»   » టాలీవుడ్ లోనే తొలిసారి... పూరీ మూవీలో బాలయ్య హెలీకాప్టర్ చేజ్

టాలీవుడ్ లోనే తొలిసారి... పూరీ మూవీలో బాలయ్య హెలీకాప్టర్ చేజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమాలను ఎంత వేగంగా పూర్తి చేస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తక్కువలో తక్కువ ఆరునెలల్లోనే సినిమాను పూర్తి చేసేస్తాడు పూరీ. ఇప్పుడు బాలయ్యతో సినిమా విషయంలోనూ అదే జోరును కొనసాగిస్తున్నాడు పూరీ. అంతే కాదు ఇప్పటి వరకూ టాలీవుడ్ తెరమీద చూడని చేజింగ్ సీన్ ని తీస్తున్నాడట.. చేజింగ్ ఎక్కడో తెలుసా ఆకాశంలో... ఔను..! ఆకాశం లోనే ఎలా అంటే...

షూటింగ్ పోర్చుగల్ లో

షూటింగ్ పోర్చుగల్ లో

బాలకృష్ణ 101వ సినిమా షూటింగ్ ప్రస్తుతం పోర్చుగల్ లో జరుగుతోంది. 40 రోజుల పాటు అక్కడ షూటింగును ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ లో పాటలతో పాటు భారీ ఛేజింగ్ దృశ్యాలను తెరకెక్కించనున్నారు. . ఈ సినిమాలో మాఫియా డాన్‌గానూ, టాక్సీ డ్రైవర్‌గానూ కనిపించనున్నాడట బాలయ్య.

పోర్చుగల్‌లో

పోర్చుగల్‌లో

ముందు టపోరీ గా, తర్వాత ఉస్తాద్ గా వినిపిస్తున్నా ఇంకా అధికారికంగా టైటిల్ ప్రకటించని ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందించబోతున్నారట పూరీ జగన్నాథ్‌, బాలకృష్ణ. ఈ మూవీలో బాలకృష్ణ ఒక గ్యాంగ్‌స్టర్ గా కనిపించబోతున్నాడని ఇపటికే అందరికీ అర్థమైపోయింది.

బిజినెస్ మ్యాన్ 2 కథ ఇదే

బిజినెస్ మ్యాన్ 2 కథ ఇదే

దీనికోసం బాలయ్య గెటప్ హెయిర్ స్టైల్ బాడీ లాంగ్వేజ్ ఇలా అన్ని విషయాలలోను మార్పులు చేయడానికి పూరి భారీ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో తాను గతం లో తీయాలనుకున్న బిజినెస్ మ్యాన్ 2 కథ ఇదేనా? అన్న ఆసక్తి కూడా మొదలయ్యింది..

హెలికాఫ్టర్‌ ఛేజ్‌

హెలికాఫ్టర్‌ ఛేజ్‌

ఇప్పటివరకు తెలుగు సినిమాలో ఎడ్లబండ్లు, బైక్‌, కార్‌ ఛేజింగ్‌ సీన్‌లను మాత్రమే చూసిన ప్రేక్షకులకు తన సినిమా ద్వారా హెలికాఫ్టర్‌ ఛేజ్‌ను తొలిసారిగా చూపించబోతున్నాడట బాలయ్య. అంటే తొలిసారి గాల్లో ఛేజింగ్‌ అన్నమాట. ఈ సినిమా కోసం ఫ్రెంచి స్టంట్‌ మాస్టర్‌లను తీసుకుంటున్నారని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా ఈ ఛేజింగ్‌ సీన్‌ కోసమే వారిని తీసుకున్నారట. పోర్చుగల్‌లోనే ఈ సీన్‌ను తెరకెక్కిస్తారట.

మాస్, క్లాస్,మాఫియా

మాస్, క్లాస్,మాఫియా

సాదారణంగా పూరి చిత్రాలు చాలా డిఫరెంట్ మోడ్ లో ఉంటాయి..మాస్, క్లాస్,మాఫియా కూడా ఉంటుంది. ఇప్పుడు బాలకృష్ణతో తీస్తున్న చిత్రంలో బాలయ్య ఎలా తయారౌతాడో ? బాలయ్య ని పూరి ఎలా చూపిస్తాడో అని ఆశగా ఎదురు చూస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్ . అయితే వాళ్ళ ఆశలకు తగ్గట్లుగానే బాలయ్య కొత్తగా కనిపిస్తున్నాడు. మామూలుగా పూరీ సినిమాల్లో ఉండే హీరో ఎక్కడా తగ్గినట్టు కనిపించడు. శారీరకంగా కూడా మరింత బలంగా, దూకుడు గా ఉంటాడు.

వడ్డీ తో సహా

వడ్డీ తో సహా

ఇన్నాళ్ళూ చూసిన బాలయ్య వేరు ఆ సినిమాల్లో బాలకృష్ణలో రాజసం లాంటి ప్రవర్తనే ఉంటుంది, తెల్ల పంచె, చేతిలో కత్తి తీ కనిపించే బాలయ్య లో ఒక మెచూర్డ్ మ్యాన్ అనే ఫీల్ తప్ప యంగ్ అండ్ డైనమిక్ ఫీల్ రాదు. ఫైట్లలో కూడా బాలయ్య తీరు వేరు. కానీ ఈసారి మళ్ళీ షార్ట్ హ్యాండ్స్ ఉండే టీషర్ట్ తో బైసిప్స్ కనిపించేలా యూత్ఫుల్ లుక్ తో కనిపించే పూరీ హీరోగా బాలకృష్ణ ఎన్నాళ్ళు గానో పూరీ కి దూరంగా ఉన్న హిట్ ని వడ్డీ తో సహా అతని చేతుల్లో పెట్టేటట్టే కనిపిస్తున్నాడు.

English summary
After Gautami Putra Shatakani, Actor Nandamoori Balakrishna doing movie with Director Puri Jagannadh. an Itresting news is out about this movie that Puri planing a Chase with Helicopters
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu