»   » పవన్ ఫ్యాన్స్ కు పూరీ జగన్నాథ్ క్షమాపణ

పవన్ ఫ్యాన్స్ కు పూరీ జగన్నాథ్ క్షమాపణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్‌ కల్యాణ్‌ గురించిన సంభాషణ కేవలం సరదా కోసం రాసిందే. అందులో ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు అంటూ క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు పూరీ జగన్నాథ్. ఆయన తాజా చిత్రం ఇద్దరమ్మాయిలతో సినిమాలో "ప్రతీ ఎదవ పవన్ కళ్యాణ్ ఫ్యానే " అంటూ డైలాగు రాసారు.

ఆ డైలాగు పవన్ అభిమానలను కించపరిచనట్లుగా ఫీలయ్యేలా చేసింది. దాంతో ఆ డైలాగు తొలిగించాలంటూ భీమవరంలో నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపధ్యంలో పూరి ఎక్సప్లనేషన్ ఇస్తూ ట్వీట్ చేసారు.

ఆ ట్వీట్ లో...

"పవన్ కళ్యాణ్ అభిమానులు నిజంగా బాధపడికతే వాళ్లందరికీ సారీ చెప్తున్నాను. ఆ డైలాగ్ చూసి చిరంజీవిగారు నవ్వుకున్నారు, అల్లు అరవింద్ గారు ఎంజాయ్ చేసారు. బన్నికి ఎంతో నచ్చింది. అది కేవలం కాంప్లిమెంట్ మాత్రమే. అది బన్ని ..పవన్ కి పెద్ద ఫ్యాన్ అని మాత్రమే చెప్తుంది. ఐన సరే మీరు భాధపడితే రియల్లీ సారి. ఇది మనస్సులో పెట్టుకోవద్దు. భీమవరం వచ్చినప్పుడు నన్ను హ్యాపిగ పలకరించండి. లవ్ యూ.. "

English summary
Puri Tweeted: ‘I am really sorry if the fans of Pawan Kalyan were hurt. After watching that dialogue, Chiranjeevi garu smiled, Allu Arvind enjoyed it and Bunny liked it a lot. It shows that Bunny is a huge fan of Pawan Kalyan. However, if your sentiments are hurt, please forgive me. When I next come to Bheemavaram, receive me with a smile,’ he tweeted .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu