For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సెక్సీ హీరోయిన్.... స్కై డైవింగ్ (ఫొటోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్: కెరీర్లో సరైన హిట్లు లేక పోయినా తన హాట్ అండ్ సెక్సీ అందాలతో కుర్రకారు మనసుల్లో స్థానం సంపాదించుకున్న భామ హీరోయిన్ లక్ష్మీ రాయ్. ఎప్పుడూ ఏదో ఒక సంచలనం తో వార్తల్లో ఉండే ఆమె...తాజాగా...స్కై డైవింగ్ చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. 13 వేలు ఫీట్ ఎత్తులో ఆమె ఈ డైవింగ్ చేసింది. ఆ ఫొటోలు మీ కోసం ఇక్కడ ఇస్తున్నాం.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  లక్ష్మీ రాయ్ మాట్లాడుతూ... "ఇది చాలా భయపెట్టే అనుభవం. ప్లేన్ లోంచి జంప్ చేయటం అదీ 13,000 అడుగుల ఎత్తులోనుంచి అంటే ఊహించండి.. అలా దూకుతూంటే ప్రపంచం అంతా ఒకరి కంట్రోల్ లో ఉన్నట్లు అనిపించింది. నేను ఎప్పుడూ సాహసాలు అంటే ఇష్టపడతాను... ముఖ్యంగా స్కై డైవింగ్ అంటే మరీను. నన్ను నమ్మండి... నా జీవితంలో ఇది అరుదైన అనుభవం ," అన్నారామె.

  ఆ ఫొటోలు పై మీరూ ఓ లుక్కేయండి...

  అంత ఎత్తునుంచి

  అంత ఎత్తునుంచి

  13,000 అడుగుల ఎత్తు నుంచి లక్ష్మీ రాయ్ ఇలా దూకుతూ ఓ రకమైన అనుభూతిని పొందింది.

  సాహసం

  సాహసం

  లక్ష్మీరాయ్ కు సాహసాలు కొత్తేమీ కాదు. సాహసమంటే ముందుుంటుందామె. ఓ సాహస ప్రధానమైన చిత్రంలో చేయాలనేది ఆమె కోరిక.

  ఇలాంటివి చేస్తూనే ఉండాలి

  ఇలాంటివి చేస్తూనే ఉండాలి

  ఇలాంటి సాహసాలు జీవితంలో చేస్తూనే ఉండాలి అంటోంది లక్ష్మీ రాయ్. అప్పుడే కిక్ ఉంటుందని చెప్తోంది.

  పేరు మార్చుకుంది.

  పేరు మార్చుకుంది.

  ఇక పేర్లను ముందుకు, వెనుకకు మార్చుకోవడం నటీమణులకు కొత్త కాదు. లక్ష్మీరాయ్‌ కూడా ఇప్పుడు రాయ్‌ లక్ష్మీ అని పిలిపించుకుంటోంది. అలా ఎవరైనా తనను పిలిస్తే చాలా ఆనందంగా ఉందని చెబుతోంది.

   గాసిప్ లకు దూరంగా..

  గాసిప్ లకు దూరంగా..

  రాయ్‌ లక్ష్మీ మాట్లాడుతూ ‘‘ఇంతకు ముందు నా పేరు నిత్యం వార్తల్లో ఉండేది. ఎప్పుడూ ఏదో ఒక గాసిప్‌ నా గురించి షికారు చేస్తుండేది. కానీ ఈ మధ్య ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. గాసిప్‌ రూమ్‌కి దూరంగా ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. '' అని చెప్పకొచ్చింది.

  అభిమానులకు అందుబాటులో

  అభిమానులకు అందుబాటులో

  సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్స్‌ ద్వారా నా అభిమానులకు అందుబాటులో ఉన్నాను. నేను చెప్పాల్సిన వివరాలను స్పష్టంగా చెబుతున్నప్పుడు ఇక గాసిప్స్‌కి తావుండదు. ఒక్క మాటలో చెప్పాలంటే గాసిప్స్‌కి నేను ఛాన్స్‌ ఇవ్వట్లేదు

  తనకు నచ్చిన పాత్రల గురించి మాట్లాడుతూ....

  తనకు నచ్చిన పాత్రల గురించి మాట్లాడుతూ....

  ‘‘పూర్తిస్థాయి దెయ్యం సినిమాలో నటించాలని ఉంది. ఇతరులను ఎంటర్‌టైన్‌ చేయగలననే విషయం తెలుసు. కానీ, ఇతరుల్ని భయపెట్టగలనో లేదో టెస్ట్‌ చేయాలని ఉంది'' అని వివరించింది రాయ్‌ లక్ష్మి.

  ఆమె సినిమాల విషయానికొస్తే....

  ఆమె సినిమాల విషయానికొస్తే....

  ప్రముఖ నృత్యదర్శకుడు లారెన్స్‌ దర్శకత్వంలో వస్తున్న తదుపరి చిత్రంలో లక్ష్మీరాయ్ నటిస్తోంది. ఓ జిమ్నాస్టిక్స్‌ క్రీడాకారిణిగా నటిస్తున్నట్లు సమాచారం

  అప్పట్లో తెలుగులో...

  అప్పట్లో తెలుగులో...

  లక్ష్మిరాయ్ తెలుగులో 'కాంచనమాల కేబుల్ టీవీ' చిత్రం ద్వారా పరిచయం అయింది. దాదాపు పదేళ్లుగా లక్ష్మీరాయ్ సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. అయితే ఆమెకు ఇప్పటి వరకు సరైన బ్రేక్ రాలేదు.

  కలిసిరాలేదు కానీ...

  కలిసిరాలేదు కానీ...

  లక్ష్మీరాయ్ ఉన్నది అందాల ప్రదర్శనకే అన్నట్లు...ఆమెకు అలాంటి హాట్ అండ్ సెక్సీ క్యారెక్టర్లే వస్తున్నాయి. ఈ మధ్య ఐటం సాంగులు చేయడానికి కూడా లక్ష్మీరాయ్ వెనకాడటం లేదు. రవితేజ బలుపు చిత్రంలో లక్ష్మీరాయ్ చేసిన ఐటం సాంగ్ సినిమాకు హైలెట్ అయింది. ప్రస్తుతం లక్ష్మీరాయ్ రెండు మళయాలం, కన్నడ, తమిళంలో ఒక్కో సినిమా చేస్తోంది.

  English summary
  Lakshmi shocked said "It was the scariest and the most exhilarating experience for me. Jumping off the plane from 13,000-ft makes one feel the world is in one's control. I love adventure challenges, and sky diving tops the list. Trust me, it's one of the best feelings ever,"
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X