సూపర్ రెస్పాన్స్ : వరుణ్‌ తేజ్‌ 'లోఫర్‌' ఫస్ట్‌లుక్‌ (ఫొటోలు)

By Srikanya

హైదరాబాద్‌: పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వరుణ్‌తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'లోఫర్‌'. ఇది వరుణ్‌ తేజ్‌కు మూడో చిత్రం. సీకే ఎంటర్‌టైమెంట్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని విడుదల చేసారు. వాటికి మంచి రెస్పాన్స్ వస్తోంది. వాటిని ఇక్కడ చూడండి.

ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శర వేగంగా జరుగుతున్నాయి. ఫెమినా మిస్ ఇండియా 2013 రన్నరప్ దిషా పతాని ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడీగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని 18 డిసెంబర్ న విడుదల చేయాలని దర్శక,నిర్మాతలు తేదీ ని లాక్ చేసినట్లు సమచారం. అలాగే ఆడియోని నవంబర్ చివరి వారంలోకాని, డిసెంబర్ మొదటి వారంలోని విడుదల చేస్తారు.

Puri's Loafer: First look revealed

ఈ చిత్రంలో రేవతి, పోసాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. వరుణ్‌తేజ్‌ హీరోగా ఇటీవల విడుదలైన 'కంచె'చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే.

'లోఫర్‌' ఎలాంటి సినిమా?

Puri's Loafer: First look revealed

పూరి జగన్నాథ్ మాట్లాడుతూ... 'అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి' తర్వాత ఆ తరహాలో చేస్తున్న మరో సినిమా ఇది. అమ్మ సెంటిమెంట్‌ ఆధారంగా తెరకెక్కించా. చాలా రోజుల తర్వాత మళ్లీ ఓ సెంటిమెంట్‌ సినిమా చేయడం నాకే కొత్తగా, ఆసక్తికరంగా అనిపించింది. ట్విట్టర్‌లోనూ, అక్కడా ఇక్కడా చాలా మంది నన్ను పదే పదే అడిగేవాళ్లు... 'అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి' లాంటి సినిమా చేయరా? అని. ఈ సినిమాతో మళ్లీ అలాంటి ఓ మంచి కథ కుదిరింది. రచయితగా నాకు సంతృప్తినిచ్చిన కథ ఇది.

వరుణ్‌తేజ్‌ చాలా బాగా నటించాడు. తప్పకుండా మంచి కథానాయకుడు అవుతాడు. నాగబాబుగారు గర్వపడేలా చేస్తాడు. నిజాయతీగా నటిస్తాడు. ఎంత పొడుగున్నా వరుణ్‌లో ఓ రకమైన అమాయకత్వం కనిపిస్తుంటుంది. అది అతడి కెరీర్‌కి బాగా ఉపయోగపడుతుందని నమ్ముతున్నా. అలాగే ఈ సినిమాతో దిశా పటాని అనే కథానాయికని పరిచయం చేస్తున్నాం. ఒకసారి చూడగానే నచ్చుతుంది.

Puri's Loafer: First look revealed

కథలో భాగంగానే ఆ పేరు పెట్టాం. ఇందులో కథానాయకుడికి పనీ పాట ఏమీ ఉండదు. కానీ చివరికి మంచివాడిలా మారతాడు. ఈ పేరు ఎందుకు పెట్టామో సినిమా చూశాక బాగా అర్థమవుతుంది. అయితే సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూసినప్పట్నుంచి పేరు మార్చమని రామ్‌గోపాల్‌ వర్మ, నిర్మాత సి.కల్యాణ్‌ నా బుర్ర తినేస్తున్నారు (నవ్వుతూ).

Puri's Loafer: First look revealed

బ్రహ్మానందం, రేవతి, పోసాని కృష్ణ మురళి తదితరులు ముఖ్య పాత్రలల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో చరణ్ దీప్‌ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మదర్ సెంటిమెంట్ కథాంశంగా రూపొందుతోందని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X