»   » మహేష్ తో సినిమా చేస్తున్నామని అఫీషియల్ గా ప్రకటన

మహేష్ తో సినిమా చేస్తున్నామని అఫీషియల్ గా ప్రకటన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు హీరోగా , శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత పి.వి.పి అందించిన చిత్రం బ్రహ్మోత్సవం. ఆ చిత్రం డిజాస్టర్ అయ్యిన తర్వాత మరో సినిమా అదే బ్యానర్ లో మహేష్ చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.

అలాగే ఆ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారని చెప్పుకున్నారు. అయితే అది రూమర్సే అని చాలా మంది కొట్టిపారేశారు. అయితే మహేష్ తో తాము సినిమా చేస్తున్నామని నిర్మాత పొట్లూరి వరప్రసాద్ అఫీషియల్ గా ప్రకటించారు.

PVP gives clarity on Mahesh's film

ప్రసాద్‌ వి.పొట్లూరి మాట్లాడుతూ''మా సంస్థ నుంచి ఈ ఏడాది నాలుగు చిత్రాలొచ్చాయి. అందులో మూడు విజయం సాధించడం ఆనందంగా ఉంది. మహేష్‌బాబుతో త్వరలోనే ఓ సినిమా తెరకెక్కిస్తాం. రానా 'ఘాజీ'ని ఫిబ్రవరి 24న విడుదల చేస్తున్నాం. ఓంకార్‌తో తెరకెక్కిస్తున్న 'రాజుగారి గది 2' నాగార్జున కథానాయకుడిగా నటిస్తారు''అన్నారు

పివిపి సంస్థ నుంచి వచ్చిన చిత్రం 'కాష్మోరా'. కార్తి, నయనతార జంటగా నటించారు. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా ప్రసాద్‌ వి.పొట్లూరి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారు.

PVP gives clarity on Mahesh's film

అలాగే..కాన్సెప్ట్‌తో చేసే సినిమాలకంటే కాంబినేషన్‌లపై ఆధారపడి వచ్చే సినిమాలకు మార్కెట్‌ బాగుంటుంది. అలాగని పెద్ద సినిమాలకు రిస్క్‌ ఉండదని కాదు. సినిమా చిన్నదైనా, పెద్దదైనా నిర్మాతలు, సాంకేతికవర్గం పడే కష్టంలో ఎలాంటి మార్పూ ఉండదు అన్నారు.

కాశ్మోరా గురించి చెప్తూ... ''అంచనాలు పెంచకూడదన్న ఉద్దేశంతోనే విడుదలకు ముందు హడావుడి చేయలేదు. సినిమాలో విషయం ఉంటేనే ప్రజలకు చేరుతుంది. ఈ విషయాన్ని మా గత చిత్రాలు రుజువు చేశాయి. 'కాష్మోరా'లో విజువల్‌ ఎఫెక్ట్స్‌ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. వినోదం అందరికీ నచ్చింది. ఇంటిల్లిపాదీ చూడాల్సిన సినిమా ఇది. చిన్న పిల్లలకు ఇంకా బాగా నచ్చుతుంది''అన్నారు.

English summary
PVP confirmed that in 2017 they will start the shooting of Mahesh's film under Vamsi Paidipally.After the disastrous losses incurred by Brahtmosavam, Mahesh wanted to give PVP a chance to recover, hence this new project.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu