»   » గమనించండి: ఆడియో విడుదల తేదీ మారింది

గమనించండి: ఆడియో విడుదల తేదీ మారింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న 'రభస' సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాలోని చివరి పాట షూటింగ్ స్విట్జర్ ల్యాండ్ లో పూర్తి కానుంది. ఇక ఈ చిత్రం ఆడియోని మొదట జూలై 27వ రిలీజ్ చేయాలనుకున్నారు కానీ దానిని వాయిదా వేసి ఆగష్టు 1న రిలీజ్ చేయనున్నారు. ఈ ఆడియో విడుదల కార్యక్రమం శిల్పకళా వేదికలో అభిమానుల సమక్షంలో నిర్వహించనున్నారు.

ఎన్.టి.ఆర్ సరసన సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి సంతోష్ శ్రీనివాస్ దర్శకుడు. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కామెడీ పూర్తి ప్రాధాన్యత ఉందని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి బెల్లంకొండ సురేష్ నిర్మాత. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Rabhasa audio release date changed

చిత్ర సమర్పకుడు బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ ''ఆది' తరవాత ఎన్టీఆర్‌తో తెరకెక్కిస్తున్న చిత్రమిది. దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్న విధానం బాగుంది. ఎన్టీఆర్‌ డ్యాన్సులు, పోరాటాలు అభిమానులకు థ్రిల్‌ కలిగిస్తాయి'' అన్నారు.

దర్శకుడు చెబుతూ ''ఎన్టీఆర్‌ అభిమానులకు ఈ సినిమా పండగలా ఉంటుంది. ఆయనతో పనిచేయడం సంతోషంగా ఉంది. తమన్‌ చక్కటి పాటలిచ్చారు''అన్నారు. సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'రభస'. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేయబోతున్నారు.

ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్‌ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

English summary
Rabhasa movie makers are planning to release the audio of the film on 1st August at Shilpa Kala Vedika. Earlier, the movie was planned to make an audio release on 27th August but is preponed now. The movie is all set to make a grand release on 14th August.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu