ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకునేంత పిరికివాడు కాదే

By Srikanya

హైదరాబాద్: ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, పెళ్లి తర్వాత ఆయన జీవితం ఎలా ఉందనేది తనకు తెలియదని సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయిక్ అన్నారు. ఉదయ్ కిరణ్ చనిపోయాడంటే నమ్మడం చాలా కష్టంగా ఉందని ఆయన అన్నారు.

అలాగే ఉదయ్ కిరణ్ కు చాలా మంది అభిమానులు ఉన్నారని ఆయన తెలిపారు. ఫ్యాన్స్ ఇప్పటికి తనకు ఫోన్ చేసి ఉదయ్ కిరణ్ గురించి అడుగుతూంటారని తెలిపారు. అతను ఆత్మహత్య చేసుకుని చాలా పెద్ద తప్పు చేసాడనిపిస్తోందని చెప్పుకొచ్చారు. తనకున్న అభిమానులకు అన్యాయం చేసాడని ఆర్పీ పట్మాయిక్ ఆవేదనతో అన్నారు.

R.P Patnayak about Uday Kiran Death

ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక జూబ్లీహిల్స్‌లోని తన సొంత ప్లాట్‌లో ఉరి వేసుకుని అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆయనను హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఉదయ్‌కిరణ్ మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు.

తను నటించిన తొలి సినిమా 'చిత్రం'. 'నువ్వునేను' సినిమాలో ఉత్తమ నటనకు గాను 2011లో ఫిలింఫేర్ అవార్డు పొందారు. నువ్వునేను, మనసంతానువ్వే, శ్రీరాం చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఉదయ్‌కిరణ్ తమిళంలో కూడా నటించాడు. మొత్తం 19 సినిమాలలో నటించాడు.

ఉదయ్‌కిరణ్‌ను జూబ్లీహిల్స్ అపోలకు తరలించారు.హీరో తరుణ్, శ్రీకాంత్ మరియు తదితరులు ఆస్పత్రికి వచ్చారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ఉదయ్‌కిరణ్ ఆత్మహత్య చాలా విషాదకరం అని , ఎలాజరిగిందో తెలియదుఅని, స్నేహితుల ద్వారా తెలిసిందని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X