»   » క్వీన్ చుట్టూ ఎన్ని వివాదాలో: తమన్నా, కాజల్, కాకుండా ఇంకా ఎవరు??

క్వీన్ చుట్టూ ఎన్ని వివాదాలో: తమన్నా, కాజల్, కాకుండా ఇంకా ఎవరు??

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ నటి 'కంగానా రనౌత్' ప్రధాన పాత్రలో నటించిన 'క్వీన్' చిత్రం గుర్తుండే ఉంటుంది కదా.. 2013లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అంతేగాకుండా రూ. 100 కోట్ల క్లబ్ లో చేరి 'కంగానా'కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాని తెలుగులో, తమిళ భాషల్లో రీమేక్ చేయడానికి ఫేమస్ తమిళ నటుడు, డైరెక్టర్ అయిన త్యాగరాజన్ రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్న సంగతి విదితమే.

త్యాగరాజన్

త్యాగరాజన్

క్వీన్ సినిమాని తెలుగులో, తమిళ భాషల్లో రీమేక్ చేయడానికి ఫేమస్ తమిళ నటుడు, డైరెక్టర్ అయిన త్యాగరాజన్ రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్న అప్పటి నుంచీ ఈ సినిమాలో కంగన పాత్ర రీ క్రియేట్ చేసే హీరోయిన్ కోసం అన్వేశించారు.... మొత్తానికి తమిళ, తెలుగు వెర్షన్ల‌కు తమన్నాను.. మలయాళానికి అమలా పాల్ ను.. కన్నడకు పారుల్ యాదవ్ ను కథానాయికలుగా అనుకున్నారంటూ వార్తలు వచ్చాయి.

మిల్కీబ్యూటీ తమన్నా

మిల్కీబ్యూటీ తమన్నా

ఇందులో క్వీన్‌ పాత్రలో నటించే నటి ఎవరన్న విషయం ఆసక్తిగా మారింది.చివరకు మిల్కీబ్యూటీ తమన్నాను క్వీన్‌ను చేయాలని నిర్మాత వర్గం భావించింది. అయితే ఈ అమ్మడు అధిక పారితోషికం డిమాండ్‌ చేయడంతో వేరే హీరోయిన్‌ కోసం అన్వేషణ జరుగుతున్నట్లు సమాచారం.

ఎక్కువ రెమ్యునరేషన్ అడిగిందట

ఎక్కువ రెమ్యునరేషన్ అడిగిందట

అయితే కోలీవుడ్ టాక్ ఏంటంటే ఈ సినిమా కోసం తమన్నా ఎక్కువ రెమ్యునరేషన్ అడిగిందట. అందుకే ఆ సినిమా పట్టాలెక్కలేదని అంటున్నారు. ఏ తమన్నా కాకపోతే మరో హీరోయిన్ అందుకు సరిపోదా అంటే మాత్రం మాట్లాడట్లేదు. తమన్నానే చేయాలని మేమే తీయాలి అన్న తీరున ఉంది. రేవతి డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమా కేవలం తమన్నా వల్లే ఆగిందని అందరు అనుకుంటున్నారు. మరి అంతటి క్రేజీ ప్రాజెక్ట్ కోసం అమ్మడు కాస్త కూస్తో తగ్గొచ్చు కదా అని అందరి మాట.

కాజల్‌అగర్వాల్‌

కాజల్‌అగర్వాల్‌

మరో పక్క కాజల్‌అగర్వాల్‌ను క్వీన్‌గా ఎంపిక చేసినట్లు సోషల్‌మీడియాల్లో ప్రచారం జరుగుతోంది.తమిళ చిత్ర పరిశ్రమలో చాలా నెలల తర్వాత మళ్లీ క్వీన్ అంశం తెరపైకి వచ్చింది. కాజల్ అగర్వాల్‌ను తమిళ రీమేక్‌లో తీసుకొన్నట్టు వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నది. తెలుగు, తమిళ భాషల్లో వరుస విజయాలను చేజిక్కించుకొంటున్న కాజల్ అయితే సినిమాకు మంచి హైప్ వస్తుందని, కమర్షియల్‌గా కూడా సానుకూలత ఉండే అవకాశం ఉంటుందని నిర్మాత అభిప్రాయపడినట్టు సమాచారం.

రమేశ్‌ అరవింద్‌

రమేశ్‌ అరవింద్‌

ఇక్కడి వరకూ అంతా సజావుగానే సాగింది కానీ...ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్ర తమిళం, కన్నడం భాషల్లో నటుడు రమేశ్‌ అరవింద్‌ దర్శకత్వం వహిస్తున్నారనే ప్రకటన వెలువడింది. అంతే కాదు ఈ చిత్రానికి "వానిల్‌ తేడి నిండ్రేన్‌" అనే టైటిల్‌ నిర్ణయించి హీరోయిన్‌ ఎంపిక జరగకుండానే చిత్రీకరణ ప్రారంభించారు.

కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు

కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు

నాజర్‌ పాల్గొన్న కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. కాగా గోల్డెన్‌ క్లబ్‌ ఫిలింస్‌ అనే లండన్‌కు చెందిన ప్రొడక్షన్‌ సంస్థ యూనిట్‌కు షాక్‌ ఇచ్చే ప్రకటన విడుదల చేసింది. క్వీన్‌ చిత్ర దక్షిణాది హక్కులు తమకు చెందినవని, తాను స్టార్‌ మూవీస్‌ సంస్థ అధినేత త్యాగరాజన్‌ను భాగస్వామిగా చేర్చుకున్నామని పేర్కొన్నారు.

షాక్‌కు గురయ్యారట

షాక్‌కు గురయ్యారట

ఈ చిత్రంలో నటించే తారల ఎంపిక జరుగుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో క్వీన్‌ చిత్రం తమిళం, కన్నడం భాషల్లో చిత్రీకరణ జరుపుకుంటోందన్న విషయం తెలిసి తాము షాక్‌కు గురయ్యామని పేర్కొన్నారు.క్వీన్‌ చిత్ర దక్షిణాది రీమేక్‌ హక్కులను తాము బ్రిటీష్‌ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌(బీఎఫ్‌ఐ)లో రిజిస్టర్‌ చేసినట్లు తెలిపారు.

క్వీన్‌ చిత్రం చిక్కుల్లో

క్వీన్‌ చిత్రం చిక్కుల్లో

ఇందులో నటీనటులను తాము ఎంపిక చేసే పనిలోనే ఉన్నామని, అలాంటిది తమను సంప్రదించకుండా చిత్రీకరణ జరపడం తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఈ వ్యవహారం గురించి తదుపరి ప్రకటనను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. దీంతో క్వీన్‌ చిత్రం చిక్కుల్లో పడినట్లైంది.

English summary
the Tamil version of the film Queen made headlines when Tamannaah opted out of the project. It was then said that the film will go on floors in May after the casting issues are sorted out.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more