twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సూపర్ స్టార్ సినిమా పోస్టర్ సైతం కాపీనే

    By Srikanya
    |

    షారూఖ్ ఖాన్‌, కరీనా కపూర్‌ జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'రా.వన్‌' సైంటిఫిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పోస్టర్స్ ఈ మధ్యనే రీసెంట్ గా విడుదలయ్యాయి. అయితే ఆ పోస్టర్ ఉన్నదున్నట్లుగా బ్యాట్ మెన్ బిగిన్స్ పోస్టర్ ని కాపీ కొట్టడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఇప్పటికే చిత్రం హీరో షారూఖ్ ఖాన్ తన తాజా చిత్రం రా వన్ ఓ హాలీవుడ్ చిత్రం ప్రేరణతో చేస్తున్నానని మీడియాతో అన్నారు.ఆ చిత్రం మరేదో కాదని ఎక్స్ మెన్ సిరీన్ అని అన్నారు.ఆ సినిమాలో పాయింట్ ని మాత్రమే తీసుకుని సైన్స్ పిక్షన్ గా సూపర్ హీరో మూవిగా తీర్చిదిద్దుకున్నామని రివిల్ చేసాడు.దాంతో ఈ పోస్టర్ చూసిన వారు ఇక సినిమా ఎలా ఉంటుందో అంటున్నారు. అయితే ఈ చిత్రం మాత్రం మార్కెట్లో సంచలనం క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం శాటిలైట్‌ హక్కులను స్టార్‌ టీవీ దక్కించుకుంది. దీనికోసం 40 కోట్ల రూపాయలు చెల్లించిందని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకు ముందు అమీర్‌ఖాన్‌ నటించిన 'త్రీ ఇడియట్స్‌' శాటిలైట్‌ రైట్స్‌ 36 కోట్ల రూపాయలకు అమ్ముడైంది.సాధారణంగా సినిమా విడుదలై మంచి హిట్‌ సాధించాకే, ఆ సినిమా ప్రసార హక్కులకి మంచి రేట్‌ లభిస్తుంది. అయితే తెలుగులో కొన్ని భారీ హిట్‌ చిత్రాలు 5-6 కోట్ల రూపాయలు అందుకున్నాయి. 'రా.వన్‌' చిత్రం ఆడియో రైట్స్‌ 12-15 కోట్ల రూపాయలు పలుకొచ్చని ఇండిస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.

    ఇక ఇన్‌ఫిల్మ్‌ బ్రాండింగ్‌ పేరిట మరో పది పదిహేను కోట్లు రాబట్టడం ఇటీవల కాలంలో బాలీవుడ్‌లో సాధారణ విషయమైపోయింది. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు తీసే చిత్రాలకే ఇది వర్తిస్తుందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. అంతేగాక విసిడి, హోం థియేటర్‌, ఇంటర్నెట్‌ వంటి మార్గాలలో మరో ఐదారు కోట్ల రూపాయలు 'రా.వన్‌'కు రావచ్చని తెలుస్తోంది. ఇదంతా లెక్కేస్తే...సినిమా విడుదలకు ముందే 64 కోట్లకు పైగా వసూళ్ళు నమోదు చేసుకుంటోంది. ఇక షారూఖ్ ... తనకు పిల్లల కోసం ఎప్పుటినుంచో ఓ చిత్రం చేయాలని కోరిక ఉందని, అందులో భాగమే ఈ చిత్రం రూపకల్పన అన్నారు.నేను నిజాయితీగా చెప్తున్నాను..ఎక్స్ మెన్ సిరీస్ నుంచే ప్రేరణ పొందాను అన్నారు. ఇక తాను డైరక్ట్ గా హాలీవుడ్ చిత్రం చేస్తానని అయితే ఆ చిత్రం తన కెరీర్ అతి గొప్ప చిత్రం కావాలని,అందరూ గుర్తు పెట్టుకునేలా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. యువతను ఆకర్షించేందుకు త్వరలో విడుదలకు సిద్ధమైన రా.వన్ చిత్రంలో కొన్ని సన్నివేశాలలో 3డీ టెక్నాలజీ ఉపయోగిస్తున్నట్టు బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ తెలిపారు. మంగళవారం రా.వన్ చిత్ర టైలర్ విడుదల సందర్భంగా ఈ విషయాన్ని షారుఖ్ మీడియాకు తెలిపారు. షూటింగ్ అనంతరం కూడా చిత్రాన్ని త్రీడి టెక్నాలజీలోకి మార్చడానికి చర్యలు చేపట్టామన్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రానికి అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించారు. కరీనాకపూర్ అర్జున్ రాంపాల్ ముఖ్య పాత్రల్ని పోషించారు. రా.వన్ అంటే రాండమ్ యాక్సెస్ వెర్షన్ అని అర్ధమని షారుఖ్ తెలిపారు.

    English summary
    Ra.One Official Poster has a close resemblance to the Batman Begins poster!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X