»   » మరో పది రోజుల్లో ‘రభస’ రచ్చ రంబోలా..(ట్రాక్ లిస్ట్)

మరో పది రోజుల్లో ‘రభస’ రచ్చ రంబోలా..(ట్రాక్ లిస్ట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జూ ఎన్టీఆర్ 'రభస' ఆడియో మరో పది రోజుల్లో విడుదల కాబోతోంది. జులై 27వ తేదీన శిల్ప కళా వేదికలో ఆడియో ఫంక్షన్‍‌కు ఏర్పాట్లు చేసారు. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఆడియో ట్రాక్ లిస్ట్ కూడా బయటకు వచ్చింది. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో రభస థీమ్ సాంగుతో కలుపుకుని 6 సాంగులున్నాయి.

ఆడియో ట్రాక్ లిస్ట్
1. లాల్ సలామ్
2. సయ్యో సయ్యోరే
3. చెలి నిశ్చెలి
4. సరోజా సరోజా
5. రాక్షసి రాక్షసి
6. రభస థీమ్ సాంగ్

Rabhasa audio track list

జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజాచిత్రం 'రభస'. సమంత, ప్రణీత ఎన్టీఆర్‌కు జోడీగా నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై బెల్లంకొండ సురేష్‌, బెల్లంకొండ గణేష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్‌తో 'కందిరీగ' తీసి తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న సంతోష్‌ శ్రీనివాస్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రం కోసం కేవలం నటించడం మాత్రమే కాదు...ఓ పాట కూడా పాడారు జూ ఎన్టీఆర్. 'రాకాసి రాకాసి' అనే సాంగును జూ ఎన్టీఆర్‌తో పాడించాడు సంగీత దర్శకుడు తమన్. గతంలోనూ జూ ఎన్టీఆర్ తన సినిమాల్లోని పాటలకు మధ్య మధ్యలో వాయిస్ ఇచ్చాడు. అయితే ఈ సినిమాకు తొలిసారిగా పూర్తిగా పాటను పాడారు.

హీరోలు పాట పాడటం వల్ల సినిమాకు పబ్లిసిటీ మరింత పెరుగుతుందనే ఉద్దేశ్యంతో ఇలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే టాకీ పార్ట్ పూర్తి చేసిన చిత్ర యూనిట్ బ్యాలెన్స్ పాట పూర్తి చేయడం కోసం ఇటలీ బయలుదేరారు. పాట షూటింగ్ పూర్తయ్యాక పోస్టు ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయి.

ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్‌ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

English summary
Young Tiger Jr NTR Rabhasa audio release is going to be a grand affair with several industry biggies attending the event. Rabhasa audio launch will happen on July 27th at Shilpa Kala Vedika.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu