»   » కొత్తగా ఉంది : రాజ్ తరణ్ 'కిట్టూ ఉన్నాడు జాగ్రత్త' కాన్సెప్టు టీజర్ (వీడియో)

కొత్తగా ఉంది : రాజ్ తరణ్ 'కిట్టూ ఉన్నాడు జాగ్రత్త' కాన్సెప్టు టీజర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :'ఉయ్యాల జంపాల'తో అనుకోకుండా హీరో అయిపోయిన రాజ్‌తరుణ్‌, 'కుమారి 21 ఎఫ్‌', సినిమా చూపిస్తా మావా తదితర చిత్రాలతో యంగ్‌ హీరోల రేసులోకి వచ్చేసి, వరస హిట్స్ తన ఉనికిని బాగానే చాటుకుంటున్నాడు. ఈ యంగ్ జనరేషన్ హీరోల లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.

ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా.. హీరోగా మంచి విజయాలు సాధిస్తున్న రాజ్ తరుణ్ ప్రస్తుతం ఏకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమా కాన్సెప్ట్ టీజర్ ను విడుదల చేశారు.

Raaj Tarun's Kittu Unnadu Jagratha Teaser

వంశీ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'కిట్టూ ఉన్నాడు జాగ్రత్త' అనే టైటిల్ తో వస్తోంది. ప్రస్తుతం షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. రాజ్ తరుణ్ సరసన అనూ ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ఆ టీజర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

ఈ టీజర్ లో ...ఇంటికి 'కుక్కలున్నాయ్ జాగ్రత్త' అనే బోర్డు ఉంటే చాలు.. అక్కడికి కిట్టు వచ్చేస్తాడట. అడిగినంత క్యాష్ వందల్లో ఇస్తే ఓకె.. లేదని పాత 1000 లేదా 500 నోట్లలో ఇస్తే మాత్రం.. కుక్క రాదు.. దాని బొక్కే వస్తుంది.. అంటున్నాడు ఈ కిట్టూ. అదే ఈ కిడ్నాపర్ స్పెషాలిటీ.

ఇక ఈ కాన్సెప్ట్ టీజర్ చూస్తూంటే .. మరోసారి రాజ్ తరుణ్ ఒక హిట్టు కంటెంట్ తోనే వస్తున్నాడని అనిపిస్తోంది. ఎందుకంటే ఇలా కుక్కలను ఎత్తుకెళ్ళిపోవడం తరహా పనులన్నీ పిల్లలకీ ఫ్యామిలీ ఆడియన్స్ కు చాలా బాగా ఎక్కుతాయని ఎక్సపెక్ట్ చేస్తున్నారు.

English summary
Teaser of Young hero Raj Tarun’s upcoming movie, ‘Kittu Unnadu Jagratha’ is out. Anu Emmanuel of Majnu fame will be seen romancing Raj Tarun in this film. Vamsi of Dongata fame has directed the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu