»   » ఆ సినిమా చూడని తెలుగువాడు పాపం చేసినట్లే

ఆ సినిమా చూడని తెలుగువాడు పాపం చేసినట్లే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ స్టేట్మెంట్ ఇచ్చింది మరెవరో కాదు..ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ. అంతగా చూడకపోతే పాపం చేసినట్లయ్యే ఆ చిత్రం 'వీర తెలంగాణ'. ఆర్.నారాయణ మూర్తి హీరోగా, ఆయన దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో వేడుకల్లో ఇలా గోపాలకృష్ణ మాట్లాడారు. మహాభారత పోరాటం కంటే తెలంగాణ సాయుధ పోరాటం తక్కువేమీ కాదనీ, 'వీర తెలంగాణ' చూడకపోతే తెలుగువాడు పాపం చేసినట్టేననీ ఆయన అన్నారు. ఇక ఇది విన్న నారాయణ మూర్తి కూడా ఓ రేంజిలో తన సినిమా గురించి చెబుతూ.."కృష్ణగారికి 'అల్లూరి సీతారామరాజు', రిచర్డ్ అటెన్‌బరోకి 'గాంధీ', రాజ్‌కుమార్ సంతోషికి 'భగత్‌సింగ్' ఎలాగో నాకు 'వీర తెలంగాణ' అలా పేరు తీసుకొస్తుందనే నమ్మకంతో ఉన్నా అన్నారు. స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై నారాయణమూర్తి నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన 'వీర తెలంగాణ' ఆడియో సీడీలు, క్యాసెట్లు ఆదిత్యా మ్యూజిక్ ద్వారా మార్కెట్లో విడుదలయ్యాయి. ఇక ఇలా వీరిద్దరూ స్టేజీపై వీర రేంజిలో 'వీర తెలంగాణ' గురించి చెపుతూంటే క్రింద ఉన్నవారు ఏంటి ఆడియో పంక్షన్ లో పొగడటం విన్నాం కానీ...మరీ ఇంతలానా అని నోరు వెళ్లబెట్టారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu