»   »  ఇపుడాయన మారిన పూరి

ఇపుడాయన మారిన పూరి

Posted By:
Subscribe to Filmibeat Telugu
Puri Jagannath
ప్రభాస్ హీరోగా బుజ్జిగాడు మేడిన్ చెన్నయ్ సినిమాను రూపొందిస్తున్న ప్రఖ్యాత దర్శకుడు పూరి జగన్నాథ్. ఈయన ఎప్పుడూ గడ్డంతో కనిపిస్తారు. అలాంటి పూరి జగన్నాథ్, చిరంజీవి తండ్రి భౌతిక కాయం చూడడానికి వచ్చినపుడు మాత్రం గడ్డంలేకుండా కనిపించారు. గడ్డం లేకపోవడంతో చిన్నపిల్లాడిలా కనిపించారు. కొత్త గెటప్ లో వెరైటీగా ఉన్నారు పూరి. పూరి జగన్నాథ్, ఎస్ఎస్ రాజమౌళిలను గుర్తుపట్టడానికి వారి గడ్డాన్నే ముందుగా చెప్పుకుంటాం. అలాంటిది పూరి జగన్నాథ్ గడ్డం తీశారు. ఇన్నాళ్లు ఉన్న గడ్డాన్ని ఇపుడు ఆయన అడ్డంగా ఉందని ఎందుకు భావించారో కానీ మొత్తానికి కొత్త పూరీని చూపించాడు జగన్నాథ్. అంతేకాదు తల వెంట్రుకలకు వెరైటీ రంగేశారు. బంగారు వన్నెతో మెరిసిపోతున్నాయి. ఇలా ఇన్ని విప్లవాత్మక మార్పులకు కారణమైన వారెవరో కానీ వారికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X