»   » అమీర్ ఖాన్ ఆల్ ఖైదా, ఐసిస్‌లో ఉండి ఉంటే.... : పూరి ట్వీట్

అమీర్ ఖాన్ ఆల్ ఖైదా, ఐసిస్‌లో ఉండి ఉంటే.... : పూరి ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అమీర్ ఖాన్ కు మద్దతు ఇచ్చే సెలబ్రిటీల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా పూరి జగన్నాథ్ ఈ విషయమై ట్వీట్ చేసారు. అమీర్ ఖాన్ బాధ ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. ప్రతి ఒక్కరూ దీన్ని ఓ వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు అని పూరి కామెంట్ చేసారు.

అంతటితో ఆగని పూరి...అమీర్ ఖాన్ సెలబ్రిటీ కావడం వల్లే ఆయనపై గొందు చించుకుంటున్నారు. ఒకవేళ ఆయన ఆల్ ఖైదా లేదా ఐసిస్ లాంటి వాటిల్లో ఉంటే ఏ భారతీయుడైనా ఇలాంటి నాన్సెన్స్ సృష్టించే ధైర్యం చేసే వాడా? అంటూ పూరి ట్వీట్ చేసారు.

ఇటీవల ఓ ఈవెంటులో పాల్గొన్న వెంకటేష్ మీడియాతో ఈ విషయమై స్పందించారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఈ విషయంలో అతిగా, లేనిది ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మీడియా కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తోంది. అమీర్ ఖాన్ వ్యాఖ్యలను అంతా తప్పుగా అర్థం చేసుకున్నారని భావిస్తున్నాను అని వెంకటేష్ అన్నారు.

Puri tweet about Aami khan

రెహమాన్ మద్దతు..
అమీర్ ఖాన్ వ్యాఖ్యలను ఇతర నటీనటులు, రాజకీయ నేతలు, సామాన్య జనంతో పాటు ఎంఐఎం లాంటి పార్టీలు కూడా తప్పుబట్టాయి. అయితే ఆస్కార్ విన్నింగ్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మాత్రం డిఫరెంటుగా స్పందించారు. అమీర్ ఖాన్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానట్లు తెలిపారు. దేశంలో అసంహనం పెరుగుతోందని, తనపై సున్నీ మస్లిం సంస్థ రజా అకాడమీ ఫత్వా జారీ చేసినపుడు దాదాపు తనలోనూ ఇలాంటి భయమే కలిగిందన్నారు.

అమీర్ ఖాన్ వివరణ..
కాగా తన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో అమీర్ ఖాన్ వివరణ ఇచ్చారు. నేను, నా భార్య ఈ దేశం విడిచి వెళ్లాలని కోరుకోవడం లేదన్నారు. ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాను, ఇక్కడే ఉంటాను, భారత గడ్డపై పుట్టినందుకు గర్వంగా ఉందన్నారు. దేశంలోని ప్రజల మధ్య సోదరభావం కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు అమీర్ ఖాన్ తెలిపారు. గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో మాట్లాడుతూ....వృత్తి ధర్మంలో భాగంగా చేసే పనికి తీవ్ర విమర్శలకు గురైనపుడు తాను కూడా ఇలాంటి అసహన పరిస్థితులను ఎదుర్కొన్నట్లు తెలిపారు. మతం పేరుతో చేసే హింసకు తాను పూర్తిగా వ్యతిరేకమని, నాగరిక ప్రపంచంలో ఎట్టి పరిస్థితుల్లోనూ హింస అనేది ఉండ కూడదు అన్నారు.

English summary
"Nobody is understanding Aamir khan's pain .. Everybody is only busy creating issues !!!" Puri tweeted.
Please Wait while comments are loading...