»   »  చార్మితో ఎఫైర్: స్పందించిన దర్శకుడు పూరి!

చార్మితో ఎఫైర్: స్పందించిన దర్శకుడు పూరి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పూరి జగన్నాథ్ త్వరలో చార్మితో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై కొంతకాలంగా వీరి మధ్య స్క్రిప్టు చర్చలు జరుగుతున్నాయి. ఇందు కోసం తరచూ మీటవుతున్నారు. అయితే ఈ అంశాన్ని ఫిల్మ్ నగర్లో కొందరు మరోలా ఫోకస్ చేస్తున్నారు. చార్మితో పూరి ఎఫైర్ నడుపుతున్నాడని ప్రచారంలోకి తెచ్చారు.

ఈ విషయమై పూరి జగన్నాథ్ స్పందిస్తూ...‘ఇలాంటి వార్తలు ఈ మధ్య నేనూ విన్నాను. ఇవి విన్నప్పుడల్లా నవ్వొస్తుంది. చార్మి నేను త్వరలో చేయబోయే సినిమాలో హీరోయిన్ అనే విషయం అందరికీ తెలుసు. ఈ విషయమై మేము కలిసినంత మాత్రాన ఇద్దరి మధ్య ఎఫైర్ అంటగట్టేస్తున్నారు. చార్మి నాకు చాలా కాలంగా తెలుసు, ఇద్దరం కలిసి గతంలో పలు చిత్రాలకు పని చేసాం. మంచి స్నేహితులం. మా మధ్య స్క్రిప్టు చర్చలు తప్ప మరేమీ జరుగడం లేదు' అని స్పష్టం చేసారు. గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బాలీవుడ్ మూవీ ‘బుడ్డా హోగా తెర బాప్' చిత్రంలో చార్మి నటించిన సంగతి తెలిసిందే.

 Puri Reacts on affair with Charmi

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
నెక్ట్స్ మూవీ వరుణ్ తేజ్ తో...

టెంపర్ చిత్రం విడుదలైన వెంటనే వరుణ్ తేజ్‌తో సినిమా చేయబానికి రెడీ అవుతున్నారు పూరి. సి.కళ్యాణ్ ఈచిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ విషయం అఫీషియల్ గా ఖరారు చేసారు. వరుణ్ తేజ్ ఇటీవలే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ‘ముకుంద' చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే వరుణ్ తేజ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతని పెర్ఫార్మెన్స్, లుక్స్ బావున్నాయని, భవిష్యత్తులో మంచి స్తాయికి ఎదుగుతాడని అంటున్నారంతా.

టెంపర్ సినిమా విషయానికొస్తే...
ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టెనర్ ఫస్ట్ లుక్, థియేట్రికల్ ట్రైలర్ విడుదలయినప్పటి నుండి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రం ఫిబ్రవరి 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. మాగ్జిమం నెంబరాఫ్ థియోటర్స్ లో విడుదల అవుతున్న ఈ చిత్రం మొదటి షో హైదరాబాద్ భ్రమరాంబ థియోటర్ లో ఉదయం 5.07 నిముషాలకు విడుదల కానుంది.

ఈచిత్రాన్ని వెస్ట్ గోదావరిలో పూరి జగన్నాథ్ స్వయంగా విడుదల చేయబోతున్నాడు. ఇందుకోసం ఆయన పాపుల డిస్ట్రిబ్యూటర్ సురేస్ మూవీస్‌తో జతకట్టినట్లు తెలుస్తోంది. ఈ జిల్లా రైట్స్ కోసం పూరి జగన్నాథ్ రూ. 2 కోట్ల 50 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. తాను దర్శకత్వం వహించిన చిత్రాన్ని....ఇంత రేటు పెట్టి మరీ పూరి జగన్నాథ్ కొనడం హాట్ టాపిక్ అయింది. సినిమాపై ఆయనకు చాలా కాన్ఫిడెన్స్ ఉండబట్టే ఇలా చేసాడని అంటున్నారు. అయితే మరో వాదన కూడా వినిపిస్తోంది ఉంది. ‘టెంపర్' చిత్రం చివరి షెడ్యూల్‌కు నిర్మాత బండ్ల గణేష్ డబ్బులు ఇవ్వలేదని, పూరి తన సొంత డబ్బులు ఖర్చు పెట్టాడని, అందుకే నిర్మాత ఇలా సెటిల్మెంట్ చేసాడని కొందరు అంటున్నారు. ఇందులో నిజమెంతో తేలాల్సి ఉంది.

English summary
Puri Reacts on affair with Charmi “I find this news very amusing. Just because I know Charmee and she is the lead heroine in my next film, that doesn’t mean that we are having an affair. People must understand that I know Charmi for a very long time and we worked together in the past. She is a very good friend of mine and we do keep in touch just to discuss scripts”.
Please Wait while comments are loading...