»   » పూరీ చేతిలో మోక్షఙ్ఞ సినిమా..!? బాలయ్య రిస్క్ తీసుకుంటున్నాడా?

పూరీ చేతిలో మోక్షఙ్ఞ సినిమా..!? బాలయ్య రిస్క్ తీసుకుంటున్నాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొద్ది రోజుల క్రితం జ‌రిగిన మోక్ష‌జ్ఞ పుట్టిన రోజు వేడుక‌లలో త‌న కుమారుడి ఎంట్రీ పై బాల‌య్య క్లారిటీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. 2018 జూన్ లో మోక్షజ్ఞ హీరోగా అరంగేట్రం చేయ‌బోతున్నాడ‌ని అనౌన్స్ చేశాడు బాలయ్య‌ . గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చిన క్రిష్ తో మోక్ష‌జ్ఞ మొద‌టి సినిమా చేయ‌బోతున్నాడ‌ని కొద్దిరోజులుగా టాక్ ఉంది. అయితే ఇప్పుడు వచ్చిన కొత్తవార్త నమ్మేది గానూ, కాస్త కలవరపెట్టేదిగానూ ఉంది...

షూటింగ్ స‌మ‌యంలోనే త‌న‌తో మ‌రో సినిమా చేస్తాన‌ని బాల‌య్య ప్రామిస్ చేశాడ‌ని పూరీ స్టేట్ మెంట్ ఇచ్చేశాడు. పైసా వ‌సూల్ రిజ‌ల్ట్ చూశాక పూరీకి దూరంగా ఉండ‌మ‌ని బాల‌య్య ఫ్యాన్స్ స‌ల‌హా ఇచ్చార‌ని వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే, బాల‌య్య ఫ్యాన్స్ ను క‌ల‌వ‌ర‌పెట్టే పుకారు ఒక‌టి టాలీవుడ్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. త్వ‌ర‌లోనే తెరంగేట్రం చేయ‌బోతున్న నంద‌మూరి మోక్ష‌జ్ఞ‌ను పూరీ లాంచ్ చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. ఈ విష‌యంపై బాల‌య్య నుంచి ఎటువంటి అధికారికి ప్ర‌క‌ట‌న రాలేదు. పైసా వ‌సూల్ షూటింగ్ స‌మ‌యంలో బాల‌య్య‌, పూరీ ల మ‌ధ్య ఏర్ప‌డిన సాన్నిహిత్యం కార‌ణంగా పూరీ ఈ చాన్స్ కొట్టేశాడ‌ని టాక్. పైసా వ‌సూల్ ఆడియో లాంచ్‌, ప్ర‌మోష‌న్ ఈవెంట్ల‌లో బాల‌య్య‌ను పూరీ ఆకాశానికెత్తేసిన సంగ‌తి తెలిసిందే.

Puri Jagannath to Launch Mokshagna

పైసా వ‌సూల్ స‌మ‌యంలో పూరీ టేకింగ్‌, డైరెక్ష‌న్ కు బాల‌య్య మెస్మ‌రైజ్ అయ్యాడ‌ట‌. ఆ సినిమాలో బాల‌య్య‌ను యంగ్ హీరోలా చూపించిన పూరీకి బాల‌య్య బాగా క‌నెక్ట్ అయ్యాడ‌ట‌. అందుకే, మోక్ష‌జ్ఞ లాంచింగ్ బాధ్య‌త‌లను పూరీ భుజ‌స్కంధాల మీద వెయ్యాల‌ని డిసైడ్ అయ్యాడ‌ట‌. పూరీ ద‌ర్శ‌క‌త్వంలో మెగా హీరో రామ్ చ‌ర‌ణ్ లాంచ్ అయిన సంగ‌తి తెలిసిందే. అదే ఫార్ములాను బాల‌య్య కూడా ఫాలో అవ్వాల‌నుకుంటున్నాడ‌ని టాలీవుడ్ టాక్‌. అయితే, ఈ విష‌యంపై క్లారిటీ రావాలంటే కొంత‌కాలం వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు.

English summary
As per New Reports Tollywood Puri Jagannadh is Directing Nandamuri Mokshagna's First Movie
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu