అటు పవన్ తో సినిమా..ఇటు తమిళ రీమేక్

By Srikanya

Soodhu Kavvum
హైదరాబాద్ :'బలుపు' సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది పీవీపీ సినిమా సంస్థ. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో తెలుగునాట విరివిగా సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఆ క్రమంలో కిడ్నాప్ డ్రామా నేపధ్యంలో రూపొందిన సూది కవ్వం రైట్స్ తీసుకున్నారు. 2013 లో సూది కవ్వం చిత్రం ఘన విజయం సాధించింది.

మరో ప్రక్క ఇదే సంస్ధ పవన్‌ కల్యాణ్‌తో ఓ చిత్రం రూపొందించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. పవన్‌ కూడా పీవీపీ సినిమాతో జత కట్టడానికి పచ్చ జెండా వూపేశారు. త్వరలో 'అత్తారింటికి దారేది' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు పవన్‌ కల్యాణ్‌. ఆ తరవాత 'గబ్బర్‌ సింగ్‌ 2' మొదలవుతుంది. ఆ తరవాతే ఈ సినిమా ఉంటుంది.

ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌కి తగిన కథ కోసం అన్వేషణ జరుగుతోంది. త్వరలోనే దర్శకుడు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటిస్తారు. ఈ చిత్రానికి దర్శకుడు పవన్ సూచించనున్నాడని సమాచారం. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రారంభమైందని, ఎంటర్టైన్మెంట్ తో కూడిన కథతో ఈ చిత్రం రూపొందనుందని చెప్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X