»   » పూరి సినిమాని రీమేక్ కి కమిటైన సల్మాన్ ఖాన్ !?

పూరి సినిమాని రీమేక్ కి కమిటైన సల్మాన్ ఖాన్ !?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పూరి జగన్నాథ్ సూపర్ హిట్ పోకిరి ని హిందీలో సల్మాన్ తో వాంటెడ్ టైటిల్ తో రీమేక్ చేసి అప్పట్లూ సూపర్ హిట్ కొట్టన సంగతి తెలిసిందే. కెరిర్ లో వరస ప్లాఫ్ ల్లో ఉన్న సమయం లో ఆ చిత్రం వచ్చి విజయవంతమయ్యింది. అప్పటి నుంచీ సల్మాన్ ..బాలీవుడ్ లో రీమేక్ కింగ్ గా మారారు.

దాంతో ఆయన దర్శకుడు పూరి జగన్నాథ్ కొత్త చిత్రం ఏది రిలీజ్ అయినా వెంటనే ఆ చిత్రం గురించి ఎంక్వైరీ చేస్తారు. బాగుందంటే రీమేక్ చేయటానికి. అదే కోవలో ఇప్పుడు ఆయన దృష్టి పూరి జగన్నాధ్ కొత్త చిత్రంపై పడిందని తెలుస్తోంది. ఆ చిత్రం మరేదో కాదు 'రోగ్'.

డైరెక్టర్ పూరీ జగన్నాద్ రీసెంట్ గా క‌ళ్యాణ్‌రామ్ హీరోగా తెర‌కెక్కించిన చిత్రం ఇజం అనుకున్న రేంజ్‌లో ఆడలేక‌పోయింది. దీంతో పూరీ వ‌చ్చే నెల‌లో మ‌రో చిత్రంతో రావాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని తెలుస్తోంది. ఇషాన్ హీరోగా రోగ్ అనే చిత్రాన్ని ఇజం చిత్రం కన్నా ముందే ప్రారంభించినా ప‌లు కార‌ణాల వ‌ల్ల అది వాయిదా ప‌డుతూ వ‌చ్చింది.

Puri's 'Rogue' to be remade in Hindi by Salman Khan featuring Suraj Pancholi

ఈ చిత్రానికి తుది మెరుగులు దిద్దుతున్నాడని తెలుస్తోండగా, కొన్ని రోజులుగా దగ్గరుండి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని కూడా పర్యవేక్షిస్తున్నాడట పూరి. తెలుగు.. కన్నడ భాషల్లో తెరకెక్కింన ఈ చిత్రంలో మొదటి హీరోయిన్‌గా పూజా జవేరిను, సెకండ్ హీరోయిన్‌గా బాలీవుడ్ భామ మన్నారా చోప్రా నటిస్తోంది.

ఈ చిత్రాన్ని హిందీలో సల్మాన్ ఖాన్ రీమేక్ చేయనున్నాడట. అయితే అందులో హీరో సల్మాన్ కాదు సూరజ్ పంచోలి. సల్మాన్ ఈ రీమేక్ ను నిర్మిస్తాడట.
ఎప్పటి నుంచో పూరి, సల్మాన్ లు మంచి స్నేహితులు. ఆ చొరవతో పూరి ఇప్పటిదాకా తీసిన 'రోగ్' సినిమాని ఆయనకు చూపించాడట.

సినిమా చూసిన సల్మాన్ వెంటనే ఇంప్రెస్ అయి హిందీలో సూరజ్ పంచోలితో రీమేక్ చేస్తానని అన్నాడట. పూరి కూడా ఒప్పుకోవడంతో స్క్రిప్ట్ పనులు కూడా మొదలయ్యాయని, త్వరలోనే చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. మరి సల్మాన్ అంతటి హీరో ఈ సినిమాని ఇష్టపడి, రీమేక్ చేయనున్నాడంటే అందులో గట్టి విషయముందని అంటున్నారు.అయితే ఈ వార్త...కేవలం సినిమాని అమ్ముకోవటానికి పూరి క్యాంప్ పుట్టించిందే వార్త కూడా ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఏది నిజమో ..కొద్ది రోజులు ఆగితే కానీ తెలియదు.

English summary
Puri's 'Rogue' movie is though yet to be completed, we hear that the director, who has good ties with Bollywood biggies reportedly has floored Salman Khan with the story.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu