»   » పవన్ సినిమాలో పూరీ కొడుకు పాత్ర

పవన్ సినిమాలో పూరీ కొడుకు పాత్ర

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో ప్రారంభం కానున్న గబ్బర్ సింగ్ చిత్రంలో పూరీ జగన్నాధ్ కుమారుడు ఆకాష్ కనిపించనున్నాడు. సినిమా ప్రారంభంలో వచ్చే పవన్ కళ్యాణ్ చిన్నప్పుడు ఎపిసోడ్ లో ఈ పిల్లవాడుని చూపించనున్నాడు. ఇక ఆకాష్ గతంలో రామ్ చరణ్ తేజ చిరుత చిత్రంలోనూ, ఏక్ నిరంజన్, బుడ్డిగాడు మేడిన్ చెన్నై తదితర చిత్రాల్లో నటించాడు. ఇక హిందీ చిత్రం దబాంగ్ రీమేక్ గా రూపొందే ఈ చిత్రం స్క్రిప్టుని గత కొద్ది రోజులుగా హరీష్ శంకర్ రూపొందిస్తున్నారు. ఆ మధ్యన ఓ రెండు డైలాగులను హరీష్ శంకర్ ట్విట్టర్ లో పెట్టారు.

మిరపకాయతో విజయం సాధించిన హరీష్ శంకర్ ఈ చిత్రంలో పంచ్ డైలాగ్ లుతో ఆకట్టుకుంటారని నమ్మి పవన్ ఈ ప్రాజెక్టు అప్పచెప్పారు. ఈ చిత్రం గురించి దర్శకడు హరీష్ శంకర్ మాట్లాడుతూ 'సల్మాన్ ఖాన్ బాడీలాంగ్వేజ్ కి అనుగుణంగా రూపొందిన 'దబాంగ్" హిందీలో ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి బాడీ లాంగ్వేజ్ కి మేనరిజానికి తగ్గట్టుగా మార్పులు చేసి ఫుల్ లెంగ్త్ మాస్ క్యారెక్టరైజేషన్ తో ఫుల్ మీల్స్ గా రాబోతున్న సినిమా 'గబ్బర్ సింగ్". పవన్ కళ్యాణ్ నుంచి అభిమానులు ఆశించే అన్ని అంశాలు ఈచిత్రంలో వుంటాయి. ఫైట్స్ కూడా ఇంతకు ముందెన్నడూ రాని విధంగా కొత్తకోణంలో నావెల్టీగా వుంటాయి అని హరీష్ శంకర్ తెలియజేశారు.

English summary
Puri Jagannath son Akash in his film Gabbar Singh with Pawan Kalyan. Akash will play the childhood role of Pawan Kalyan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X