»   »  పవన్ తో డాన్స్...వైరల్ ఫీవర్...హెల్ప్ లెస్

పవన్ తో డాన్స్...వైరల్ ఫీవర్...హెల్ప్ లెస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమకు సంభందించిన ప్రతీ సమాచారాన్ని అభిమానులతో పంచుకుంటూ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో యాక్టివ్ గా ఉంటన్నారు సెలబ్రెటీలు. అలాంటి వారిలో లక్ష్మీ రాయ్ మరో అడుగు ముందే ఉంటుంది. తాజాగా ఆమెకు వైరల్ ఫ్లూ జ్వరం వచ్చింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఇదిగో ఈ క్రింద విధంగా ఆమె ట్వీట్ చేసింది.


మరో ప్రక్క ... పవన్‌కల్యాణ్‌తో కలిసి నటించే అవకాశాన్ని చేజిక్కించుకొంది రాయ్‌ లక్ష్మి. పవన్‌ హీరోగా నటిస్తున్న 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'లో ఓ కీలక పాత్రతో పాటు, స్పెషల్ సాంగ్ చేయబోతోందామె. ఆ విషయాన్ని స్వయంగా ప్రకటించింది రాయ్‌ లక్ష్మి.
 RAAI LAXMI Hate to face the camera when SICK

'కాంచనమాల కేబుల్‌టీవీ'తో తెలుగు తెరకు పరిచయమైన ఆమె ఆ తర్వాత కూడా బోలెడన్ని చిత్రాలు చేసింది. స్పెషల్ సాంగ్ లలోనూ మెరిసింది. అయితే పవన్‌కల్యాణ్‌తో కలిసి నటించడం ఇదే తొలిసారి. లక్ష్మీ రాయ్‌గా పరిచయమైన ఆమె కొంతకాలం క్రితమే తన పేరును రాయ్‌లక్ష్మిగా మార్చుకొంది.

 RAAI LAXMI Hate to face the camera when SICK

ఇక ఇటీవల ఈ సాంగ్ షూటింగ్ పూర్తైంది. ఈ షూటింగ్ సందర్భంగా తీసిన కొన్ని ఫొటోలను రాయ్‌ లక్ష్మి తన అధికారిక ట్విట్టర్‌ ఖాతా ద్వారా విడుదల చేశారు. ఆ విధంగా ఆమె పవన్ అభిమానులకు సైతం అభిమాన నటిగా మారిపోయే ప్రయత్నం చేస్తోంది.

 RAAI LAXMI Hate to face the camera when SICK

లక్ష్మీ రాయ్ స్పందిస్తూ...‘సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో నేను ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాను. చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. పవన్ కళ్యాణ్ గారితో కలిసి నేను ఈ సినిమాలో ఫస్ట్ టైం డాన్స్ కూడా చేయడం మీరు చూస్తారు' అని వెల్లడించారు.

English summary
Lakshmi Rai tweeted:"Hate to face the camera when SICK 😖down wit all kinds of viral flu😡😩drained n tired having medicines😨#helpless"
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu