హీరోయిన్ రాశి రీ ఎంట్రీ...డిటేల్స్
రాజేంద్రప్రసాద్ సరసన ఆమె హీరోయిన్ చేస్తూ ఓ చిత్రం మొదలైంది. రాజేంద్రప్రసద్ ప్రధాన పాత్రధారిగా అభి స్టూడియోస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. సాగర్, రాశి, మృదుల ఇతర ప్రధాన పాత్రధారులు. పి.ఎ.అరుణ్‌ప్రసాద్ దర్శకుడు. బి.సత్యనారాయణ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ సాగుతోంది.
దర్శకుడు మాట్లాడుతూ ''ఆద్యంతం నవ్వులు పండించే కథతో దీన్ని తీర్చిదిద్దుతున్నాం. రాజేంద్రప్రసాద్ నటన అందరికీ నచ్చుతంది. మొగలిరేకులు ధారావాహికలో నటించిన సాగర్‌కు అంతకు మించిన గుర్తింపు తీసుకొస్తుంది ఈ చిత్రంలోని పాత్ర'' అన్నారు.
కథతోపాటే హాస్యాన్ని మేళవించిన చిత్రంతో పాతరోజుల్ని ప్రేక్షకులకు గుర్తుకు తెస్తామన్నారు రాజేంద్రప్రసాద్. ఈ పాటల్ని విదేశాల్లో చిత్రిస్తామన్నారు నిర్మాత. ఈ చిత్రంలో గిరిబాబు, జయప్రకాష్‌రెడ్డి, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, పిల్లా ప్రసాద్, హేమ తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications












