For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బండ్ల గణేష్ విక‌ృతాలకు చెక్ పెడుతాం.. నిరూపిస్తే 30 కోట్లు ఫ్రీగా ఇచ్చేస్తా.. మండిపడ్డ పీవీపీ

|

నిర్మాత బండ్ల గణేష్‌పై మరో సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) నిప్పులు చెరిగారు. తనకు చెల్లించాల్సిన మొత్తం ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. తనకు డబ్బు ఇచ్చేది లేదని నిరూపిస్తే ఆ మొత్తం తిరిగి ఇస్తానని సవాల్ విసిరాడు. అంతేకాకుండా తన ఇంటికి వచ్చి అనుచరులతో దాడి చేశారని బండ్ల గణేష్‌పై కేసు నమోదు చేయడం వివాదంగా మారింది. ఈ అంశంపౌ మీడియాతో పీవీపీ మాట్లాడుతూ..

2013 నుంచి వేధిస్తున్నాడని

2013 నుంచి వేధిస్తున్నాడని

2013లో టెంపర్ సినిమాకు ఫైనాన్స్ కావాలని మమల్ని కలిశారు. దాంతో ఆర్థికంగా సహాయం అందించాం. 2015 ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ కూడా అయింది. అయితే తమకు చెల్లించాల్సిన రుణం చెల్లించలేదు. దానికి అనుబంధంగా వేరే అగ్రిమెంట్ చేసుకొన్నాడు. గత ఆరేళ్లుగా డబ్బు ఎగకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అని పీవీపీ ఆరోపించారు.

చీటింగ్ మైండ్ సెట్‌తో

చీటింగ్ మైండ్ సెట్‌తో

గత ఆరేళ్లుగా మా సిబ్బందిని అన్ని రకాలుగా ఇబ్బందికి గురిచేశాడు. చీటింగ్ మైండ్ సెట్‌తో ముందుకెళ్లాడు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఓ ప్రైవేట్ హోటల్‌లో కలిసి చర్చించుకొన్నాం. ఆ సమయంలో తప్పుగా మాట్లాడారు. కానీ మేము సహనం వహించి ఊరుకొన్నాం. ఆ తర్వాత చెక్ బౌన్స్ కేసులు, సివిల్ కేసులు నమోదు చేశాం అని పీవీపీ తెలిపారు.

 అనుచరులు ఇంటికి వచ్చి

అనుచరులు ఇంటికి వచ్చి

బండ్ల గణేష్‌తో ఇలా వివాదం కొనసాగుతుంటే రెండు రోజుల క్రితం మా ఇంటికి కొందరు వచ్చి ఆయన అనుచరులమని చెప్పారు. బాకీ విషయాన్ని మాట్లాడేందుకు వచ్చామంటే.. ఇది సందర్భం కాదు.. ఆఫీస్‌కు వస్తే మాట్లాడుకుందాం అని చెప్పాం. ఆ సమయంలో హోంమంత్రి తెలుసునని బెదిరింపులకు పాల్పడ్డారని పీవీపీ పేర్కొన్నారు.

నిరూపిస్తే 30 కోట్లు ఫ్రీ ఇస్తా

నిరూపిస్తే 30 కోట్లు ఫ్రీ ఇస్తా

గత పదేళ్లలో వందకుపైగా సినిమాలకు ఫైనాన్స్ చేశాం. ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. కమల్ హసన్ నటించిన విశ్వరూపం సినిమాకు కూడా మాకు ఇలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. డబ్బు చెల్లించామని, ఆయన ఆస్తులకు సంబంధించిన పత్రాలు మావద్ద ఉన్నాయని చేసిన ఆరోపణల్లో నిజం లేదు. మా వద్ద ప్రతీ చెల్లింపుకు బ్యాంకు ట్రాన్సాక్షన్ ఉంది. ఏ ఆడిటరైనా నాకు బండ్ల గణేష్ డబ్బు చెల్లించారని నిరూపిస్తే.. ఆ డబ్బు మొత్తం ఆయనకే చెల్లిస్తాను. దాదాపు 30 కోట్లు ఆయనే ఫ్రీగా ఇచ్చేస్తాను అని పీవీపీ సవాల్ విసిరారు.

ఇంత సంపాదన జీవితంలో రాదు

ఇంత సంపాదన జీవితంలో రాదు

బండ్ల గణేష్‌కు ఇంత కంటే గొప్ప అవకాశం జీవితంలోరాదు. ఇంత మొత్తం సంపాదన జీవితంలో ఆయనకు రాదు. నిర్మాతలు ఇబ్బంది పెడితే ఇండస్ట్రీలో మాతో ఫ్రెండ్లీగా ఎందుకు ఉంటారు. వరుసగా అప్పుల ఎగవేతకు పాల్పడటం ఆయనకు అలవాటు. బయట చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మాది పెద్ద సంస్థ కాబట్టి వీడి విన్యాసాలు, వికృత చేష్టలు తట్టుకొని నిలబడుతున్నాం అని పీవీపీ పేర్కొన్నారు.

బుద్ది చెబుతామనే

బుద్ది చెబుతామనే

ఇండస్ట్రీలో ఇలాంటి వారికి ఎవరో ఒకరు బుద్ది చెప్పాల్సిందే. అందుకే బండ్ల గణేష్‌పై తాడోపేడో తేల్చుకోవాలని సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి నాన్సెన్స్‌కు ముగింపు పలకాలి. హోటల్‌లో నోరు జారడం వల్లే మేము ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. అంతేకాకుండా ఫైనాన్సియర్స్‌కు ఇండస్ట్రీలో అసోసియేషన్ లేదు. అందుకే నిర్మాతల మండలికి ఫిర్యాదు చేయలేదు అని పీవీపీ ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు.

English summary
Tollywood producer Bandla Ganesh satires on Producer PVP. He attacked with serial tweets on targetting the producer. He mentioned lot issues in tweets. In this occassion, PVP challenges Ganesh to prove some financial matters.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more