‘రభస’ ఏరియా వైజ్ డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న తాజాచిత్రం 'రభస'. సమంత, ప్రణీత ఎన్టీఆర్‌కు జోడీగా నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్‌తో 'కందిరీగ' తీసి తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.ఈ చిత్రం ఆడియోని జూలై 20న విడుదల చేయాలని దర్శక,నిర్మాతలు నిర్ణయించినట్లు తాజా సమాచారం.
తాజాగా ఈ చిత్రానికి డిస్ట్రిబ్యూటర్స్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి....

నైజాం : దిల్ రాజు
సీడెడ్: బళ్లారి లక్ష్మీకంఠరెడ్డి
నెల్లూరు : హరి పిక్చర్స్
కృష్ణ: సురేష్ మూవీస్
గుంటూరు : హరి పిక్చర్స్
కర్ణాటక : వేణు గోపాల్
ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











