twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాళ్లకే కొమ్ము కాస్తున్నారన్నారు!.. ఇప్పుడేమైంది?: 'అజ్ఞాతవాసి'పై అటు నుంచి కూడా ప్రశ్నలు!

    |

    సినిమాలను, రాజకీయాలను కులం కార్డు ఎంతలా ప్రభావితం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు రంగాల్లో ఏ కులాల డామినేషన్ ఉందని అడిగితే.. తడుముకోకుండా సమాధానాలు వచ్చేస్తాయి.

    Recommended Video

    ఆ విషయంలో పవన్.. బాలయ్య.. ఇద్దరూ తగ్గట్లేదు..!

    తెగేదాకా వచ్చింది: 'కత్తి'కి కోన వెంకట్ డెడ్ లైన్?, ఆరోజు ఏం చేస్తారు?; సీన్ లోకి వేణుమాధవ్..తెగేదాకా వచ్చింది: 'కత్తి'కి కోన వెంకట్ డెడ్ లైన్?, ఆరోజు ఏం చేస్తారు?; సీన్ లోకి వేణుమాధవ్..

    ఆ రెండు సామాజిక వర్గాల మధ్య విభేదాలూ బహిరంగ సత్యమే. మొన్నామధ్య 'కమ్మ' సామాజిక వర్గానికే నంది అవార్డులను కట్టబెట్టారని 'కాపు' సామాజిక వర్గం వారు దుమ్మెత్తిపోశారు. ఇప్పుడు వాళ్లను విమర్శించడానికి 'కమ్మ' సామాజిక వర్గానికి కూడా టైమ్ వచ్చినట్లుంది.

     ఎన్ని 'షో'లైనా వేసుకోండి..:

    ఎన్ని 'షో'లైనా వేసుకోండి..:

    ఏపీలో 'అజ్ఞాతవాసి' ప్రీమియర్, బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిది. అది కూడా ఎన్ని 'షో'లు వేసుకుంటే.. అన్ని 'షో'లు వేసుకోమని. ఈ లెక్కన తొమ్మిదో తేదీ అర్థరాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం 10గం. వరకు నాన్ స్టాప్ 'షో'లు పడుతూనే ఉంటాయి.

     ఇప్పుడేమంటారు?:

    ఇప్పుడేమంటారు?:

    గతేడాది ప్రకటించిన నంది అవార్డులపై మెగా కాంపౌండ్ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఒకానొక దశలో అవి నంది కాదు 'నందిమూరి' అవార్డులు అంటూ బాలకృష్ణపై పరోక్షంగా విమర్శలు చేశారు.

    ప్రభుత్వం ఒక సామాజిక వర్గానికే కొమ్ము కాస్తుందని ఆరోపించారు. కానీ గతంలో మరే సినిమాకు ఇన్ని ప్రీమియర్, బెనిఫిట్ 'షో'లకు అనుమతినివ్వని ప్రభుత్వం.. ఇప్పుడు 'అజ్ఞాతవాసి'కి ఇవ్వడంతో అటువైపు నుంచి కూడా ప్రశ్నలు మొదలయ్యాయి.

    సహాయం చేస్తే.. లింకేనా?, కాస్త ఎదగరా బాబు: కత్తికి బన్నీ కౌంటర్, సంజన కూడా!సహాయం చేస్తే.. లింకేనా?, కాస్త ఎదగరా బాబు: కత్తికి బన్నీ కౌంటర్, సంజన కూడా!

    పక్షపాతమే ఉంటే..:

    పక్షపాతమే ఉంటే..:

    మెగా కాంపౌండ్ నుంచి నంది అవార్డులపై బన్నీ వాసు గట్టిగానే స్పందించారు. పక్షపాతంగా ఒక సామాజిక వర్గానికే అవార్డులు ఇచ్చారని ఆరోపించారు. కానీ ప్రభుత్వానికి నిజంగా పక్షపాతమే ఉంటే.. ఇప్పుడు 'అజ్ఞాతవాసి'కి ఇన్ని 'షో'లకు అనుమతినిచ్చేదా? అని అవతలి వైపు నుంచి ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

    అమాంతం పవన్ కాళ్ల మీద పడ్డ ఫ్యాన్!: కొద్దిసేపు అంతా బ్లాంక్.., అదీ 'పవర్' గొప్పతనంఅమాంతం పవన్ కాళ్ల మీద పడ్డ ఫ్యాన్!: కొద్దిసేపు అంతా బ్లాంక్.., అదీ 'పవర్' గొప్పతనం

     గతంలో ఏ సినిమాకు ఇవ్వని రీతిలో..:

    గతంలో ఏ సినిమాకు ఇవ్వని రీతిలో..:

    గతంలో ఏ సినిమాకు ఇవ్వని రీతిలో 'అజ్ఞాతవాసి'కి బెనిఫిట్, ప్రీమియర్ షోలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే ఇదంతా పవన్ పట్ల అభిమానంతో చేశారా?.. లేక ఇందులో రాజకీయ ప్రయోజనాలేమైనా ముడిపడి ఉన్నాయా? అన్న చర్చ కూడా జరుగుతోంది.

    కలెక్షన్స్ పండగే..:

    కలెక్షన్స్ పండగే..:

    ఇటు తెలంగాణలోనూ రోజుకు ఏడు 'షో'లు వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో రెండు రాష్ట్రాల్లో కలిపి 'అజ్ఞాతవాసి' ఓపెనింగ్ కలెక్షన్స్ దుమ్ములేపడం ఖాయం.

    రెండు రోజుల వ్యవధిలో వేరే సినిమాలు విడుదలవుతుండటంతో.. ఆ రెండు రోజులు తొంభై శాతం థియేటర్లలో 'అజ్ఞాతవాసి'నే ప్రదర్శించనున్నారు. ఈ లెక్కన 'అజ్ఞాతవాసి' ఓపెనింగ్స్ రికార్డులు బద్దలు చేయడం ఖాయం.

    English summary
    The government has granted permission for special shows for Agnyaathavaasi movie. But a question is raising from Kamma community?
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X