హైదరాబాద్ : పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ హీరోగా లాంచ్ అవుతున్న సంగతి తెలిసిందే. 'ఆంధ్రాపోరి' టైటిల్ తో ఆ చిత్రం రూపొందనుంది. రాజ్ మదిరాజు దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం ఈ రోజే లాంచ్ అయ్యింది. ప్రసాద్ ల్యాబ్ ఎండీ రమేష్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉల్కా గుప్త హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం టైం పాస్ అనే మరాఠీ చిత్రం రీమేక్.
పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ ఇప్పటి వరకూ ‘గబ్బర్ సింగ్', ‘బుజ్జిగాడు', ‘ధోని' మొదలైన సినిమాలలో బాల నటుడిగా కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పటికీ అడపాదడపా తన వయసుకు దగ్గ సినిమాలు చేస్తూనే వస్తున్న ఆకాష్ ఇక నుంచి వాటికి బ్రేక్ ఇచ్చి సోలో హీరోగా అరంగేట్రం చేస్తూండటంతో మంచి అంచనాలే ఉన్నాయి.
జనవరి నుంచి షూటింగ్ జరిగే ఈ చిత్రం ప్రారంభానికి పూరి జగన్నాథ్, లావణ్య, సాయిరామ్ శంకర్ వచ్చారు. ఓపినింగ్ సింపుల్ గా చేసారు. ఇంకా పలువురు చిత్ర రంగ ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు తెలియచేసారు.
ప్రసాద్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెంబర్ 30 గా లో తీయబడుతున్న ఈ చిత్రంకి కెమెరా ప్రవీణ్ వనమాలి సమకూరుస్తున్నారు. కో డైరక్టర్ గా రమేష్ నారాయణ్, ప్రొడక్షన్ కంట్రోలర్ గా ఉమా మహేష్ .సిహెచ్, పాటలు...సుద్దాల అశోక్ తేజ, రామ జోగయ్య శాస్త్రి, కిరణ్ చక్రవర్తుల, కృష్ణ మాదినేని, కిట్టు విస్సు ప్రగడ,సంగతీ డా.జోశ్యభట్ల అందిస్తున్నారు. స్క్రీన్ ప్లే,మాటలు, దర్శకత్వం రాజ్ మాదిరాజు అందిస్తూండగా, రమేష్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
Puri Jagannath's son Akash's debut film 'Andhra Pori' directed by Raj Madhiraj is launched today. Film is produced by Ramesh Prasad, MD of Prasad Labs. Ulka Gupta is starring as heroine after Akash. Film's regular shooting will be starting from Jan. Puri Jagannath, Lavanya,Sai Ram Shankar and others participated in the film opening. Film is a remake of Marathi film Time Pass.
Story first published: Thursday, December 18, 2014, 14:58 [IST]