For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆర్.నారాయణమూర్తి బ్రేకప్ స్టొరీ.. దేవదాసు కంటే దారుణం.. ప్రేయసికి కన్నీటి వీడ్కోలు చెప్పి..

  |

  పీపుల్ స్టార్ ఆర్.నారాయణమూర్తి అంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన గౌరవం. ఇక ఎర్రన్న అంటూ మరి కొందరు ప్రేమగా పిలుచుకుంటారు. ఆయన ఎక్కడ కనిపించినా కూడా సీఎం అయినా సరే ముందుగా వచ్చి పలకరిస్తుంటారు. ఎర్రన్న డబ్బు కోసం కూడా ఏనాడు ఆశపడలేదు. ఇప్పటికి కూడా అదే తరహా మంచి సినిమాలను చేస్తున్నారు. ప్రజా సమస్యలు ఏవైనా సరే తనదైన శైలిలో స్పందిస్తుంటారు. ఇక ఆయన పెళ్లి చేసుకోలేదని అందరికి తెలిసిందే. అయితే ఆర్.నారాయణమూర్తికి కూడా ఒక రియల్ ఎమోషనల్ లవ్ స్టొరీ ఉంది.

  లెఫ్ట్-ఓరియెంటెడ్ సినిమాలు

  లెఫ్ట్-ఓరియెంటెడ్ సినిమాలు

  ఆర్.నారాయణమూర్తి అనగానే ఈ తరం జనరేషన్ లో కూడా ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఆయనే దర్శకుడు నటుడు నిర్మాతగా సినిమాలను స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. సమాజం యొక్క దిగువ స్థాయిల దోపిడీని ఎదుర్కొనే లెఫ్ట్-ఓరియెంటెడ్ సినిమాలను ఎక్కువగా తెరకెక్కిస్తుంటారు.

  సామాజిక సమస్యలను హైలెట్ చేస్తూ

  సామాజిక సమస్యలను హైలెట్ చేస్తూ

  సినిమా ప్రపంచంలో ఎన్ని మార్పులు వచ్చినా కూడా నారాయణమూర్తి సినిమాల్లో మాత్రం పెద్దగా మార్పులు రాలేవు. సిద్ధాంతాలకు కట్టుబడి ఒక ప్రజా కళాకారుడిగా బాద్యతగా సినిమాలు చేస్తుంటారు. నిరుద్యోగం, క్రోనీ క్యాపిటలిజం, అభివృద్ధి చెందుతున్న దేశాలలో సమస్యలు, పర్యావరణ సమస్యలు పునరావాస సమస్యలు, భూ సమస్యలు, రాజకీయ గందరగోళం వంటి సామాజిక సమస్యలను హైలెట్ చేస్తూ అందులోనే పరిష్కారం కూడా చూపిస్తారు.

  దాసరి శిష్యుడిగా..

  దాసరి శిష్యుడిగా..

  ఎర్ర సైన్యం, చీమల దండు, దళం, చీకటి సూర్యుడు, ఊరు మనదిరా, వేగు చుక్కలు వంటి ఎన్నో సినిమాలు అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ సెట్ చేశాయి. ఆర్.నారాయణమూర్తి దాసరి నారాయణరావు శిష్యుడిగా అర్ధరాత్రి స్వతంత్రం అనే సినిమాతో నటుడిగా వెండితెరకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమానే భారీ విజయాన్ని అందుకంది.

   కోట్లు సంపాదించినా

  కోట్లు సంపాదించినా

  ఏళ్ళు గడిచినా కూడా ఆర్.నారాయణమూర్తి సినిమాలు అదే తరహా సందేశాలను ఇస్తున్నాయి. ఇక ఆయన జీవితంలో కోట్లు సంపాదించినా కూడా ఏనాడు రూపాయి వెనకేసుకోలేదు. వచ్చిన డబ్బు చాలా వరకు పేద విద్యార్థుల చదువుల కోసం హెల్ప్ చేశారు. ఆ విధంగా చాలా డబ్బును ఆయన సునాయాసంగా వదులుకున్నారు

  నారాయణమూర్తి జీవితంలో కూడా లవ్ స్టొరీ

  నారాయణమూర్తి జీవితంలో కూడా లవ్ స్టొరీ

  ఆర్.నారాయణమూర్తి ఆస్తులు కూడా సరిగ్గా సంపాదించుకోలేదు. ఇక ఆయన మొదటి నుంచి సోలో బ్రతుకే సో బెటర్ అని ఆలోచనతో ముందుకు వెళుతున్నారు. అయితే నారాయణమూర్తి జీవితంలో కూడా ఒక లవ్ స్టొరీ ఉందట. డిగ్రీ చదువుకున్న రోజుల్లోనే ఒక అమ్మాయిని ఎంతగానో ఇష్టపడ్డారట. ఆమె కూడా ఆర్.నారాయణమూర్తి సిద్దాంతాలను ఎంతగానో ఇష్టపడేవరట.

   గొప్పింటి అమ్మాయి అని తెలియడంతో

  గొప్పింటి అమ్మాయి అని తెలియడంతో

  కొన్నాళ్ళు ఆమెతో ప్రేమను కొనసాగించిన అనంతరం పెళ్లి కోసం ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి వెళ్లిన నారాయణమూర్తి.. ఆ అమ్మాయి గొప్పింటి అమ్మాయి అని తెలియడంతో నిర్ణయం మార్చుకున్నారట. తాను సినిమాలు అనుకుంటూ వెళితే జీవితం ఎలా ఉంటుందో తెలియదు. నేను చెట్టుకింద అయినా సరే పడుకుంటాను. కానీ తెలిసి తెలిసి ఆ అమ్మాయిని అలాంటి జీవితంలోకి తీసుకు రావడం కరెక్ట్ కాదని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారట.

  R Narayana Murthy About LB Sriram Greatness
  అమ్మాయి కూడా ఏడ్చేసింది..

  అమ్మాయి కూడా ఏడ్చేసింది..

  ఇక వెంటనే ఆమెతో మాట్లాడి నా జీవితం ఇలాంటిది నా వల్ల నువ్వు బాధపడడం నాకు ఇష్టం లేదు. నీ జీవితం బావుండాలని నేను కోరుకుంటున్నాను. నిన్ను మళ్ళీ కలవను. హ్యాపీగా పెళ్లి చేసుకో. నువ్వు సుఖంగా ఉండడమే నాకు కావాలి అని అమ్మాయితో చెప్పినప్పుడు ఏడ్చింది. ఇక నేను మద్రాస్ వెళ్లిపోయి ఆ అమ్మాయిని కొన్నాళ్ళు తలచుకుంటూ..జీవితం అలా బాధతో కొనసాగించాను అని మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనిపించలేదని ఆర్.నారాయణమూర్తి వివరణ ఇచ్చారు.

  English summary
  R. Narayana Murthy real love story and breakup details, Director, actor and producer R. Narayanamurthy is one of those who say that money is not the main thing in the world of cinema and that values are great. Everyone affectionately calls him Erranna. However, his recent arrest by the police has become a hot topic.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X