»   » ఈ రోజే ఆర్పీ పట్నాయిక్ కు అగ్ని పరీక్ష, అహంకారి ముద్ర

ఈ రోజే ఆర్పీ పట్నాయిక్ కు అగ్ని పరీక్ష, అహంకారి ముద్ర

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గాయకుడుగా కెరీర్ మొదలెట్టి, తర్వాత శ్రీను వాసంతి లక్ష్మి చిత్రంతో నటుడుగా తనలోని మరో యాంగిల్ ని పరిచయం చేసిన ఆర్పీ అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత దర్శకుడుగానూ మారి చిత్రాలు రూపొందించారు కానీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు మరోసారి తనేంటో ప్రూవ్ చేసుకోవటానికి ఈ రోజు మనముందుకు వస్తున్నాడు.

ఈ సారి 'తులసీదళం' చిత్రానికి నటన, సంగీతం, దర్శకత్వం, నిర్మాణం... ఇలా నాలుగు బాధ్యతలను భుజాలపై వేసుకొన్నారు. శుక్రవారం 'తులసీదళం' విడుదలవుతోంది. ఓ రకంగా చెప్పాలంటే ఈ సినిమా ఫలితం మీదే ఆర్పి తదుపరి కెరీర్ ఆధారపడి ఉంటుంది. మరి భాక్సాఫీస్ ఏం తీర్పు ఇవ్వనుందో చూడాలి.


R.P Patnayak's Tulasidalam on 11th March

ఆర్పీ మాట్లాడుతూ... ''ఇప్పటివరకూ తెరపై చూడని కొత్త ప్రేమకథని హారర్‌ నేపథ్యంలో చూపించాలనుకొన్నా. అదే ఈ 'తులసీదళం'. హారర్‌ అంటే చీకటి, భయం అనుకుంటున్నారు. నేను ఈ చిత్రాన్ని వెలుగులో తీశా. ప్రేమ అనేది తులసీదళం అంత పవిత్రమైంది. అందుకే ఆ పేరు పెట్టాం'' అన్నారు.


ఇక ''చేతికందిన సినిమాలన్నీ చేసేసి సంఖ్య పెంచుకోవడం నాకిష్టం ఉండదు. ఎప్పుడూ కొత్తగా ఆలోచించడం ఇష్టం. అలాంటి కథలొచ్చినప్పుడే పనిచేస్తా అవకాశాల కోసం ఎవరిచుట్టూ తిరగను. నా కథే కథానాయకుడు. కథల్ని బట్టే నా చిత్రాల్లో హీరోలు. కాబట్టే నా చిత్రాల్లో స్టార్ హీరోలు కనిపించరు. ఇలా ఆలోచించడం వల్లే నాపై కొందరు అహంకారి అనే ముద్ర వేశారు అని చెప్పుకొచ్చారు''.


R.P Patnayak's Tulasidalam on 11th March

ఇక అప్పట్లో యండమూరీ వీరేంద్రనాద్ రచించిన తుళసీధళం నవలని, దాని ఆధారంగా వచ్చిన సినిమాగానీ, సిరీయల్ గాని ఎవరూ మర్చిపోరు. ఆ నవల చాలా ఉత్కంఠగా సాగిపోతుంది. సినిమా, సీరియల్ ఆ స్దాయిలో లేకపోవటంతో క్లిక్ అవ్వలేదు. ఇప్పుడు ఇదే టైటిల్ వస్తున్న సినిమా మరి ఏ స్దాయిలో ఓపినింగ్స్ రాబట్టుకుంటుందో చూడాలి.


ఈ సినిమాకు ఆర్‌.పి. పట్నాయక్‌ దర్శకత్వం వహిస్తుండగా, అనితా చౌదరి, దువ్వాసి మోహన్‌ మిగిలినవారు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ప్రపంచం అంతటా విడుదల చేస్తన్నారు. తెలుగు రాష్ఠ్రాలతో పాటు, యూ.ఎస్. ఆస్ట్ర్రేలియా మరియు గల్ఫ్ దేశాల్లో విడుదల చేస్తున్నారు.

English summary
R.P Patnayak's Tulasidalam releasing today (11th march). Apart from Telugu states and Karnataka there Will also be release in the US, Australia, Gulf aswell. Pl watch in the theatres to encourage a sincerely made movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu