ని ఇవ్వటం అన్నది మాత్రం కష్తమే అంటున్నారు. మరి పూరీ వెబ్ సిరీస్ వైపు వెళ్ళటం వరకూ ఓకే గానీ సినిమా కంటే వెబ్ సిరీస్ మాత్రమే నిలబడబోయే వాటిల్లో ఒకటి అనటం మాత్రం సరైన ఆలోచన కాదేమో మరి...

English summary
Director Puri Jagannadh who is busy with Balakrishna's 101st movie said that he has enough stories for the next 10 years and forecasted that the future audience would be more keen on web series than movies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu