»   » రెండు దున్నపోతులు.... సినిమా బంద్ ఎందుకు ఆపారంటూ ఆర్ నారాయణ మూర్తి ఫైర్

రెండు దున్నపోతులు.... సినిమా బంద్ ఎందుకు ఆపారంటూ ఆర్ నారాయణ మూర్తి ఫైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

క్యూబ్, యూఎఫ్ఓ లాంటి డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు బయటి రాష్ట్రాల్లో, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారీ రేట్లు వసూలు చేస్తుండటాన్ని నిరసిస్తూ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు థియేటర్ల బంద్ కు తెరలేపడం, దాదాపు ఆరు రోజుల పాటు సాగిన సినిమా థియేటర్ల బంద్ తాత్కాలిక పరిష్కారంతో మార్చి 8న ముగియడం తెలిసిందే. నేటి(మార్చి 9) నుండి థియేటర్లు తెరుచుకున్నాయి, సినిమాలు ఆడుతున్నాయి. అయితే సమస్య పూర్తిగా పరిష్కారం కాకముందే బంద్ ఆపడంపై విప్లవ చిత్రాల నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి ఫైర్ అయ్యారు.

ఏం సాధించారని బంద్ ఆపారు?

ఏం సాధించారని బంద్ ఆపారు?

ఇపుడు ఏ డిమాండ్స్ అయితే సాధించామని చెబుతున్నారో అది నిజంగా సాధించినవి కావు..... 10 నుండి 15 వేలు వసూలు చేస్తున్నారు. కేవలం రెండు వేలు తగ్గిస్తే సంతృప్తి పడిపోయి బంద్ ఆపడం ఎందుకు? అదేదో థియేటర్లు బంద్ చేయకుండా బిగినింగులోనే అల్లు అరవింద్, సురేష్ బాబు, జెమిని కిరణ్ మాట్లాడి ఉంటే ఈ సమస్య ఆ నాడే తేలిపోయి ఉండేది కదా. కానీ బంద్ ప్రకటించి అందరినీ ఇబ్బంది పెట్టారు. కొండను తవ్వి ఎలకను కూడా పట్టలేదనే బాధతో ఈ రోజు ఈ మీటింగ్ పెట్టాను... అని ఆర్ నారాయణ మూర్తి తెలిపారు.

చిన్న సినిమాలను దెబ్బతీశారు, పెద్ద సినిమాలకు బంద్ లేదా?

చిన్న సినిమాలను దెబ్బతీశారు, పెద్ద సినిమాలకు బంద్ లేదా?

పెద్ద సినిమాల సమయంలో బంద్ ప్లాన్ చేయలేదు. చిన్న సినిమాలు రిలీజ్ అయ్యే సమయంలోనే బంద్ చేశారు. మా చిన్న సినిమాల దౌర్భాగ్యం ఏమిటంటే... పబ్లిక్ హాలిడేస్ లో మాకు థియేటర్లు దొరకవు. అన్నీ పెద్ద వాళ్లు ప్లాన్ చేసుకుంటారు. చివరకు ఎగ్జామ్స్ టైమ్‌లోనో, వర్షాకాలంలో పెద్ద వారు దయతలిస్తే మా సినిమాలు రిలీజ్ అవుతాయి. పెద్ద సినిమాల సమయంలో బంద్ ప్లాన్ చేసి ఉంటే..... క్యూబ్, యూఎఫ్ఓ సంస్థలు తప్పకుండా దిగి వచ్చేవి అని ఆర్ రానాయణ మూర్తి అన్నారు.

మనలో ఐక్యత లేదు

మనలో ఐక్యత లేదు

వారి బిజిజెస్ కంభస్థలం మీద దెబ్బ కొట్టినపుడే డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు దిగివస్తారు. భారీ సినిమాల సమయంలో వారిని దెబ్బ కొట్టాలి. తమిళనాడులో, కర్నాటకలో ఇంకా బంద్ సాగుతోంది. మనమే బంద్ విరమించాం, ఈ మాత్రం దానికి బంద్ ఎందుకు మొదలు పెట్టారు? అని ఆర్ నారాయణ మూర్తి ప్రశ్నించారు.

ఎన్టీఆర్, ఏఎన్ఆర్, దాసరి, రామానాయుడు బాగా డీల్ చేసేవారు

ఎన్టీఆర్, ఏఎన్ఆర్, దాసరి, రామానాయుడు బాగా డీల్ చేసేవారు

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రామానాయుడు, దాసరి నారాయణ రావు లాంటి పెద్దలు చాలా గొప్పగా పెద్దరికం వహించారు. సమస్యలు పరిష్కరించారు. సమస్య వస్తే వెంటనే క్లియర్ చేశారు. పరిశ్రమ బావుండాలి, అందరూ బావుండాలని కోరుకున్నారు. కానీ ఇపుడు మేమే బావుండాలి అనే వర్గాలు వచ్చి రెండు వర్గాల మధ్య సగటు సామాన్య నిర్మాతలు నలిగిపోతున్నారు.... అని ఆర్ నారాయణ మూర్తి అన్నారు.

అపుడు మాకు సపోర్టు ఇవ్వలేదు

అపుడు మాకు సపోర్టు ఇవ్వలేదు

థియేటర్ల లీజు సిస్టం ఎత్తివేయాలని ఆ రోజు నట్టికుమార్, రామకృష్ణగౌడ్, నేను, సురేందర్ రెడ్డిగారు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నిరాహార దీక్షచేశాం. దాసరి నారాయణరావుతో సహా పరిశ్రమలో చాలా మంది సపోర్టు చేశారు. గవర్నమెంటుతో కూడా చర్చలు జరిగాయి. కానీ మేము సక్సెస్ కాలేక పోయాం.... అందుకు కారణం మాలో ఐక్యత లేక పోవడం వల్లే, ఇపుడు కూడా అలాంటి ఐక్యత లేక పోవడం వల్లే ఇలా జరిగింది అని నారాయణ మూర్తి అన్నారు.

కంటతడి పెట్టుకున్న ఆర్ నారాయణ మూర్తి...?
అన్నింటిలో వారు ఉన్నారు

అన్నింటిలో వారు ఉన్నారు

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రొడ్యూసింగ్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిటర్లు, డిజిటల్ ప్రొవైడర్లలో పార్టనర్ షిప్ చేస్తుంది మన నిర్మాతలే. అన్నీ మీరే అవ్వడం వల్ల, మాలో ఐక్యత లేక పోవడం వల్ల మేజర్ సెక్టర్ మాతో రాక పోవడం వల్ల ఏ సమ్మె కూడా సక్సెస్ కావడం లేదు.... అని ఆర్ నారాయణ మూర్తి అన్నారు.

రెండు దున్నపోతులు కొట్లాడుతుంటే

రెండు దున్నపోతులు కొట్లాడుతుంటే

సినిమా పరిశ్రమ కొద్ది మంది కొరకు, కొద్ది మంది చేత పరిపాలించబడుతున్న పరిశ్రమ అయిపోయింది. రెండు దున్నపోతులు కొట్లాడుతుంటే లేగదూడలు అంబా అంబా అని ఏడుస్తున్నట్లు మా పరిస్థితి తయారైంది. మమ్మల్ని ఎవరు రక్షిస్తారు? ఇక రక్షించాల్సింది గవర్నమెంటే. దయచేసి రెండు రాష్ట్రాల సినిమాటోగ్రపీ మంత్రులు కల్పించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.... అని ఆర్ నారాయణ మూర్తి అన్నారు.

వారికి అవకాశం కల్పించండి

వారికి అవకాశం కల్పించండి

అనేక కంపెనీలు 2 వేలకు, రూ. 2500లకు ఇస్తాం అంటున్నారు. ఇపుడు పాతుకు పోయిన క్యూబ్, యూఎఫ్ఓ కంపెనీలు వాటిని రానీయడం లేదు. మాలో ఐక్యత లేదు. కేవలం 2 వేల కోసం బంద్ విరమించారేంటి? గవర్నమెంటు ఈ విషయంలో కల్పించుకోవాలి, ఇతర సర్వీస్ ప్రొవైడర్లకు కూడా అవకాశం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి అని ఆర్ నారాయణ మూర్తి కోరారు.

English summary
Narayana Murthy Fires On Suresh Babu & Allu Aravind about Theaters Strike Called Off.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu